Son Kills Father: కెరీర్ అంశంలో వాగ్వాదం.. తండ్రిని చంపి ముక్కలు చేశాడు..
Son Kills Father: లక్నోలో 21 ఏళ్ల వ్యక్తి తన తండ్రిని కిరాతకంగా చంపేశాడు. తొలుత షూట్ చేసి, ఆ తర్వాత శరీరాన్ని ముక్కలుగా కోశాడు. సోదరిని బెదిరించాడు. కెరీర్ విషయంలో విబేధించి .. ఆవేశంలో తండ్రిని హత్య చేశాడు.
లక్నో: యూపీ రాజధాని లక్నోలో 21 ఏళ్ల వ్యక్తి తన తండ్రిని అత్యంత కిరాతకంగా(Son Kills Father) చంపేశాడు. తొలుత తండ్రిని షూట్ చేసి, ఆ తర్వాత శరీరాన్ని ముక్కలుగా కోశాడు. కొన్ని భాగాలను పడేశాడు. మొండాన్ని ఇంట్లోని ఓ డ్రమ్ములో దాచాడు. ఈ ఘటనకు చెందిన వివరాలు ఇలా ఉన్నాయి. 49 ఏళ్ల మన్వేంద్ర సింగ్ ఓ వ్యాపారి. ఆయనకు ఫార్మసీ, లిక్కర్ బిజినెస్ ఉన్నది. అయితే శుక్రవారం నుంచి ఆయన ఆచూకీ లేదు. ఆయన ఇంటికి వెళ్లిన పోలీసులకు అసలు కథ అర్థమైంది. ఆ వ్యాపారి శరీర భాగాలను ఇంట్లో ఉన్న డ్రమ్ములో గుర్తించారు. ఈ కేసులో అతని కుమారుడు అక్షత్ ప్రతాప్ సింగ్‌ను విచారించారు. తండ్రిని మర్డర్ చేసినట్లు అక్షత్ అంగీకరించాడు.
కొడుకు మెడికల్ కెరీర్‌ను ఎంపిక చేసుకోవాలని తండ్రి ఆశించాడని, కానీ కెరీర్ విషయంలో తండ్రీకొడుకుల మధ్య విబేధాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. కాంపిటీటివ్ పరీక్షలకు ప్రిపేరయ్యేందుకు అక్షత్ నిరాకరించాడు. గతంలో ఈ విషయంలో ఓసారి ఇంటి నుంచి కూడా అతను పారిపోయాడు. కానీ శుక్రవారం సాయంత్రం మళ్లీ కెరీర్ విషయంలో తండ్రీకొడుకుల మధ్య వాగ్వాదం జరిగింది. ఆ సమయంలో రైఫిల్‌తో తండ్రిని షూట్ చేశాడు కొడుకు. మూడవ ఫ్లోర్ నుంచి గ్రౌండ్ ఫ్లోర్‌కు బాడీని తెచ్చి.. ఆ రూమ్‌లో శరీరాన్ని ముక్కలు కోసేశాడు.
తండ్రిని చంపినట్లు నిందిత వ్యక్తి సోదరి ప్రత్యక్షంగా చూసింది. దీంతో ఆమెను బెదిరించి నోరెత్తకుండా చేశాడు. కొన్ని శరీర భాగాలను ప్లాస్టిక్‌లో చుట్టేసి సదరున ప్రాంతంలో పడేశాడు. మొండం మాత్రం ఇంట్లో ఉన్న బ్లూ రంగు డ్రమ్ములో దాచేశాడు. ప్రస్తుతం ఫోరెన్సిక్ దళాలు ఇంట్లో నుంచి శ్యాంపిళ్లను సేకరిస్తున్నాయి. ఇతర శరీర భాగాల కోసం కూడా అన్వేషిస్తున్నారు. సాక్ష్యాల ఆధారంగా అక్షత్‌పై కేసు నమోదు చేయనున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Congress Leaders Attack | ఫేస్బుక్ మెటా ఆఫీస్ పై కాంగ్రెస్ నాయకుల దాడి
Hyderabad | నీటి ట్యాంకు నుంచి వృథాగా పోతున్న తాగునీరు..
Enugula Rakesh Reddy | యూత్ డిక్లరేషన్ పేరుతో యువతను మోసం చేసిన కాంగ్రెస్ : ఏనుగుల రాకేష్‌రెడ్డి
Road Accident | ఆటో బోల్తా..ఐదుగురికి గాయాలు
Sensational Comments | రేవంత్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు.. సోనియాగాంధీకి సీనియర్ నాయకుడు లేఖ
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

