లేఖలు… ఆరె కులస్తులను ఆదుకోవాలె
ఆర్థికంగా, రాజకీయంగా, విద్యాపరంగా, సామాజికపరంగా అన్ని రంగాల్లో వెనుకబడిన కులాలలో ఆరె కులం ఒకటి. తెలంగాణలో దాదాపు పది లక్షలకు పైగా ఆరె కులస్తులు ఉన్నారు. అయితే దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏండ్లు గడిచినా ఆరె కులస్తులు చట్టసభల్లో అడుగుపెట్టకపోవడం శోచనీయం.
ఆర్థికంగా, రాజకీయంగా, విద్యాపరంగా, సామాజికపరంగా అన్ని రంగాల్లో వెనుకబడిన కులాలలో ఆరె కులం ఒకటి. తెలంగాణలో దాదాపు పది లక్షలకు పైగా ఆరె కులస్తులు ఉన్నారు. అయితే దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏండ్లు గడిచినా ఆరె కులస్తులు చట్టసభల్లో అడుగుపెట్టకపోవడం శోచనీయం. దేశాభివృద్ధిలో ఎంతో కీలకప్రాత పోషిస్తున్నవారిని రాజకీయ పార్టీలు జెండాలు మోసే కూలీలుగానే చూస్తున్నాయి తప్ప, ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కల్పించడం లేదు. సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీ పదవులకే వారు పరిమితం అవుతున్నారు. తెలంగాణలో ఈ సామాజికవర్గానికి 5 లక్షల వరకు ఓట్లున్నాయి. అనేక నియోజకవర్గాల్లో అభ్యర్థుల గెలుపోటములను శాసించే స్థాయిలో వారున్నారు. వ్యవసాయం చేస్తూ పొట్టపోసుకునే ఈ సామాజికవర్గానికి చెందినవారు ఇప్పుడిప్పుడే తమ పిల్లలను చదివిస్తున్నారు. అయితే ఈ సామాజికవర్గానికి తెలంగాణలో బీసీ-డీ సర్టిఫికెట్ ఇస్తుండగా.. కేంద్రం మాత్రం ఓబీసీ జాబితాలో చేర్చలేదు. ఈ కారణంగా యువత విద్య, ఉద్యోగ అవకాశాలు కోల్పోతున్నారు. కాబట్టి ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆరె కులస్తులను గుర్తించాలి. ఓబీసీ జాబితాలో చేర్చాలి. దాంతో పాటు రాష్ట్రంలో ఆరె కార్పొరేషన్ ఏర్పాటు చేసి, వారి అభ్యున్నతికి కృషి చేయాలి.
– మోటె చిరంజీవి
మా బాగోగులు పట్టవా!
సింగరేణి నిధులను వినియోగించుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం.. చెమట, రక్తం ధారపోసిన రిటైర్డ్ ఉద్యోగులకు ఉచిత, అపరిమిత వైద్య సౌకర్యాలు కల్పించేందుకు తటపటాయిస్తున్నది. గోదావరి తల్లి నిస్వార్థంగా అందరికీ జలాలు అందిస్తున్నట్టే.. బొగ్గు గనుల్లో తమ ప్రాణాలను పణంగా పెట్టి ఉద్యోగులు దేశాభివృద్ధికి పాటుపడుతున్నారు. బొగ్గు వలె కాలికాలి ఉద్యోగ విరమణ నాటికి బూడిదైపోతున్నారు. ఆ తర్వాత శేష జీవితాన్ని అష్టకష్టంగా, భయంకరమైన రీతిలో గడపాల్సి వస్తున్నది.
ప్రమాదాలు, కాలుష్యం మధ్యనే పనిచేసే ఉద్యోగులు.. రిటైర్మెంట్ తర్వాత అనారోగ్యాలతో సహవాసం చేయాల్సి వస్తున్నది. ఈ నేపథ్యంలో పెరుగుతున్న వైద్య ఖర్చులకు సీపీఆర్ఎంఎస్ రూ.8 లక్షలు ఎటూ సరిపోవడం లేదు. ఎక్కువ ఖర్చుతో కూడుకున్న రోగాలకు ఉచిత వైద్య సౌకర్యాలకు సంబంధించిన సర్క్యులర్ ఇప్పటివరకు జారీ కాకపోవడంతో చాలామంది ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. దీనికి తోడు ఏరియా హాస్పిటల్లో ఇన్ పేషెంట్ వసతి తీసివేయడంతో మూలిగే నక్కపై తాటిపండు పడ్ట చందంగా పరిస్థితి తయారైంది. ఈ నేపథ్యంలో వివిధ ప్రభుత్వ శాఖలు తమ రిటైర్డ్ ఉద్యోగులకు అమలుచేస్తున్నట్టు విస్తృత వైద్య సేవలు కల్పించేలా కాంగ్రెస్ సర్కార్ ఆదేశాలు జారీ చేయాలి.
– దండంరాజు రాంచందర్‌రావు
Read Today's Latest Editpage News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | వర్షిణికి నాగార్జున గట్టి కౌంటర్.. దేబ్జానీకి క్లాస్, నరేష్‌కు షాక్!
Allahabad High Court | యూపీలో సిగ్గుచేటుగా పౌరస్వేచ్ఛ.. రాష్ట్ర హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు
Sonia Gandhi | ఎమెర్జెన్సీ విధించడం పొరపాటు నిర్ణయం.. ఆత్మకథలో పేర్కొన్న సోనియా
Agniveer Scheme | మరో రెండేండ్ల సర్వీసు తర్వాత అగ్నివీరులకు పొడిగింపు
Supreme Court | ఓబీసీల పాత నియామకాలు, పదోన్నతులు కొనసాగించొచ్చు : సుప్రీంకోర్టు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

