Narayana podcast | గైడ్‌కాస్ట్ పేరుతో పాడ్‌కాస్ట్‌ను ప్రారంభించిన నారాయణ గ్రూప్..!
Narayana podcast | నారాయణ విద్యా సంస్థలు (Narayana Educational Institutions) గైడ్‌కాస్ట్ పేరుతో పాడ్‌కాస్ట్‌ను ప్రారంభించాయి. ఈ విషయాన్ని నారాయణ గ్రూప్ ప్రకటించింది. ఇది విద్యార్థుల శారీరక, మానసిక క్షేమానికి తోడ్పడుతుందని తెలిపింది.
Narayana podcast : నారాయణ విద్యా సంస్థలు (Narayana Educational Institutions) గైడ్‌కాస్ట్ పేరుతో పాడ్‌కాస్ట్‌ను ప్రారంభించాయి. ఈ విషయాన్ని నారాయణ గ్రూప్ ప్రకటించింది. ఇది విద్యార్థుల శారీరక, మానసిక క్షేమానికి తోడ్పడుతుందని తెలిపింది. విద్యార్థులతో తల్లిదండ్రుల సంబంధాన్ని బలోపేతం చేయడంలో ఈ గైడ్ కాస్ట్ సాయపడుతుందని పేర్కొంది. ఆయా అంశాలపై నిపుణులైన వక్తలు తమ సూచనలు, సలహాలు ఇస్తారు.
పాడ్‌కాస్ట్ మొదటి సీజన్ విద్యార్థుల మానసిక క్షేమంపై దృష్టి సారిస్తుంది. విద్యార్థులు సవాళ్లను ఎదుర్కోవడంలో మార్గదర్శనం, మద్దతును అందిస్తుంది. కాగా, నారాయణ విద్యాసంస్థల డైరెక్టర్ డాక్టర్ పీ సింధూర మాట్లాడుతూ.. విద్యార్థుల ఎడ్యుకేషన్‌కు ఎంత ప్రాముఖ్యం ఉన్నదో.. వారి మానసిక ఆరోగ్యానికి కూడా అంతే ప్రాముఖ్యం ఉన్నదని తాము విశ్వసిస్తామని అన్నారు. ప్రతి విద్యార్థిని విద్యాపరంగా, వ్యక్తిగతంగా విజయం సాధించేలా చేయడమే తమ గైడ్‌కాస్ట్ ఉద్దేశమని చెప్పారు.
‘పాడ్‌కాస్ట్ మొదటి సీజన్ మానసిక శ్రేయస్సుకు సంబంధించి అనేక రకాల అంశాలను ప్రస్తావిస్తుంది. ఇది సంబంధాల బలోపేతం, ఎమోషనల్ సపోర్ట్, కౌమారదశ, అకడమిక్స్, డిపెండెన్సీ, యాంగ్జయిటీ, స్ట్రెస్, ఎమోషన్స్ లాంటి సబ్జెక్టులను కవర్ చేస్తుంది. ఇది 2024 జూలైలో మొదలై పలు ఎపిసోడ్లు కొనసాగుతుంది’ అని నారాయణ విద్యా సంస్థల మరో డైరెక్టర్ పీ శరణి చెప్పారు.
Read Today's Latest Nipuna-education News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

