Natural Star Nani | న్యాచురల్ స్టార్ నాని పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా ‘దసరా’ ఫేమ్ దర్శకుడు శ్రీకాంత్ ఓదెలా ఆయనకు విషెస్ తెలుపుతూ.. ఒక ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు. వీరిద్దరి కాంబినేషన్లో రాబోతున్న తాజా చిత్రం ‘ది ప్యారడైజ్’ (The Paradise). ఈ సినిమా సెట్స్‌లో నానితో తనకున్న అనుబంధాన్ని శ్రీకాంత్ తాజాగా పంచుకున్నాడు.
‘నాని అన్నా, నువ్వు ప్రతిసారి ‘నీ ఇష్టం శ్రీకాంత్’ అన్నప్పుడల్లా.. నాకు అది ‘నేను నిన్ను నమ్ముతున్నాను శ్రీకాంత్’ అన్నట్లుగా వినిపిస్తుంది. ఆ నమ్మకమే నన్ను ప్రతి సెకను భయపెడుతుంటుంది. అందుకే ‘ది ప్యారడైజ్’ కోసం నా రక్తాన్ని, ఆత్మను ధారపోస్తున్నాను. సినిమా మేకింగ్‌లో నీకున్న ప్రతి రూల్‌ను నేను బ్రేక్ చేశాను. నీ వర్కింగ్ డేస్ ప్యాటర్న్, రిలీజ్ డేట్ స్ట్రీక్, నీ వర్కింగ్ స్టైల్.. ఇలా అన్నింటినీ మార్చేశాను. నేను ప్రతిసారి నీ రూల్స్ బ్రేక్ చేసినప్పుడల్లా, నువ్వు నన్ను కొత్తగా నిర్మించావు అన్నా. ఈ సినిమా కోసం నిన్ను జడలు వేసుకోమన్నా, చేతిపై పచ్చబొట్టు వేయించుకోమన్నా, ఎన్ని రీటేక్స్ తీసుకుని టార్చర్ పెట్టినా.. నువ్వు కేవలం ‘ఓకే రా నీ ఇష్టం’ అని మాత్రమే అన్నావు. నువ్వు నా మీద ఉంచినంత నమ్మకాన్ని నాపై ఎవరూ ఉంచలేదు. నన్ను నమ్మిన నా ‘ధరణి’ (దసరా పాత్ర) కి, మళ్ళీ నమ్ముతున్న నా ‘జడల్’ కు పుట్టినరోజు శుభాకాంక్షలు. నీ రుణం జీవితాంతం తీర్చుకోలేనంటూ శ్రీకాంత్ రాసుకోచ్చాడు. ‘దసరా’ వంటి మాస్ హిట్ తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న ‘ది ప్యారడైజ్’ పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.
Nani Anna,
Nuvvu “Ni istam Srikanth” ani anna prathisari I hear “I trust you Srikanth”
And that trust scares me, every single second to give my blood and soul to The Paradise.
I broke your every rule of cinema.
I broke your working days pattern…
I broke your release date… pic.twitter.com/p7Z1pFKrx8
— Srikanth Odela (@odela_srikanth) February 24, 2026