YS Jagan | అలా అయితేనే రాజకీయాల్లో ఉండగలరు.. వైఎస్ జగన్కు పయ్యావుల సలహా
YS Jagan | ఇండియా కూటమి నేతలతో చర్చలకే జగన్ ఢిల్లీ వెళ్లారని ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ఆరోపించారు. రాజకీయాల్లో ప్రతిపక్షం ఉండాలని ఆయన అన్నారు. వైఎస్ జగన్కు ప్రతిపక్ష హోదా రావడానికి ఇంకో పదేండ్లు పడుతుందని ఎద్దేవా చేశారు.
YS Jagan | ఇండియా కూటమి నేతలతో చర్చలకే జగన్ ఢిల్లీ వెళ్లారని ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ఆరోపించారు. రాజకీయాల్లో ప్రతిపక్షం ఉండాలని ఆయన అన్నారు. వైఎస్ జగన్కు ప్రతిపక్ష హోదా రావడానికి ఇంకో పదేండ్లు పడుతుందని ఎద్దేవా చేశారు. శుక్రవారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద పయ్యావుల మాట్లాడుతూ.. జగన్కు దమ్ముంటే రాజకీయ హత్యలకు సంబంధించిన వివరాలను బయటపెట్టాలని సవాలు విసిరారు. బయట చెబుతున్న విషయాలను అసెంబ్లీలో ప్రస్తావించాలని డిమాండ్ చేశారు.
ప్రజలు జగన్కు ఓట్లేసి 11 సీట్లయినా ఇచ్చింది అసెంబ్లీకి వచ్చి ప్రజా సమస్యలపై చర్చిస్తారని.. కానీ ఇలా సింగిల్ కెమెరాతో ప్రెస్మీట్ పెట్టడానికి కాదని పయ్యావుల అన్నారు. రాజకీయాల్లో అభిమానులు, అవమానించే వారు ఉండటం సహజమని పేర్కొన్నారు. అభిమానించినా, అవమానించినా నిలదొక్కుకున్న వాళ్లే రాజకీయంగా ఉండగలరని గ్రహించాలని జగన్కు హితవు పలికారు. జగన్ ఇలాగే పోతే 11 మంది ఎమ్మెల్యేలు కూడా ఒక్కరిగా మిగిలిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు.
ప్రతిపక్ష పాత్ర నిర్వర్తించలేనని సభలో చేతులెత్తేసిన జగన్.. ప్రతిపక్ష హోదా కావాలని కోర్టులో అడుగుతున్నారని పయ్యావుల ఎద్దేవా చేశారు. అసెంబ్లీలో అడగాల్సినవి ఢిల్లీలో అడుగుతానని అంటున్నారని విమర్శించారు. ఇండియా కూటమి ప్రతినిధులతో రహస్య చర్చల కోసం ఢిల్లీకి వెళ్లానని ధైర్యంగా చెప్పొచ్చు కదా అని అడిగారు. శ్వేతపత్రంలో చూపిన రూ.9.30 లక్షల కోట్ల అప్పు కచ్చితంగా పెరుగుతుందని తెలిపారు. తెలంగాణ కంటే మద్యం ధరలు ఎక్కువ ఉంటే.. మన ఆదాయం ఎక్కడికి పోయిందని ప్రశ్నించారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dakshinamukhi Anjaneya Swamy | పార్డి (కె) గ్రామంలో ముగిసిన అఖండ హరినామ తాళ సప్తహ వేడుకలు
Mokshagna | మోక్షజ్ఞ డెబ్యూ మూవీపై క్రేజీ అప్డేట్.. దర్శకత్వ బాధ్యతలు వశిష్ఠకే, జనవరి చివరి నుంచి షూటింగ్..
Firecrackers History | దీపావళికి బాణసంచా ఎలా వచ్చింది? చైనా నుంచి భారత్కు టపాసుల ప్రయాణం ఇదే!
Scene | బాక్సాఫీస్ వద్ద సూర్య ‘సీన్’ సెన్సేషన్.. రెండు రోజుల్లో 11.5 లక్షలకు పైగా టికెట్లు!
Diwali Celebrations | దేశంలో ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా దీపావళి.. మనకు తెలియని పండుగ విశేషాలివే!
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

