TTD EO | తిరుమలలోని ప్రతి హోటల్లో ధరల పట్టిక తప్పనిసరి : టీటీడీ ఈవో
TTD EO | తిరుమల కు వచ్చే భక్తులకు సరసమైన ధరలకు పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన , రుచికరమైన ఆహారాన్ని అందించడమే టీటీడీ లక్ష్యమని ఈవోజె. శ్యామలరావు వెల్లడించారు.
తిరుమల : తిరుమల (Tirumala) కు వచ్చే భక్తులకు సరసమైన ధరలకు పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన , రుచికరమైన ఆహారాన్ని అందించడమే టీటీడీ లక్ష్యమని ఈవోజె. శ్యామలరావు (TTD EO Shyamala rao) వెల్లడించారు. ఈ లక్ష్యాన్ని చేరుకోవడానికి ఫుడ్ సేఫ్టీ విభాగం అన్నప్రసాదం సిబ్బందికి, పెద్ద , జనతా క్యాంటీన్ల నిర్వాహకులకు త్వరలో శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు.
ప్రతి హోటల్ లో ధరల పట్టికను తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని, ప్రమాణాలను మెరుగు పరుచుకునేందుకు ఆగస్టు 5వ తేదీ వరకు సమయం ఇస్తున్నట్లు వివరించారు. తిరుమల గోకులం విశ్రాంతి భవనంలోని సమావేశ మందిరంలో శుక్రవారం ఫుడ్ సేఫ్టీ శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. తిరుమలలోని అన్ని రెస్టారెంట్లు (Resturant) , తినుబండారాల తయారీదారులు అనుసరించాల్సిన పరిశుభ్రత , పారిశుద్ధ్య పద్ధతులను వివరించారు.
ఆహారం చెడిపోవడం వల్ల కలిగే భౌతిక, రసాయన, జీవ ప్రమాదాలు, ముడి సరుకులు నిల్వ చేసే పద్ధతులు, వృధా నిర్మూలన ప్రణాళిక, ఆహార భద్రత చట్టాలు, చట్టాల ఉల్లంఘన శిక్షలను అధికారులు ఈవోకు వివరించారు. ఈ సమావేశంలో జేఈవో వీరబ్రహ్మం, అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ వెంకటేశ్వరరావు, తిరుమల ఫుడ్ సేఫ్టీ అధికారి జగదీష్,పెద్ద , జనతా క్యాంటీన్ల నిర్వాహకులు పాల్గొన్నారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

