IPL 2026 : ఐపీఎల్ తొలి దశ షెడ్యూల్ ప్రకటనతో ప్రాక్టీస్ సెషన్ల జోరు పెంచిన ఫ్రాంచైజీలకు బీసీసీఐ (BCCI) పెద్ద షాకిచ్చింది. మెగా టోర్నీ చరిత్రలో నెట్స్ ప్రాక్టీస్ (Nets Practice)కు సంబంధించి కీలక మార్పులు చేసింది. ప్రాక్టీస్ సెషన్ విషయమై.. కొన్ని నిబంధనలతో కూడిన మార్గదర్శకాలను గురువారం బీసీసీఐ వెల్లడించింది. ఇంతకుముందులా ఇరుజట్ల ఆటగాళ్లు ఒకే పిచ్ మీద సాధన చేయడం కుదరదని బీసీసీఐ తేల్చి చెప్పింది. 19వ సీజన్ నుంచే ఈ షరతు వర్తిస్తుందని ఫ్రాంచైజీలకు స్పష్టంగా చెప్పింది.
ఐపీఎల్ 19వ సీజన్‌కు కౌంట్‌డైన్ మొదలవ్వడంతో.. ఆటగాళ్లంతా నెట్స్ ప్రాక్టీస్‌కు సిద్ధమవుతున్నారు. తొలి దశలో 20 మ్యాచ్‌ల షెడ్యూల్ ప్రకటనతో.. విజయంతో టోర్నీని ఆరంభించాలని ఫ్రాంచైజీలు పట్టుదలతో ఉన్నాయి. ఈ నేపథ్యంలో వారి ఉత్సాహంపై నీళ్లు చల్లుతూ షరుతులు వర్తిస్తాయని బీసీసీఐ కీలక హెచ్చరిక చేసింది. ఇంతకుముందులా ఒకే పిచ్ మీద రెండు జట్ల ఆటగాళ్లు సాధన చేయడం కుదరని కొత్త నియమాన్ని తీసుకొచ్చింది భారత బోర్డు.
⚡️The home team will also have preference over the practice session slot. But the away team’s request will be considered keeping in mind their travel arrangements and if they played a game the previous day#IPL2026
— Cricbuzz (@cricbuzz) March 12, 2026
‘మ్యాచ్‌కు ముందు ఇరుజట్ల ఆటగాళ్లు నెట్స్ ప్రాక్టీస్ సమయంలో వేర్వేరు పిచ్‌లను ఉపయోగించాలి. ఒకజట్టు సాధన చేస్తున్నప్పుడు.. ప్రత్యర్ధి జట్టు ఆటగాళ్లు మైదానంలోకి వస్తే వారికోసం కొత్త నెట్స్‌ను సిద్ధం చేయాలి. మొదటి జట్టు ప్రాక్టీస్ త్వరగా పూర్తైన సరే.. రెండో జట్టు మాత్రం ఆ పిచ్‌ను వాడొద్దు. త్రో డౌన్స్ కోసం కూడా మరో జట్టు ఆటగాళ్లు సాధన చేసిన పిచ్‌ను ఉపయోగించకూడదు’ అని కొత్త నిబంధనకు సంబంధించిన నియమాలను ఐదు పేజీల్లో బీసీసీఐ వెల్లడించింది.
🚨 News 🚨
Presenting the schedule for the first 20 matches of #TATAIPL 2026, to be played from March 28 to April 12, 2026 🗓️
Full schedule will be announced once poll dates are announced for three states set to undergo State Assembly elections.
More details ▶️… pic.twitter.com/8Iq492v8TE
— IndianPremierLeague (@IPL) March 11, 2026
ఈ నియమంతో పాటుగా ప్రాక్టీస్ మ్యాచ్‌ల విషయంలోనూ షరతులు విధించింది బీసీసీఐ. ఒక జట్టు ఫ్లైడ్ లైట్స్ వెలుగులో ప్రాక్టీస్ మ్యాచ్ ఆడాలనుకుంటే.. మ్యాచ్ సమయం మూడున్నర గంటలకు మించకూడదు. రెండు జట్లు రెండేసి ప్రాక్టీస్ మ్యాచ్‌లు ఆడుకోవచ్చు. అయితే.. అందుకు బీసీసీఐ అనుమతి తప్పనిసరి. ప్రధాన వికెట్‌కు పక్కన ఉండే వికెట్‌ను ఎంచుకోవాల్సి ఉంటుంది.
ఎట్టిపరిస్థితుల్లోనూ ప్రాక్టీస్ మ్యాచ్‌లకు మెయిన్ స్క్వేర్ పిచ్‌ను ఉపయోగించవద్దు. ఒకవేళ.. హోమ్ టీమ్ అభ్యర్థన మేరకు ఆ రాష్ట్ర క్రికెట్ సంఘం ప్రత్యామ్నాయంగా ప్రాక్టీస్ కోసం మైదానాన్ని సిద్ధం చేయాల్సి ఉంటుంది. మార్చి 28 నుంచి ఐపీఎల్ 19వ సీజన్ షురూ కానుంది. డిఫెండింగ్ ఛాంపియన్ ఆర్సీబీ ఆరంభ పోరులో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను ఢీకొట్టనుంది.