Air Ambulance: ఎయిర్ అంబులెన్స్ కూలిన ఘటనలో ఏడుగురు మృతి.. ఛాత్రా ఆస్పత్రిలో పోస్టు మార్టమ్
Air Ambulance: జార్ఖండ్‌లోని ఛాత్రా జిల్లాలో కూలిన ఎయిర్ అంబులెన్స్ ఘటనలో ఏడుగురు మృతిచెందినట్లు అధికారులు ధ్రువీకరించారు.ఛాత్రా డిప్యూటీ కమీషనర్ కీర్తిశ్రీ ఈ విషయాన్ని కన్ఫర్మ్ చేశారు. మృతదేహాలను పోస్టుమార్టమ్ కోసం సదర్ ఆస్పత్రికి తరలించారు.
రాంచీ: జార్ఖండ్‌లోని ఛాత్రా జిల్లాలో కూలిన ఎయిర్ అంబులెన్స్(Air Ambulance) ఘటనలో ఏడుగురు మృతిచెందినట్లు అధికారులు ధ్రువీకరించారు. విమానంలో ఉన్న ఏడుగురు మృతిచెందారని, ఆ విమానం రాంచీ నుంచి ఢిల్లీ వెళ్తున్నట్లు ఛాత్రా డిప్యూటీ కమీషనర్ కీర్తిశ్రీ తెలిపారు. సిమరియా వద్ద ఈ ప్రమాదం జరిగింది. మృతుల భౌతికకాయాలను పోస్టు మార్టమ్ నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్లు చెప్పారు. బీచ్‌క్రాఫ్ట్ సీ90 ఎయిర్ అంబులెన్స్‌ను రెడ్‌బర్డ్ ఎయిర్వేస్ సంస్థ ఆపరేట్ చేస్తున్నది. అటవీ ప్రాంతంలో ఎయిర్ అంబులెన్స్ కూలిందని, ఇద్దరు పైలెట్లతో సహా ఏడు మంది మరణించినట్లు అధికారులు పేర్కొన్నారు. ఛాత్రాలోని సదర్ ఆస్పత్రిలో పోస్టు మార్టమ్ చేస్తున్నారు. ప్రమాద ఘటన పట్ల దర్యాప్తు మొదలుపెట్టారు.
రాంచీ విమానాశ్రయం నుంచి 7.11 నిమిషాలకు విమానం టేకాఫ్ తీసుకున్నది. 7.30 నిమిషాలకు ఏటీసీతో కాంటాక్ట్ తెగిపోయింది. అయితే బహుశా మేఘావృతమైన వాతావరణం వల్ల ప్రమాదం జరిగి ఉంటుందని రాంచీ విమానాశ్రయ డైరెక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. కానీ ఇంత వరకు అధికారికంగా ఎటువంటి కారణం చెప్పలేదు. మృతుల్లో కెప్టెన్ వివేక్ వికాశ్ భగత్, కెప్టెన్ స్వరాజ్‌దీప్ సింగ్, సంజయ్ కుమార్, డాక్టర్ వికాశ్ కుమార్ గుప్తా, సచిన్ కుమార్ మిశ్రా, అర్చనా దేవి, దురుకుమార్ ఉన్నారు. వారణాసికి ఆగ్నేయంగా 100 నాటికల్ మైళ్ల దూరంలో ఉన్నప్పుడు కోల్‌కతాలోని ఏటీసీతో ఆ ఎయిర్ అంబులెన్స్ కమ్యూనికేషన్ తెగిపోయినట్లు తెలిసింది. ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో బృందం ప్రమాద స్థలానికి చేరుకున్నది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
HCA | అక్రమాలు, అన్యాయాలకు కేరాఫ్ హెచ్‌సీఏ .. జీవన్‌రెడ్డి ఎలా సెక్రటరీ అయ్యాడు..? టీసీఏ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పెసరు విజయ్‌చందర్‌రెడ్డి
SA vs AUS | ఆసీస్ ఇన్నింగ్స్ డిక్లేర్.. భారీ ఛేదనలో సఫారీలకు హేజిల్‌వుడ్ షాక్..!
Plank Exercise | ప్లాంక్ వ్యాయామాన్ని అసలు ఎలా చేయాలి.. దీంతో కలిగే లాభాలేమిటి..?
Srivari Temple | ఖమ్మంలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి శ్రీకారం..పవిత్ర క్రతువును నిర్వహించిన త్రిదండి చిన్నజీయర్‌స్వామి
Srisailam Dam | శ్రీశైలం డ్యామ్‌కు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

