Home
Nipuna-education
The Partition Of The Country The Labor Party Stood In The Front Line For Independence
స్వతంత్రులుగా వ్యవహరించి.. స్వాతంత్య్రం సాధించి
దేశ విభజనలో భాగంగా స్వాతంత్య్రం పొందడానికి లేబర్ పార్టీ ముందు వరుసలో నిలబడింది. జర్మనీ, జపాన్, ఇటలీకి వ్యతిరేకంగా బ్రిటిష్‌వారు చేస్తున్న యుద్ధానికి సాయపడటం కోసం కాంగ్రెస్‌లో అనుకూల, ప్రతికూల వాదనలు తీవ్రమయ్యాయి.
- డీఎస్సీ ప్రత్యేకం చరిత్ర
దేశ విభజనలో భాగంగా స్వాతంత్య్రం పొందడానికి లేబర్ పార్టీ ముందు వరుసలో నిలబడింది. జర్మనీ, జపాన్, ఇటలీకి వ్యతిరేకంగా బ్రిటిష్‌వారు చేస్తున్న యుద్ధానికి సాయపడటం కోసం కాంగ్రెస్‌లో అనుకూల,
ప్రతికూల వాదనలు తీవ్రమయ్యాయి. స్వాతంత్య్ర సాధనలో ఎదురైన ఎత్తుపల్లాలను తెలుసుకుందాం.
దేశ విభజన స్వాతంత్య్రం (1939-1947)
- 1935 భారత ప్రభుత్వ చట్టం ప్రకారం రాష్ర్టాల్లో ఎన్నికలు నిర్వహించి ప్రభుత్వాలు ఏర్పాటు చేయాలి.
- ఈ చట్టం ప్రకారం జరిగిన ఎన్నికల్లో జనాభాలో ఓటు హక్కు పొందినవారి శాతం రాష్ట్ర శాసన సభ ఎన్నికలు-12 శాతం, కేంద్ర శాసనసభ ఎన్నికలు-1 శాతం.
- ఈ చట్టం ప్రకారం బ్రిటిష్ ఇండియాలోని 11 రాష్ర్టాల్లో 1937లో ఎన్నికలు నిర్వహించగా అధిక రాష్ర్టాల్లో కాంగ్రెస్ ముఖ్యమంత్రులు ఎన్నికయ్యారు.
- జర్మనీ, జపాన్, ఇటలీ వ్యతిరేకంగా ఆంగ్లేయులు చేస్తున్న యుద్ధానికి సహాయపడటంపై కాంగ్రెస్‌లో అనుకూల, ప్రతికూల వాదనలు తీవ్రరూపం దాల్చాయి.
- యుద్ధ కాలంలో ఇంగ్లండ్‌లో కన్జర్వేటివ్ పార్టీకి చెందిన విన్స్టన్ చర్చిల్ నాయకత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం తమ సామ్రాజ్యాన్ని నిలబెట్టుకోవడం కోసం ప్రయత్నించారు.
- కానీ వారితో పోల్చుకుంటే భారతీయులు స్వాతంత్య్రం పొందటానికి లేబర్ పార్టీ ఎక్కువ సుముఖంగా ఉంది.
- బ్రిటిష్ సామ్రాజ్యం కింద భారతదేశానికి డొమినియన్ ప్రతిపత్తి ఇవ్వడానికి బ్రిటన్ అంగీకరించింది. కానీ కాంగ్రెస్ సంపూర్ణ స్వాతంత్య్రం కోరింది.
- బ్రిటిష్ విధానాలతో విసిగిపోయిన కాంగ్రెస్ 1939 అక్టోబర్‌లో రాష్ర్టాల్లోని కాంగ్రెస్ ప్రభుత్వాలచే రాజీనామా చేయించింది.
- బ్రిటిష్ వారిపై ఒత్తిడి తీసుకురావడానికి 1940-41లో కాంగ్రెస్ సత్యాగ్రహాలు నిర్వహించింది.
