ఫైనల్‌కు భారత్
మహిళల ఆసియా కప్‌లో డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగిన భారత క్రికెట్ జట్టు వరుసగా 9వ ఎడిషన్‌లోనూ ఫైనల్ చేరింది. గురువారం దంబుల్లా వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి సెమీస్‌లో ఆ జట్టును చిత్తుగా ఓడించి టైటిల్ పోరుకు దూసుకెళ్లింది. భారత బౌలర్లు రేణుకా సింగ్ ఠాకూర్ (3/10), రాధా యాదవ్ (3/14) బౌలింగ్ దెబ్బతో మొదట బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్..
- సెమీస్‌లో బంగ్లాపై ఘన విజయం
- మెరిసిన రాధా, రేణుకా సింగ్
- మహిళల ఆసియా కప్
దంబుల్లా: మహిళల ఆసియా కప్‌లో డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగిన భారత క్రికెట్ జట్టు వరుసగా 9వ ఎడిషన్‌లోనూ ఫైనల్ చేరింది. గురువారం దంబుల్లా వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి సెమీస్‌లో ఆ జట్టును చిత్తుగా ఓడించి టైటిల్ పోరుకు దూసుకెళ్లింది. భారత బౌలర్లు రేణుకా సింగ్ ఠాకూర్ (3/10), రాధా యాదవ్ (3/14) బౌలింగ్ దెబ్బతో మొదట బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్.. 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 80 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఆ జట్టులో కెప్టెన్ నైగర్ సుల్తానా (32), శ్రోణ అక్తర్ (19 నాటౌట్) మినహా మిగిలిన వారంతా సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. అనంతరం స్వల్ప ఛేదనను భారత్..11 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా పూర్తిచేసింది. స్మృతి మంధాన (39 బంతుల్లో 55 నాటౌట్, 9 ఫోర్లు, 1 సిక్స్), షఫాలీ వర్మ (28 బంతుల్లో 26 నాటౌట్, 2 ఫోర్లు) మరో 9 ఓవర్లు మిగిలుండగానే మ్యాచ్‌ను ముగించారు. రేణుకాకు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది.
రేణుకా, రాధా ధాటికి కుదేలు
టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్‌ను ఆదిలోనే రేణుకా తన పేస్ పదునుతో బెంబేలెత్తించింది. మొదటి ఓవర్ నాలుగో బంతికే ఓపెనర్ దిలారా అక్తర్ (4)ను ఔట్ చేసిన ఆమె.. వరుస ఓవర్లలో ఇష్మా తంజీమ్ (8), ముర్షిదా ఖటూన్(4)ను బోల్తా కొట్టించి ఆరంభంలోనే బంగ్లాను కోలుకోలేని దెబ్బకొట్టింది. ఆ తర్వాత స్పిన్నర్ రాధ బంగ్లాను ఆటాడుకుంది. మధ్య ఓవర్లలో దీప్తిశర్మతో కలిసి ప్రత్యర్థిని కట్టడిచేసిన ఈ యువ స్పిన్నర్.. మిడిలార్డర్‌ను దెబ్బకొట్టడంతో బంగ్లా కోలుకోలేకపోయింది.
11 ఓవర్లలోనే ఉఫ్..
స్వల్ప లక్ష్యాన్ని భారత్ అలవోకగా ఛేదించింది. ఆరంభం నుంచే ఓపెనర్లు బంగ్లాదేశ్ బౌలర్లను లక్ష్యంగా చేసుకుని వేగంగా పరుగులు రాబట్టారు. పాకిస్థాన్, శ్రీలంక మధ్య జరిగిన రెండో సెమీస్‌లో లంక మహిళలు 3 వికెట్ల తేడాతో గెలిచింది. భారత్, శ్రీలంక మధ్య ఆదివారం టైటిల్ పోరు జరుగనుంది.
సంక్షిప్త స్కోర్లు: బంగ్లాదేశ్: 20 ఓవర్లలో 80/8 (సుల్తానా 32, అక్తర్ 19 నాటౌట్, రేణుక 3/10, రాధా 3/14)
భారత్: 11 ఓవర్లలో 83/0 (మంధాన 55 నాటౌట్, షఫాలీ 26 నాటౌట్)
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

