Capital Gains Tax | ఈక్విటీల నుంచి భారీగా ఎఫ్ఐఐల పెట్టుబడులు ఔట్.. కారణమిదే..!
Capital Gains Tax | 2024-25 ఆర్థిక సంవత్సరంలో క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకోవడంతో గత మూడు సెషన్లలోనే విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు (ఎఫ్ఐఐ) దేశీయ స్టాక్ మార్కెట్ల నుంచి రూ.10,711.70 కోట్ల విలువైన షేర్లు విక్రయించారు.
Capital Gains Tax | ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024-25) బడ్జెట్లో క్యాపిటల్ గెయిన్స్ టాక్స్ పెంచుతూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన ప్రతిపాదన.. దేశీయ స్టాక్ మార్కెట్లలో విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లపై ప్రతికూల ప్రభావం చూపింది. 2024లో నెల వారీగా విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు తొలిసారి భారీగా దేశీయ స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టారు. ఈ నెల 22 నాటికి విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు (ఎఫ్ఐఐ) రూ.25,108.69 కోట్ల విలువైన షేర్లు కొనుగోలు చేశారు. కానీ, ఈ నెల 23న కేంద్ర బడ్జెట్ ను పార్లమెంటులో ప్రవేశ పెట్టిన తర్వాత మూడు సెషన్లలోనే ఎఫ్ఐఐలు రూ.10,711.70 కోట్ల విలువైన షేర్లు విక్రయించేశారు. దీంతో జూలై నెలలో ఎఫ్ఐఐల నికర కొనుగోళ్లు రూ.14,396.99 కోట్లకు పరిమితం అయ్యాయి.
గత 13 నెలల్లో ఎఫ్ఐఐలు అత్యధికంగా జూలై నెలలోనే అత్యధిక విలువైన పెట్టుబడులను ఈక్విటీ మార్కెట్లలో పెట్టినా, 2023-24 ఆర్థిక సంవత్సరంలో రూ.1.10 లక్షల కోట్ల పెట్టుబడులను ఉపసంహరించుకున్నారు. బడ్జెట్ లో క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ పెంచేయడంతో ఎఫ్ఐఐల మూడ్ లో గణనీయ మార్పు చోటు చేసుకుంది. ప్రత్యేకించి అన్ లిస్టెడ్, కంపల్సరీ కన్వర్టిబుల్ డిబెంచర్ల (సీసీడీస్)లో పెట్టుబడులను విదేశీ ఇన్వెస్టర్లు ఉపసంహరించుకున్నట్లు తెలుస్తోంది.
ఎన్ఎస్ఈ గణాంకాల ప్రకారం బడ్జెట్ తర్వాత ఎఫ్ఐఐల ఉపసంహరించుకున్న నిధుల వివరాలు
తేదీ – క్యాష్ – ఇండెక్స్ ఫ్యూచర్స్ – స్టాక్ ఫ్యూచర్స్ (రూ.కోట్లలో)
23 – 2975 – 3660 – 6174
24 – 5131 – 3588 – 3008
25- 2606 – 3088 – 1500
మొత్తం – 10,712- 10,336- 10,682
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dussehra Celebrations | ఎర్రవెల్లిలో కేసీఆర్ ఇంట దసరా వేడుకలు..
Dhanush Party | ధనుష్ కొత్త పార్టీ అంటూ వార్తలు.. టీవీకే స్పందన ఏమిటంటే..!
Ravana Dahan | రావణుడిని దహనం చేయని ఊరు.. ఈ శివాలయం వెనుక కథేంటి?
Constipation | మలబద్ధకంతో బాధపడుతున్నారా.. ? అయితే ఈ 5 రకాల పండ్లను మీ డైట్లో చేర్చుకోండి..!
Crude Oil Price | ఐదు నెలల గరిష్ఠానికి ముడిచమురు ధరలు.. కారణాలివే..!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