ముస్లిం లీగ్
- ఈ పార్టీ 1906లో ఏర్పడింది. ఉత్తరప్రదేశ్‌లోని ముస్లిం భూస్వాముల ప్రయోజనాలకు ప్రాతినిథ్యం వహిస్తున్న ఈ పార్టీకి 1930 వరకు పెద్దగా ప్రజల మద్దతు లేదు.
- 1909లో ముస్లింలకు ప్రత్యేక నియోజకవర్గాలు ఏర్పాటు చేశారు.
- 1937లో రాష్ట్ర ప్రభుత్వాలకు జరిగిన ఎన్నికల్లో దేశంలో 482 ముస్లిం నియోజకవర్గాల్లో ముస్లింలీగ్ 102 స్థానాలను గెలుచుకుంది.
- కాంగ్రెస్ కూడా 58 ముస్లిం నియోజకవర్గాల్లో పోటీ చేసి 28 స్థానాల్లో గెలిచింది.
- 1937 ఎన్నికల్లో మొత్తం ముస్లిం ఓట్లలో 4.4 శాతం మాత్రమే ముస్లింలీగ్‌కు లభించాయి.
- యునైటెడ్ ప్రావిన్సెస్, బాంబే, మద్రాస్‌లలో ముస్లింలీగ్‌కు కొంత ఆదరణ లభించింది.
- పది సంవత్సరాల తర్వాత ఏర్పడిన పాకిస్థాన్ రాష్ర్టాలైన బెంగాల్, నార్త్ వెస్ట్ ఫ్రాంటియర్ ప్రావిన్స్, పంజాబ్‌లలో అది చాలా బలహీనంగా ఉన్నది.
- 1937లో ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెస్-ముస్లింలీగ్ సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటుకు కాంగ్రెస్ నిరాకరించడం ముస్లింలీగ్ కినుక వహించింది.
- సింధ్ రాష్ట్రంలో కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోయింది. కానీ 1946లో జరిగిన రాష్ట్ర, కేంద్ర శాసనసభల ఎన్నికల్లో ముస్లింలీగ్ విజయభేరి మోగించింది.
- ముస్లింలీగ్‌లో సభ్యత్వం తీసుకోవడాన్ని కాంగ్రెస్ నిషేధించింది. మౌలానా ఆజాద్ వంటి వారు అభ్యంతరం తెలిపాకే 1938లో హిందూ మహాసభలో సభ్యత్వాన్ని కాంగ్రెస్ నిషేధించింది.
1937-47 మధ్య ముస్లింలలో ముస్లింలీగ్ పట్ల ఆదరణ పెరగడానికి కారణాలు
1. ముస్లింల పట్ల కాంగ్రెస్ సున్నితత్వంతో స్పందించడం లేదని ముస్లింలీగ్ ఎత్తిచూపడం
2. ముస్లింలీగ్ సభ్యత్వం ఉన్నవారు కాంగ్రెస్‌లో సభ్యత్వం పొందకుండా నిషేధించడం
3. కాంగ్రెస్ మౌలికంగా హిందువుల పార్టీ అని, ముస్లింలతో అధికారాన్ని పంచుకోవడానికి అది సుముఖంగా లేదని ముస్లింలీగ్ ప్రచారం చేయడం.
పాకిస్థాన్ తీర్మానం
- ‘సారే జహాసే అచ్ఛా హిందుస్థాన్ హమారా’ అనే కవిత రాసిన ఉర్దూ కవి మహ్మద్ ఇక్బాల్ 1930లో ముస్లింలీగ్ అధ్యక్షోపన్యాసం చేస్తూ ‘వాయవ్య ముస్లిం రాష్ట్ర ఆవశ్యకత’పై మాట్లాడారు.
