WhatsApp | ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ యూజర్ల సౌకర్యార్థం రోజుకు ఫీచర్ తీసుకొస్తున్నది. తాజాగా యాప్ కోర్ ఫీచర్లో కీలక మార్పు తీసుకు రాబోతున్నది. సాధారణంగా మొబైల్ ఫోన్ ఆధారంగా వాట్సాప్ పని చేస్తుంది. కానీ ఇప్పుడు ఆ అవసరం లేదని వాబీటా ఇన్ఫో చెబుతోంది. యూజర్లు తమ ప్రొఫైల్స్ కోసం విశ్వజనీన యూజర్ నేమ్ క్రియేట్ చేసుకుని వాట్సాప్ అకౌంట్ ఓపెన్ చేయొచ్చు. ఈ యూజర్ నేమ్స్ తో ప్రతి ఒక్కరూ తమ వాట్సాప్ ఖాతాలను తెరవడంతోపాటు వాటిల్లో చాటింగ్ చేయొచ్చు. అయితే, ఇది ప్రస్తుతానికి వాట్సాప్ వెబ్ యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంటుంది.
అభివృద్ధి దశలో ఉన్న ఈ ఫీచర్ రిఫైన్ చేసిన తర్వాత వాట్సాప్ వెబ్ న్యూ ఇంటర్ ఫేస్‌ను ప్రదర్శిస్తుంది. ఫోన్ నంబర్ షేర్ చేయకుండానే ఆన్లైన్లో యూజర్లు అనేబుల్ చేసుకోవడానికి, ఇతరులతో కనక్ట్ కావడంలో ప్రైవసీకి ప్రాధాన్యం కల్పిస్తారు. కొత్తగా క్రియేట్ చేసుకునే యూజర్ నేమ్ వల్ల ప్రైవసీకి అదనపు లేయర్ కానున్నది. అటుపై మీ వ్యక్తిగత సమాచారానికి మరింత రక్షణ లభిస్తుందని చెబుతున్నారు. ప్రస్తుతం అభివృద్ధి దశలో ఉన్న ఈ ఫీచర్.. త్వరలో యూజర్లకు అందుబాటులోకి రానున్నది.
Best Family Cars | రూ.10 లక్షల్లోపు ధరలో బెస్ట్ ఫ్యామిలీ కార్లివే.. !
Union Budget | 1947 నుంచి 2024 వరకూ బడ్జెట్లో మార్పులూ చేర్పులూ ఇలా..
Union Budget 2025 | కొలువుల కల్పనే కష్టం.. నిర్మలమ్మ ‘బడ్జెట్’ ముందు సవాళ్లివే..!
Union Budget 2024-25 | ఏడో బడ్జెట్‌తో ఆయన రికార్డుకు విత్త మంత్రి నిర్మలమ్మ బ్రేక్..?