అమరావతి : ఎడతెరపి లేకుండా కురిసిన వర్షాలకు ఓ పాఠశాల గోడకూలి విద్యార్థి మృతి( Student died) చెందిన ఘటన నెల్లూరు(Nellore) జిల్లాలో చోటు చేసుకుంది . బీవీనగర్లోని కేఎన్ఆర్ ప్రైవేట్ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న మహేశ్ అనే విద్యార్థిపై గోడకూలింది. దీంతో విద్యార్థి తీవ్ర గాయాలపాలయ్యాడు.
ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందడంతో కుటుంబ సభ్యులు పోలీసుస్టేషన్(Police Station) లో ఫిర్యాదు చేశారు. పాఠశాల నిర్మాణాల నాణ్యతపై విచారణ చేపట్టాలని స్థానికులు డిమాండ్ చేశారు. పోలీసులు పాఠశాల యాజమాన్యంపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. గోడ కూలి విద్యార్థి మరణించడం బాధాకరమని మంత్రి నారాయణ విచారం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబానికి రూ. 5లక్షల పరిహారాన్ని అందజేస్తామని ప్రకటించారు. ఘటనపై విచారణ చేయాలని డీఈవోకు ఆదేశాలు జారీ చేశారు.