- పాకిస్థాన్ అనే పేరు కేంబ్రిడ్జిలోని పంజాబీ ముస్లిం అయిన ‘చౌదరీ రహ్మత్ అలీ’ ప్రతిపాదించాడు. ఈ విద్యార్థి 1933, 1935లో రాసిన కరపత్రాల్లో ఈ రాష్ర్టాలకు ప్రత్యేక జాతీయ ప్రతిపత్తిని ఆశించాడు. అయితే ఇతన్ని ఎవరూ పట్టించుకోలేదు. ముస్లిం నాయకులు దీన్ని ఒక విద్యార్థి కలగా కొట్టేశారు.
- అయితే మారిన రాజకీయ పరిస్థితుల్లో 1940, మార్చి 23న ఉపఖండంలో ముస్లింలు అధిక సంఖ్యలో గల ప్రాంతాల్లో స్వయం ప్రతిపత్తి కోరుతూ ముస్లింలీగ్ ఒక తీర్మానం చేసింది.
- అస్పష్టంగా ఉన్న ఈ తీర్మానం దేశ విభజనను కానీ, పాకిస్థాన్‌ను కానీ పేర్కొనలేదు. తర్వాత దీన్నే పాకిస్థాన్ తీర్మానంగా పిలిచారు.
- 1940-1946 మధ్య ప్రత్యేక దేశం ఆవశ్యకత, దాని ప్రయోజనాల గురించి ముస్లిం ప్రజలను ముస్లింలీగ్ ఒప్పించగలిగింది.
- 1942-45 మధ్య కాలంలో చాలామంది కాంగ్రెస్ నాయకులు జైలులో ఉన్నారు. ఈ కాలంలో ముస్లింలలో ముస్లింలీగ్ ఆదరణ పెంచుకోగలిగింది.
క్విట్ ఇండియా 1942
- 1941 నాటికి జపాన్ ఆగ్నేయ ఆసియాలోకి విస్తరించసాగింది. భారతదేశ భూభాగాలకు కూడా ముప్పు ఏర్పడే పరిస్థితి వచ్చింది.
- జపాన్ వ్యతిరేక యుద్ధంలో భారతీయులు పాల్గొనేలా ఒప్పించడానికి 1942 వసంత కాలంలో సర్ స్టాఫర్డ్ క్రిప్స్ అనే మంత్రిని బ్రిటన్ పంపింది.
- వైస్రాయి కార్యవర్గంలో రక్షణ సభ్యుడిగా భారతీయున్ని ముందుగా నియమించాలని కాంగ్రెస్ పట్టుబట్టడంతో ఈ చర్చలు విఫలమయ్యాయి.
- క్రిప్స్ దౌత్యం విఫలమవడంతో మహాత్మాగాంధీ 1942 ఆగస్టులో క్విట్ ఇండియా (భారతదేశం వదిలి వెళ్లండి) ఉద్యమాన్ని ప్రారంభించాడు.
- 1942, ఆగస్టు 8న కాంగ్రెస్ ముంబయిలో సమావేశమై క్విట్ ఇండియా తీర్మానాన్ని ఆమోదించింది.
- ఈ ఉద్యమంలో గాంధీ ‘డూ ఆర్ డై’ (చెయ్యండి లేదా చావండి) అనే నినాదం ఇచ్చాడు.
- క్విట్ ఇండియా తీర్మానం చేసిన తర్వాత దేశ ప్రజలను ఉద్దేశించి గాంధీజీ విలువైన సందేశమిచ్చాడు. ‘ఈ క్షణం నుంచి ప్రతి ఒక్క స్త్రీ, పురుషుడు తమను తాము స్వతంత్రులుగా పరిగణించాలి, స్వతంత్రులైనట్లు వ్యవహరించాలి.. సంపూర్ణ స్వాతంత్య్రం తప్పించి దేనికీ నేను సిద్ధంగా లేను. అందరం ఉద్యమించి భారతదేశాన్ని విముక్తం చేద్దాం లేదా ఆ ప్రయత్నంలో మరణిద్దాం’.
- 1942, ఆగస్టు 9న ఉదయం గాంధీజీ, పటేల్, నెహ్రూ, మౌలానా ఆజాద్, ఆచార్య కృపలానీ, రాజేంద్రప్రసాద్ వంటి నాయకులను అరెస్టు చేశారు.
