ఇంటి పనితో సాధ్యమే!
ఒంట్లో పేరుకుపోయిన కొవ్వును కరిగించడానికి నానాకష్టాలు పడుతుంటారు. జిమ్ బాట పట్టి ఒళ్లు హూనం చేసుకుంటారు. ఉదయాన్నే వాకింగ్, సాయంత్రాలు వర్కవుట్లతో బిజీబిజీగా గడిపితే... పదో పరకో కేలరీలు ఖర్చవుతాయి.
ఒంట్లో పేరుకుపోయిన కొవ్వును కరిగించడానికి నానాకష్టాలు పడుతుంటారు. జిమ్ బాట పట్టి ఒళ్లు హూనం చేసుకుంటారు. ఉదయాన్నే వాకింగ్, సాయంత్రాలు వర్కవుట్లతో బిజీబిజీగా గడిపితే… పదో పరకో కేలరీలు ఖర్చవుతాయి. ఇందుకోసం వందలు వేలు జిమ్ మాస్టర్‌కు సమర్పించుకోవాలి. ఈ ఖర్చంతా ఎందుకు అనుకుందో ఏమో బ్రెజిల్‌కు చెందిన మోడల్ వనుసా ఫ్రెటాస్ మరో మార్గాన్ని ఎంచుకుంది. కొవ్వు కరిగించి, కండరాలు దృఢతరం చేసుకోవడానికి ఇంటి పనిని అస్త్రంగా ఎంచుకుంది.
ప్రయోగాత్మకంగా ఇల్లంతా శుభ్రం చేసింది. అంట్లు తోమడం దగ్గర్నుంచి అటకమీద సామాన్లు సర్దడం వరకూ ఏకబిగిన రెండుమూడు గంటలు పనిలో నిమగ్నమైంది. పనంతా పూర్తయ్యాక చూసుకుంటే.. తన ఒంట్లో సుమారు 600 కేలరీలు ఖర్చయ్యాయని గుర్తించింది. ఇంకేముంది.. జిమ్‌లో గంటపాటు వ్యయప్రయాసలకు ఓర్చినా కరిగేది లేదని మొండికేసిన కేలరీలు.. ఆడుతూపాడుతూ చేసిన ఇంటిపనిలో వందల్లో ఖర్చవ్వడం భలేగా ఉందంటూ తన ఇన్‌స్టాలో పోస్టు చేసింది. అందులో ఇంటి పని ఒంటి మేలుకే! అని రాసుకొచ్చింది.
కటి కండరాలు బలంగా తయారవ్వడానికి కల్లాపి చల్లడం, జబ్బలు దృఢంగా తయారవ్వడానికి రుబ్బురోలు తిప్పడం ఇలా ప్రతి ఇంటి పనిలోనూ ఓ వ్యాయామ సూత్రం కనిపిస్తుంది. ఆడామగా తేడా లేకుండా ఎవరైనా తమతమ పనులు చక్కబెట్టుకుంటే.. జిమ్‌కు వెళ్లాల్సిన అవసరమే రాదేమో కదా!
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

