Vinod Kumar | కేంద్ర మంత్రి పదవి పోయినా పర్వాలేదు.. తెలంగాణ హక్కుల కోసం కొట్లాడండి : మాజీ ఎంపీ వినోద్ కుమార్
Vinod Kumar | కేంద్ర మంత్రి పదవి పోయినా పర్వాలేదు.. కానీ తెలంగాణ హక్కుల కోసం కొట్లాడండి అని మాజీ ఎంపీ వినోద్ కుమార్ బీజేపీ ఎంపీలకు సూచించారు. ఈ లోక్‌సభ సమావేశాల్లో బీజేపీ నుంచి గెలిచిన 8 మంది ఎంపీలు.. కనీసం 8 నిమిషాలు కూడా మాట్లాడలేదు.. రాష్ట్రానికి కొత్త ప్రాజెక్టులు తీసుకురాలేదని వినోద్ కుమార్ తెలిపారు.
Vinod Kumar | వరంగల్ : కేంద్ర మంత్రి పదవి పోయినా పర్వాలేదు.. కానీ తెలంగాణ హక్కుల కోసం కొట్లాడండి అని మాజీ ఎంపీ వినోద్ కుమార్ బీజేపీ ఎంపీలకు సూచించారు. ఈ లోక్‌సభ సమావేశాల్లో బీజేపీ నుంచి గెలిచిన 8 మంది ఎంపీలు.. కనీసం 8 నిమిషాలు కూడా మాట్లాడలేదు.. రాష్ట్రానికి కొత్త ప్రాజెక్టులు తీసుకురాలేదని వినోద్ కుమార్ తెలిపారు. వరంగల్ కాజీపేటలో రైల్వే కోచ్ ప్యాక్టరీ కోసం నిరసన తెలుపుతున్న వారికి వినోద్ కుమార్ సంఘీభావం ప్రకటించి, ప్రసంగించారు.
మొన్నటి లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు 8 మంది బీజేపీ, 8 మంది కాంగ్రెస్ ఎంపీలను గెలిపించారు. ఈ పదహారు మంది తెలంగాణ హక్కుల కోసం పోరాడడం లేదు. బయ్యారం ఉక్కు ప్యాక్టరీ, కాజీపేట రైల్వేకోచ్ ప్యాక్టరీలను సాధించే వరకు బీజేపీ, కాంగ్రెస్ ఎంపీలు, ఇద్దరు కేంద్ర మంత్రులు స్పీకర్ వెల్‌లోకి వెళ్లి నిరసన తెలపాలి. పోతే తెలంగాణ కోసం కేంద్ర మంత్రి పదవులు పోతాయి. కానీ తెలంగాణకు రావాల్సిన ప్రాజెక్టులు వస్తాయని వినోద్ కుమార్ పేర్కొన్నారు.
విభజన చట్టంలోని హామీలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విస్మరిస్తున్నాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం సొంతంగా అధికారంలోకి రాలేదు. టీడీపీ, జనతాదళ్ పార్టీలపై ఆధారపడి కేంద్ర ప్రభుత్వం నడుస్తుంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కోసం నిధులు, అమరావతి రాజధాని కోసం రూ. 15,000 కోట్లు నిధులు కేటాయింపు అయ్యేలా వ్యవహరించారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రకాశం, రాయలసీమ జిల్లాలకు వెనుకబడిన జిల్లాల పేరుతో పెద్ద ఎత్తున నిధులు కేటాయింపులు చేసుకున్నారని వినోద్ కుమార్ తెలిపారు.
ఖాజీపేట రైల్వే కోచ్ ప్యాక్టరీ కోసం 1985 నుంచి పోరాటం చేయడం జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం ఈ బడ్జెట్లో తెలంగాణకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. బీజేపీ, కాంగ్రెస్ ఎంపీల ప్రయత్నలోపం కారణంగానే తెలంగాణకు అన్యాయం జరుగుతుంది. బీఆర్ఎస్ పార్టీ ఎంపీలుగా తాము చాలా సార్లు పార్లమెంట్లో కోట్లాది జాతీయ రహాదారులు, ప్రాజెక్టులకు అనుమతులు సాధించుకున్నాం. కొత్త జిల్లాలకు నవోదయ పాఠశాలలు మంజూరు చేయలేదు. కేవలం పాత జిల్లాల్లో 9 మాత్రమే నవోదయ పాఠశాలలున్నాయని గుర్తు చేశారు.
తెలంగాణ రాష్ట్ర సాధన కోసమే పుట్టిన పార్టీ బీఆర్ఎస్. కాంగ్రెస్ లోపభూయిష్టమైన నిర్ణయాల వల్లనే ఇవాళ తెలంగాణలో వర్షాకాలంలో కూడా ప్రాజెక్టులు నీళ్లు లేకుండా మారాయి. నేను ఎంపీగా ఉన్న సమయంలో పార్లమెంట్లో కొట్లాడి బీబీ నగర్‌కు ఆల్ ఇండియా మెడికల్ ఇనిస్టిట్యూట్ తీసుకురావడం జరిగింది. తెలంగాణలో ఈ బీజేపీ, కాంగ్రెస్ ఎంపీలు కొట్లాడి ప్రధాని దగ్గరకు పోయి తెలంగాణకు నిధులు కేటాయించాలని ఈ బడ్జెట్ సమావేశాలు పూర్తయ్యే దాకా పోరాటం చేస్తే మనకు రావాల్సిన నిధులు తప్పకుండా సాధించుకోవచ్చు అని వినోద్ కుమార్ పేర్కొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

