SLW vs PAKW : సొంతగడ్డపై జరుగుతున్న మహిళల ఆసియా కప్లో శ్రీలంక(Srilanka) ఫైనల్లో అడుగుపెట్టింది. శుక్రవారం ఆఖరి ఓవర్ వరకూ ఉత్కంఠ రేపిన మ్యాచ్లో పాకిస్థాన్(Pakistan)పై 3 వికెట్ల తేడాతో గెలుపొందింది. భారీ ఛేదనలో కెప్టెన్ చమరి ఆటపట్టు(63) సూపర్ హాఫ్ సెంచరీతో మెరసింది. ఒత్తిడిలోనూ సాధికారిక ఇన్నింగ్స్ ఆడిన ఆమె కీలక భాగస్వామ్యాలను నెలకొల్పుతూ పాక్ ఆశలపై నీళ్లు చల్లింది. అనుష్కా సంజీవని(24 నాటౌట్), సుగంధిక కుమారిలు(10) అద్భుతంగా ఆడి జట్టును విజయతీరాలకు చేర్చారు.
ఆసియా కప్లో అజేయంగా దూసుకెళ్తున్న శ్రీలంకకు సెమీస్లో పాకిస్థాన్ గట్టి పోటీనిచ్చింది. భారీ ఛేదనలో ఓపెనర్ విశ్మీ గుణరత్నే(0)ను డకౌట్ చేసిన సదియా ఇక్బాల్ లంకను ఒత్తిడిలో పడేసింది. అయితే.. కెప్టెన్ చమరి ఆటపట్ట(0) పట్టువదలని యోధురాలిగా పోరాడింది. కీలక భాగస్వామ్యాలు నెలకొల్పుతూ రన్ రేట్ తగ్గకుండా చూసింది. హర్షిత సమరవిక్రమ(12), కవిష దిల్హర(17)లతో కలసి ఇన్నింగ్స్ నిర్మించింది.
A captain’s knock from Chamari Athapaththu helps Sri Lanka pull off a tense chase and secure a place in the Women’s Asia Cup final 👏
📝: https://t.co/xNxStAhL8E | 📸: @ACCMedia1 pic.twitter.com/TwTHE2x4QL
— ICC (@ICC) July 26, 2024
ఈ క్రమంలోనే హాఫ్ సెంచరీ కొట్టిన ఆటపట్టు మ్యాచ్ను లంకవైపు తిప్పింది. అనుష్కా సంజీవని(24 నాటౌట్)తో కలిసి ఆటపట్టు ఐదో వికెట్కు 42 రన్స్ జోడించిన ఆమె సదియా ఇక్బాల్ బౌలింగ్లో రివర్స్ స్వీప్ ఆడబోయి బౌల్డ్ అయింది. అప్పటికి లంక విజయానికి 21 రన్స్ అవసరం. ఆ తర్వాత సుగంధిక కుమారి(10) 19వ ఓవర్లో రెండు బౌండరీలు బాదింది. దాంతో, మొత్తం 13 పరుగులు వచ్చాయి. పాక్ సారథి నిడా దార్ వేసిన ఆఖరి ఓవర్లో 3 పరుగులు కావాల్సిన దశలో రెండో బంతికి సుగంధిక బౌల్డ్ అయింది. నాలుగో బంతికి సింగిల్ వచ్చింది. ఐదో బంతికి వైడ్.. దాంతో, స్కోర్లు సమం అయ్యాయి. ఆ తర్వాత బంతికి సింగిల్ తీసి జట్టుకు చిరస్మరణీయ విజయాన్ని అందించింది.

దంబుల్లా స్టేడియంలో టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన పాకిస్థాన్ (Pakistan) అమ్మాయిలు దంచేశారు. ఆతిథ్య శ్రీలంక బౌలర్లను ఉతికేస్తూ జట్టుకు భారీ స్కోర్ అందించారు. ఓపెనర్లు గుల్ ఫెరొజా(25), మునీబా అలీ (37)లు శుభారంభమిచ్చి పునాది వేశారు. తొలి వికెట్కు 61 పరుగులు జోడించారు. అయితే.. ప్రబోధని వీళ్లిద్దరిని వెనక్కి పంపి స్కోర్ బోర్డు వేగానికి అడ్డుకట్ట వేసింది.
Innings break: Pakistan post 140/4 at the end of 20 overs. #SLvPAK #WomensAsiaCup2024 pic.twitter.com/XQByDqap0u
— Sri Lanka Cricket 🇱🇰 (@OfficialSLC) July 26, 2024
ఆ తర్వాత కెప్టెన్ నిడా దార్(23) ఇన్నింగ్స్ నిర్మించే ప్రయత్నం చేసింది. ఒకదశలో 100 కొట్టడమే కష్టమనుకున్న పాక్ జట్ట అనూహ్యంగా 140 రన్స్ చేసింది. ఆఖర్లో ఫాతిమా సనా(23 నాటౌట్), అలియా రియాజ్(16 నాటౌట్)లు ధనాధన్ ఆడి జట్టుకు పోరాడగలిగే స్కోర్ అందించారు.