Srisailam | శ్రీశైలం : శ్రీశైలం శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లను డోన్ ఎమ్మెల్యే కోట్ల జయ సూర్య ప్రకాష్ రెడ్డి శుక్రవారం దర్శించుకున్నారు. ఆలయం ప్రధాన గోపురం వద్దకు చేరుకున్న ఎమ్మెల్యేకు ఈవో పెద్దిరాజు, ఏఈవో శ్రీనివాసరావు, అర్చక వేద పండితులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు.
అనంతరం శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లకు ఎమ్మెల్యే జయ సూర్య ప్రకాశ్ రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. ఎమ్మెల్యేకు అమ్మవారి ఆశీర్వచన మండపంలో అర్చక వేద పండితులు వేద ఆశీర్వచనం అందించి, శేష వస్త్రాలు, లడ్డు ప్రసాదంతో పాటు జ్ఞాపికలను అందించారు. ఈ కార్యక్రమంలో ఉభయ దేవాలయాల అర్చక వేద పండితులు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
Volunteer System | వాలంటీర్ల వ్యవస్థ రద్దు చేస్తారా? అసెంబ్లీ వేదికగా క్లారిటీ ఇచ్చిన మంత్రి డోలా
YS Jagan | అలా అయితేనే రాజకీయాల్లో ఉండగలరు.. వైఎస్ జగన్కు పయ్యావుల సలహా
AP News | అసెంబ్లీ తప్ప రాష్ట్రంలో అన్నింటినీ జగన్ కుదవ పెట్టారు.. ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఎద్దేవా