- దురదృష్టవశాత్తు ఉద్యమం హింసాయుత రూపం తీసుకుంది. ప్రజలు పోలీసుస్టేషన్లు, పోస్టాఫీసులు, రైల్వే స్టేషన్ల వంటి ఆస్తులపై విద్యార్థులు దాడులు చేశారు.
- టెలిగ్రాఫ్, టెలిఫోన్ తీగలను కోసేశారు. రైల్వే పట్టాలను తొలగించారు. ప్రభుత్వ కార్యాలయాలు, వాహనాలు, సైనిక వాహనాలు, రైల్వే బోగీలను తగలబెట్టారు.
- ఈ సమయంలో మద్రాసు, బొంబాయి తీవ్రంగా ప్రభావితమయ్యాయి. ఉత్తరప్రదేశ్, బీహార్, ఒడిశా, పశ్చిమబెంగాల్, మహారాష్ట్ర, ఏపీలోని అనేక ప్రాంతాల్లో బ్రిటిష్ అధికారం కనిపించకుండా పోయింది.
- 10 లక్షల పౌండ్ల విలువైన ఆస్తులు ధ్వంసమయ్యాయి. 30 మంది పోలీసులు, 10 మంది సైనికులు మరణించారు.
- 1943 చివరి నాటికి 90,000 మంది జైలు పాలయ్యారు. పోలీసు కాల్పుల్లో 1000 మందికి పైగా మరణించారు.
- అనేక ప్రాంతాల్లో విమానాల నుంచి మిషన్గన్లతో కాల్పులు జరపడానికి ఆదేశాలు జారీ చేశారు.
- మెరుగైన ఆహారం ఇవ్వాలని, తెల్ల సైనికులతో సమానంగా భారతీయ సైనికులకు సమాన వేతనాలివ్వాలని, జాతీయ సైనికులను, ఇతర రాజకీయ ఖైదీలను విడుదల చేయాలని, ఇండోనేషియా నుంచి భారతీయ సైనికులను ఉపసంహరించాలని ఈ సంఘం కోరింది.
- రహస్య ఉద్యమంలో కాంగ్రెస్‌లోని సోషలిస్టు నాయకుడు జయప్రకాశ్ నారాయణ్ వంటి వారు క్రియాశీలకంగా పాల్గొన్నారు.
- 1942-44 మధ్య మిడ్నాపూర్‌లో ప్రజలు సమాంతర ప్రభుత్వం నడిపారు.
- పశ్చిమంలో సతారా, తూర్పులో మేదినీపూర్ వంటి పలు జిల్లాల్లో స్వతంత్ర ప్రభుత్వాలు ఏర్పడ్డాయి.
- నాజీ సైన్యం సోవియట్ యూనియన్‌పై దండెత్తడంతో ఈ యుద్ధంలో బ్రటన్‌కు మద్దతునివ్వాలని భారత కమ్యూనిస్టు పార్టీ నిర్ణయించింది.
- దీనికి విరుద్ధంగా గాంధీజీ వంటివారు బ్రిటన్ భారతదేశం విడిచి వెళ్లిపోతే అది సొంతంగా జపాన్ను ఎదుర్కొనగలదని భావించారు.
- అమెరికా యూరప్‌లలో జపాన్ సాధించిన విజయాలు భారతీయులపై బలమైన ముద్రలు వేశాయి. ఐరోపా వలస పాలకులు త్వరలోనే ఓడిపోతారని భావించారు.
- జపాన్ వలె తాము కూడా ఐరోపా వలస పాలకులతో పోరాడి గెలవగలమని భారతీయులు అనుకున్నారు.
హిందూ మహాసభ, ఆర్ఎస్ఎస్ - ఈ సమయంలో హిందూ మహాసభ, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ప్రజలను సమీకరించడానికి చురుకుగా పని చేశాయి.
