90 రోజుల్లో మరో 30వేల ఉద్యోగాలు
రానున్న 90 రోజుల్లో 30 వేల ఉద్యోగ ఖాళీలను రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేయనున్నదని ముఖ్యమంత్రి ఏ రేవంత్‌రెడ్డి స్పష్టం చే శారు. తమ ప్రభుత్వం వచ్చిన 90 రోజుల్లోనే 30 వేల ఉద్యోగాలకు నియామక పత్రాలు ఇ చ్చామని తెలిపారు.
- నిరుద్యోగులూ.. సమస్యలపై మంత్రులను కలవండి
- ఫైర్‌మెన్ పాసింగ్ఔట్ పరేడ్‌కు ఆలస్యంగా సీఎం
- సొమ్మసిల్లి పడిపోయిన కొత్త ఫైర్‌మెన్
హైదరాబాద్, జూలై 26 (నమస్తే తెలంగాణ): రానున్న 90 రోజుల్లో 30 వేల ఉద్యోగ ఖాళీలను రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేయనున్నదని ముఖ్యమంత్రి ఏ రేవంత్‌రెడ్డి స్పష్టం చే శారు. తమ ప్రభుత్వం వచ్చిన 90 రోజుల్లోనే 30 వేల ఉద్యోగాలకు నియామక పత్రాలు ఇ చ్చామని తెలిపారు. 2022 నోటిఫికేషన్లో ఫైర్మెన్లుగా అర్హత సాధించి, నాలుగు నెల లు శిక్షణ పూర్తిచేసుకున్న 483 మంది ఫైర్మెన్లకు శుక్రవారం వట్టినాగులపల్లిలోని ఫైర్ ట్రైనింగ్ అకాడమీలో దీక్షాంత్ పరేడ్ నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథి గా హాజరైన సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వ ఉద్యోగులకు మంచి చేయడానికి, ఒకటో తేదీన జీతాలు ఇవ్వడానికి తమ ప్రభుత్వానికి ఎలాంటి భేషజాలు లేవని చెప్పారు. సకలజనులకు మంచి చేయాలనే ఉద్దేశంతోనే రూ.2.91 లక్షల కోట్లతో బడ్జెట్‌ను ప్రవేశపెట్టినట్టు తెలిపారు. ఫైర్మెన్లను ఉద్దేశించి మా ట్లాడుతూ.. జీతభత్యాల కోసం కాకుండా.. ఆపదలో ఉన్నవారి ప్రాణాలను కాపాడేందుకు తమ ప్రాణాలను పణంగా పెట్టేందుకు ఫైర్‌మెన్ జాబ్‌లోకి వచ్చిన అభ్యర్థులను అభినందించారు.
ప్రభుత్వ ఉద్యోగ ఖాళీల భర్తీకి తగిన ప్రణాళిక తమ వద్ద ఉన్నదని రంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్ మంత్రి శ్రీధర్‌బాబు చెప్పారు. పాసింగ్ ఔట్ పరేడ్‌కు ముఖ్యమంత్రి ఆలస్యంగా రావడంతో అభ్యర్థులు ఒక్కొక్కరుగా సొమ్మసిల్లి పడిపోయారు. కానిస్టేబుళ్లు వారికి సపర్యలు చేసి, మళ్లీ పరేడ్‌లోకి తీసుకొచ్చారు. సీఎం రేవంత్‌రెడ్డి మా ట్లాడుతుండగానే మరో ఇద్దరు అభ్యర్థులు సొ మ్మలిసిల్లి పడిపోవడంతో.. అంబులెన్స్ పిలిపించి వారికి వైద్యం చేయించమని సీఎం స భావేదిక నుంచే ఆదేశించారు. దీంతో అభ్యర్థులు, వారి తల్లిదండ్రుల్లో అసహనం వ్యక్తమైంది.
ఇదంతా కేసీఆర్ సార్ క్రెడిటే
2022లో పోలీస్ కానిస్టేబుళ్లతోపా టు తమకు కూడా నాటి సీఎం కేసీఆర్ నోటిఫికేషన్ ఇచ్చారని ఫైర్మెన్లు చె ప్పారు. ఆయన హయాంలో వివిధ దశ ల్లో పరీక్షలు జరిగాయని, అయితే కోర్టు కేసుల వల్ల తమ తుది ఫలితాల విడుదల ఆలస్యమైందని అ న్నారు. అప్పుడే ఎలాంటి కోర్టు చిక్కు లు లేకుండా ఫలితాలు వచ్చి ఉంటే.. ఈ ఉద్యోగాల క్రెడిట్ అంతా కేసీఆర్ సార్కే దక్కేదని పలువురు అభ్యర్థులు ‘నమస్తే తెలంగాణ’తో చెప్పారు. అవి ఆల స్యం కావడం వల్లనే కొత్త ప్రభుత్వంలో తమకు నియామకపత్రాలు వచ్చాయని అన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ranabaali | బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తున్న ‘రణబాలి’.. 24 గంటల్లోనే 1.39 లక్షల టికెట్ల విక్రయం!
Cricketer Jehangir | అభిమానిని కిందపడేసి చితకబాదిన క్రికెటర్.. వీడియో వైరల్!
MBBS Student | హాస్టల్ గదిలో ఫ్యాన్‌కు ఉరివేసుకుని.. మెడికల్ విద్యార్థిని ఆత్మహత్య
Jailer 2 | రజినీకాంత్ ‘జైలర్ 2’ సునామీ.. 5 రోజుల్లోనే రూ. 500 కోట్ల వసూళ్లు!
Dasara Posters | టాలీవుడ్లో పండగ జోష్.. దసరా కానుకగా సందడి చేసిన కొత్త సినిమాల పోస్టర్లు చూశారా!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

