Vijay-Rashmika | ఉదయ్‌పూర్‌లో మొదలైన విజయ్–రష్మిక పెళ్లి హంగామా.. మార్చి 4న హైదరాబాద్‌లో గ్రాండ్ రిసెప్షన్
Vijay-Rashmika | సిల్వర్ స్క్రీన్‌పై అద్భుతమైన కెమిస్ట్రీతో అభిమానుల మనసులు గెలుచుకున్న విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న ఇప్పుడు నిజ జీవితంలో వివాహ బంధంతో ఒక్కటవుతున్నారు. ఈ ప్రముఖ జంట ఫిబ్రవరి 26న రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో పెళ్లి చేసుకోనున్నారు
Vijay-Rashmika | సిల్వర్ స్క్రీన్‌పై అద్భుతమైన కెమిస్ట్రీతో అభిమానుల మనసులు గెలుచుకున్న విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న ఇప్పుడు నిజ జీవితంలో వివాహ బంధంతో ఒక్కటవుతున్నారు. ఈ ప్రముఖ జంట ఫిబ్రవరి 26న రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో పెళ్లి చేసుకోనున్నారు. ఇప్పటికే కుటుంబసభ్యులతో కలిసి ఉదయ్‌పూర్‌కు చేరుకున్న ఈ జంట, అక్కడి లగ్జరీ వేదిక మెమెంటోస్ బై ఐటీసీ హోటల్స్’ Mementos by ITC Hotelsను డెస్టినేషన్ వెడ్డింగ్ కోసం ఎంపిక చేసుకున్నారు. సన్నిహితుల నడుమ సాంప్రదాయ వేడుకగా ఈ వివాహాన్ని అత్యంత ప్రైవేట్‌గా నిర్వహించనున్నట్లు సమాచారం.
మంగళవారం నుంచి హల్దీ, సంగీత్ వంటి ప్రీ-వెడ్డింగ్ వేడుకలు ప్రారంభం కానున్నాయి. కేవలం 50-100 మంది అత్యంత సన్నిహిత కుటుంబసభ్యులు, స్నేహితుల సమక్షంలోనే ఈ కార్యక్రమాలు జరుగనున్నాయి. అతిథుల కోసం ‘నో-ఫోన్’ పాలసీని కఠినంగా అమలు చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ నిర్ణయంతో పెళ్లి వేడుకల ఫొటోలు, వీడియోలు బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ రోజు (ఫిబ్రవరి 24) మెహందీ, రేపు (ఫిబ్రవరి 25) హల్దీ, సంగీత్ కార్యక్రమాలు జరగనున్నాయి. . ఈ వివాహ వేడుకకి విరోష్ అని నామకరణం చేశారు. ఇక రష్మిక తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో వెల్లడించినట్లుగా, అతిథుల కోసం ప్రత్యేకంగా జపనీస్ వంటకాలను మెనూలో చేర్చారు. సంప్రదాయం, ఆధునికత కలయికగా ఈ వివాహాన్ని ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది.
గీత గోవిందం, డియర్ కామ్రేడ్ వంటి చిత్రాలతో విజయ్–రష్మిక జంట ఆన్‌స్క్రీన్‌లో సూపర్ హిట్ పెయిర్‌గా నిలిచింది. ఆ సినిమాల సమయంలోనే వీరిద్దరి మధ్య ఉన్న కెమిస్ట్రీపై అభిమానులు ప్రశంసలు కురిపించారు. ఇప్పుడు ఆ బంధం నిజ జీవితంలో వివాహంగా మారుతోంది. పెళ్లి అనంతరం మార్చి 4న హైదరాబాద్‌లో సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు, స్నేహితుల కోసం గ్రాండ్ రిసెప్షన్ ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. టాలీవుడ్‌కు చెందిన ప్రముఖులు ఈ వేడుకకు హాజరయ్యే అవకాశం ఉంది. మొత్తానికి, అభిమానులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఈ జంట పెళ్లి వేడుక ఇప్పుడు నిజం కావడంతో సోషల్ మీడియాలో శుభాకాంక్షల వర్షం కురుస్తోంది. టాలీవుడ్లో మరో స్టార్ జంట కొత్త జీవితాన్ని ప్రారంభించబోతోందని అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kuravi | అమ్మమ్మ ఇంటికొచ్చి అనంతలోకాలకు.. నీటి గుంతలో పడి తొమ్మిదేళ్ల బాలుడి మృతి
Pneumonic Plague | న్యుమోనిక్ ప్లేగు అంటే ఏమిటి.. ప్లేగులో ఎన్ని రకాలు ఉన్నాయి..?
Punjab | డ్రగ్స్ వ్యతిరేక కార్యకర్త హత్య కేసు.. నిందితుడి ఇల్లు కూల్చివేత.. షాపు దహనం
Election Schedule | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల.. మూడు విడతలుగా ఎన్నికలు
Soma Bharat Kumar | హరీశ్ రావుకు ఎటువంటి షోకాజ్ నోటీసు ఇవ్వలేదు : బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి సోమ భరత్ కుమార్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

