ఇస్లామాబాద్: ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం చాన్స్‌లర్ పదవి కోసం పాకిస్థాన్ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ పోటీ చేయబోతున్నారు. ఇమ్రాన్ ఖాన్ జైలు నుంచే ఆన్లైన్ బ్యాలట్‌లో పాల్గొనబోతున్నారు. ఈ విషయాన్ని ఇమ్రాన్ సలహాదారు సయ్యద్ జుల్ఫి బుఖారీ కూడా ధ్రువీకరించారు.
ఇమ్రాన్ ఖాన్ 1972లో ఆక్స్‌ఫర్డ్‌లోని కెబ్లె కళాశాలలో ఆర్థిక, రాజనీతి శాస్ర్తాలను చదివారు. ఆయన 2005-2014 మధ్య కాలంలో బ్రాడ్ఫోర్డ్ విశ్వవిద్యాలయం ఛాన్సలర్‌గా పని చేశారు. ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం చాన్స్‌లర్ పదవికి పోటీలో బ్రిటన్ మాజీ ప్రధానులు టోనీ బ్లెయిర్, బోరిస్ జాన్సన్ కూడా ఉన్నారు.