- కులం, వర్గాలను అధిగమించి హిందువులందరిని ఏకం చేసి సామాజిక జీవితంలో సంస్కరణలు తీసుకురావాలని ఈ సంఘాలు ఆశించాయి.
- భారతదేశం అధిక సంఖ్యలోనున్న హిందువుల భూమి అనే అభిప్రాయాన్ని కూడా వారు కలిగించారు.
- అయితే కాంగ్రెస్ తమ సభ్యుల్లో లౌకిక అవగాహన పెంచడానికి కాంగ్రెస్ ఎంతో ప్రయత్నించింది. ముస్లిం ప్రజల్లో భద్రతా భావాన్ని పెంచి ముస్లింలీగ్ హిందూ మహాసభ, ఆర్ఎస్ఎస్ వంటి సంస్థల కార్యక్రమాల ద్వారా ప్రజల్లో కలుగుతున్న తప్పుడు అభిప్రాయాలను తొలగించడానికి కాంగ్రెస్ ప్రయత్నించింది.
- అయితే హిందువుల ఆధిపత్యం గురించి ముస్లింలీగ్‌కు గల భయాలను బ్రిటన్ ఆసక్తిగా వింటే ముస్లింలకు భద్రత కల్పించడానికి సూచనలు చేసింది.
సుభాష్ చంద్రబోస్
- బ్రిటిష్ వారిని తరిమేయడానికి జపాన్ సాయం తీసుకోవాలని బోస్ భావించాడు. కానీ గాంధీజీ దీనికి ఏకీభవించలేదు.
- అతడు రహస్యంగా జర్మనీకి అక్కడి నుంచి జపాన్‌కు వెళ్లి 1942లో భారతీయ సైనికులతో ఒక సైన్యాన్ని ఏర్పాటు చేశాడు.
- ఇతను రాస్బిహారీ బోస్ సాయంతో బర్మా, అండమాన్‌లో భారత జాతీయ సైన్యం ఏర్పాటు చేశాడు.
- తన సైన్యానికి భారత జాతీయ సైన్యం అని పేరు పెట్టాడు.
- బర్మా మలయాళలో బ్రిటన్ను జపాన్ ఓడించినప్పుడు బంధించబడిన బ్రిటిష్ సైన్యంలోని భారతీయులే భారతీయ జాతీయ సైన్యంలో చేరారు.
- చంద్రబోస్ జపాన్ సైన్యంతో కలిసి మూడు సంవత్సరాల పాటు యుద్ధం చేశాడు
- 1943, అక్టోబర్ 21న సింగపూర్‌లో స్వతంత్ర భారత (ఆజాద్ హింద్) ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాడు.
- 1944, మార్చి 18న ‘ఢిల్లీకి పదండి’ నినాదంతో బర్మా దాటి భారతదేశంలోకి ప్రవేశించాడు.
- 1944 మార్చిలో కొహిమాలో భారతీయ జెండా ఎగురవేశాడు.
- స్టాలిన్గ్రాడ్లో రష్యా చేతిలో నాజీ ఓటమితో మిత్ర పక్షాల విజయాలు ప్రారంభమయ్యాయి.
- సుభాష్ చంద్రబోస్ సైన్యం కూడా బ్రిటిష్ వారి చేతుల్లో ఓడిపోయింది.
- బ్యాంకాక్ నుంచి టోక్యో ప్రయాణిస్తున్న విమానం 1945, ఆగస్టు 23న ప్రమాదానికి గురైంది. సుభాష్ చంద్రబోస్ మరణించినట్లు భావిస్తున్నారు.
- 1944 జూన్‌లో యుద్ధం ముగింపు దశకు చేరుకుంటుండగా బ్రిటిష్ ప్రభుత్వం గాంధీజీని చెరసాల నుంచి విడుదల చేసింది.
– ఎస్ అండ్ ఎస్ పబ్లికేషన్స్ సౌజన్యంతో..
Read Today's Latest Nipuna-education News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

