ఆశ నిరాశ కాలేదు
నిరాశగా నిప్పులు చెరగలేదు
ఇది నైపుణ్యం సామర్థ్యంతో గెలుపు
అనుభవం అంకితభావంతో గెలుపు
సమష్టి సమరసంతో గెలుపు
ఆర్భాటాలు కనబడలేదు..ఆట తప్ప
ఉద్ఘాటనలు వినబడలేదు.. వేట తప్ప
అభిమానుల్ని ఊగించి ఆనందడోలి
కల్లో ఊరేగించి చెమటోడ్చిన చిత్రం
చండప్రచండంగా నిప్పులు
చెరిగే బాంబుల్నెదురుకొని
ఆధునిక సమరవ్యూహంలో
స్వప్నం సాకారమైన దృశ్యం
కదం తొక్కాల్సిన ఆసన్న
సమయంలో నిర్భయ ప్రదర్శనం
ఒడిదొడుకుల్లోంచి ఒడ్డుకు చేర్చాలన్న సంయమన సంకల్పం
జాతి పులకించి పులకరించి కేరింతల
గిలిగింతల ప్రపంచ యవనికపై
ప్రతిబింబం ఒక్క ఆసక్తి అభిరుచేనా
వీరోచితం క్రీడాభినివేశం ఉన్నప్పుడేగా
వైఫల్యం ఎదురుపడక
చిమ్మచీకట్లు చుట్టుముట్టక
అనూహ్యానుమానవమాన
పరాజయ ఖడ్గంపై పడక
ఆశయం ఉన్నతమైనప్పుడు
ప్రయత్నం ఉత్కష్టం కావాలి
ఆశయం విజయ శిఖరాది
రోహణమైనప్పుడు క్రమశిక్షణలో
కఠోర కార్యదక్షత చూపాలి
రాజీలేని పోరు రాణించిన రోజు
రాటుదేలిన తీరు రవళించిన రోజు