iPhone | ఐ-ఫోన్లపై బంపరాఫర్.. గణనీయంగా ధరలు తగ్గించిన ఆపిల్..!
iPhone | స్మార్ట్ ఫోన్ ప్రియులకు శుభవార్త. గ్లోబల్ టెక్ దిగ్గజం ఆపిల్ తన ఐ-ఫోన్ 13,14,15 సిరీస్ ఫోన్ల ధరలు తగ్గిస్తున్నట్లు శుక్రవారం ప్రకటించింది.
iPhone | స్మార్ట్ ఫోన్ ప్రియులకు శుభవార్త. గ్లోబల్ టెక్ దిగ్గజం ఆపిల్ తన ఐ-ఫోన్ 13,14,15 సిరీస్ ఫోన్ల ధరలు తగ్గిస్తున్నట్లు శుక్రవారం ప్రకటించింది. కన్జూమర్ ఎలక్ట్రానిక్స్ మీద కస్టమ్స్ డ్యూటీ తగ్గిస్తూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2024-25 ఆర్థిక సంవత్సర బడ్జెట్ లో ప్రతిపాదనలు సమర్పించిన సంగతి తెలిసిందే. తదనుగుణంగా ఆపిల్ తన ఐ-ఫోన్ 13,14,15 సిరీస్ ఫోన్ల ధరలు తగ్గించింది. దీంతో భారతీయ స్మార్ట్ ఫోన్ యూజర్లకు లబ్ధి చేకూరనున్నది. ఆపిల్ ఐ-ఫోన్ ప్రో లేదా ప్రో మ్యాక్స్ మోడల్ ఫోన్ల ధరలు రూ.5,100 నుంచి రూ.6,000 వరకూ తగ్గనున్నాయి. ఐ-ఫోన్ 13, ఐ-ఫోన్ 14, ఐ-ఫోన్ 15 సిరీస్ లతోపాటు భారత్ లో తయారయ్యే ఐ-ఫోన్ల ధరలు రూ.300, ఐ-ఫోన్ ఎస్ఈ ధర రూ.2300 తగ్గనున్నది.
ఆపిల్ తన ఐ-ఫోన్ ప్రో మోడల్ ఫోన్ల ధరలు తగ్గించడం ఇదే తొలిసారి. 2024-25 ఆర్థిక సంవత్సర బడ్జెట్లో కన్జూమర్ ఎలక్ట్రానిక్స్ మీద బేసిక్ కస్టమ్స్ డ్యూటీ 20 నుంచి 15 శాతానికి తగ్గించింది. సంప్రదాయంగా కొత్త ఐ-ఫోన్ మార్కెట్లో ఆవిష్కరిస్తున్నప్పుడు పాత మోడల్ ఫోన్ల ధరలు తగ్గిస్తూ వస్తుంది. ఆపిల్ ధర తగ్గింపుతోపాటు డీలర్లు, రీసెల్లర్లు తమ వద్ద ఉన్న నిల్వల సేల్స్ క్లియర్ చేసుకోవడానికి అదనపు డిస్కౌంట్లు ప్రకటిస్తుంటారు.
ఫోన్ మోడల్ – పాత ధర – కొత్త ధర
ఐ-ఫోన్ ఎస్ఈ -రూ.49,900- రూ. 47,600
ఐ-ఫోన్ 13 – రూ. 59,900 – రూ.59,600
ఐ-ఫోన్ 14 – రూ.69,900 – రూ. 69,600
ఐ-ఫోన్ 14 ప్లస్ – రూ.79,900 -రూ. 79,600
ఐ-ఫోన్ 15 – రూ.79,900 – రూ.79,600
ఐ-ఫోన్ 15 ప్లస్ – రూ.89,900 – రూ.89,600
ఐ-ఫోన్ 15 – రూ. 1,34,900 – రూ. 1,29,800
ఐ-ఫోన్ 15 ప్రో మ్యాక్స్ – రూ. 1,59,900 – రూ. 1,54,000
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fake Potatoes | మార్కెట్లో విరివిగా కల్తీ ఆలుగడ్డలు.. గుడ్డిగా కొనుగోలు చేస్తే అంతే సంగతి..!
Team India | దక్షిణాఫ్రికా పర్యటనకు భారత మహిళా క్రికెట్ జట్టు.. డిసెంబర్ 9న టూర్ షురూ..!
Almonds | రోజూ కొన్ని బాదంపప్పులను తినడం వల్ల శరీరంలో జరిగే మార్పులు ఇవే.. అధ్యయనాల్లో తేలిన నిజాలు..
Sheikh Hasina | తిరిగి రావడానికి కొత్త పాస్‌పోర్ట్ ఇవ్వండి.. బంగ్లాదేశ్‌ను కోరిన షేక్ హసీనా..!
కారేపల్లి ఎస్ఐగా రమేశ్ బాధ్యతలు స్వీకరణ
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

