IND vs PAK : టీ20 వరల్డ్ కప్‌లో టీమిండియా(Team India), పాకిస్థాన్(Pakistan) మ్యాచ్ అభిమానులకు మస్త్ థ్రిల్‌నిచ్చింది. ఉత్కంఠ పోరులో భారత జట్టు గెలుపొందడంతో న్యూయార్క్‌తో పాటు ఇండియా అంతా సంబురాల్లో మునిగిపోయింది. అయితే.. పాకిస్థాన్‌లో మాత్రం మ్యాచ్ రోజే విషాదం నెలకొంది. చిరకాల ప్రత్యర్థుల మ్యాచ్ ఓ యూట్యూబర్ (Youtuber) ప్రాణాలు బలిగొన్న సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పాకిస్థాన్‌లో దాయాదుల మ్యాచ్ గురించి సరదాగా వ్లాగ్(Vlog) చేయబోయిన సాద్ అహ్మద్(Saad Ahmed) అనే యూట్యూబర్‌ను ఓ సెక్యూరిటీ గార్డ్ కాల్చి చంపేశాడు.
అసలేం జరిగిందంటే.. ఐసీసీ టోర్నీలో దాయాదుల ఫైట్‌పై జనాల అభిప్రాయం తెలుసుకోవాలని సాద్ అహ్మద్ అనుకున్నాడు. అందుకని జూన్ 9వ తేదీన అతడు కరాచీ(Karachi)లోని మొబైల్ మార్కెట్‌కు వెళ్లాడు. అక్కడు ఉన్నవాళ్లను పలకరించి టీమిండియా, పాక్ మ్యాచ్‌పై వాళ్ల ఓపినీయన్ తీసుకున్నాడు. మ్యాచ్‌లో ఎవరు గెలుస్తారు? అత్యధిక స్కోర్ కొట్టేది ఎవరు? .. ఇలా రకరకాల ప్రశ్నలు అడిగిన సాద్ వాళ్లతో వ్లాగ్ తీశాడు.
అయితే.. అక్కడే ఉన్న ఓ సెక్యూరిటీ గార్డ్‌ను సాద్ ఇండియా, పాక్ మ్యాచ్ గురించి అడిగాడు. కానీ, సెక్యూరిటీ గార్డ్ మాత్రం స్పందించలేదు.అయినా సరే సాద్ అతడిని ప్రశ్నలతో విసిగించాడు. దాంతో, చిర్రెత్తుకొచ్చిన సదరు సెక్యూరిటీ పర్సన్ తన తుపాకీతో సాద్‌ను కాల్చాడు. అతడు మైక్‌ను నా ముఖానికి దగ్గరగా పెట్టడం మొదలెట్టాడు. దాంతో, నాకు చాలా కోపం వచ్చింది’ అని సెక్యూరిటీ వ్యక్తి అనడం వీడియోలో రికార్డయ్యింది.
New York City was swept up in #INDvPAK fever 🥳#T20WorldCup pic.twitter.com/A2qvXSRQCl
— ICC (@ICC) June 10, 2024
తూటాల గాయంతో రక్తమెడ్డుతున్న సాద్‌ను అక్కడి వాళ్లు వెంటనే అతడిని హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. కానీ, మార్గం మధ్యలోనే అతడు ప్రాణాలు విడిచాడని డాక్టర్లు చెప్పారు. దాంతో.. యూట్యూబ్ వీడియో కోసం ప్రాణాలు పోగొట్టుకున్న సాద్‌ను తలచుకొని అతడి కుటుంబసభ్యులు కన్నీటిపర్యంతమయ్యారు.
🇮🇳 WIN in New York 🔥
Jasprit Bumrah’s superb 3/14 helps India prevail in this iconic rivalry against Pakistan 👏#T20WorldCup | #INDvPAK | 📝: https://t.co/PiMJaQ5MS3 pic.twitter.com/Z2EZnfPyhn
— ICC (@ICC) June 9, 2024