Gold Investment | పెట్టుబడుల జోరు.. పసిడి ధరలు తగ్గడంతో ఎగబడుతున్న ఇన్వెస్టర్లు
బంగారంపై పెట్టుబడులు పెట్టేవారి సంఖ్య క్రమంగా పెరుగుతున్నది. ఒకప్పుడు పుత్తడి అంటే ఆమడం దూరంలో ఉన్న పెట్టుబడిదారులు ప్రస్తుతం ఇన్వెస్ట్ చేయడానికి ఎగబడుతున్నారు.
Gold Investment | న్యూఢిల్లీ, జూలై 26: బంగారంపై పెట్టుబడులు పెట్టేవారి సంఖ్య క్రమంగా పెరుగుతున్నది. ఒకప్పుడు పుత్తడి అంటే ఆమడం దూరంలో ఉన్న పెట్టుబడిదారులు ప్రస్తుతం ఇన్వెస్ట్ చేయడానికి ఎగబడుతున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి కేంద్ర సర్కార్ ప్రవేశపెట్టిన సార్వత్రిక బడ్జెట్లో కస్టమ్ సుంకాన్ని తగ్గిస్తూ తీసుకున్న నిర్ణయంతో గత నాలుగు రోజుల్లో బంగారం ధర ఏకంగా రూ.5 వేల వరకు తగ్గడమే ఇందుకు కారణం.
దీంతో మదుపరులు ఎగబడి కొనుగోళ్లు జరుపుతున్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ నిర్ణయంతో బంగారం అక్రమ రవాణా తగ్గే అవకాశాలున్నాయని పేర్కొన్నారు. ధర తగ్గడంతో వల్ల రిటైల్ ఇన్వెస్టర్లు బంగారంపై పెట్టుబడులు పెరిగే అవకాశం ఉన్నదని ఎల్కేపీ సెక్యూరిటీస్ రీసెర్చ అనలిస్ట్ జతీన్ త్రివేది పేర్కొన్నారు. భౌతిక బంగారంగానే కాకుండా పెట్టుబడి సాధనంగా బంగారాన్ని పరిశీలించే అవకాశాలున్నాయన్నారు. బంగారం, వెండిపై కస్టమ్స్ సుంకాన్ని 15 శాతం నుంచి 6 శాతానికి దించారు.
డిమాండ్ మరింత పైకి
ధరలు భారీగా తగ్గడంతో ఆభరణాల కొనుగోళ్లకు డిమాండ్ అనూహ్యంగా పెరిగింది. వచ్చేది శ్రావణ మాసం కావడంతోపాటు శుభకార్యాలు కూడా ప్రారంభంకానుండటంతో కొనుగోళ్లు ఊపందుకున్నాయని పీసీ జ్యూవెల్లర్ ఎండీ బలరాం గార్గ్ తెలిపారు. దీంతో కిలో బంగారం ధర రూ.9.82 లక్షల నుంచి రూ.3.93 లక్షలకు దిగొచ్చింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Man Kills Nephew To Sell Organs | అవయవాలు అమ్మి డబ్బు సంపాదించేందుకు.. బాలుడిని చంపిన బంధువు
Fire accident | ఇంట్లో ఘోర అగ్నిప్రమాదం.. కుటుంబంలోని ఆరుగురూ దుర్మరణం..!
Womens Health | నెలసరి ముందు వచ్చే సమస్యలను తగ్గించుకునేందుకు మహిళలు ట్యాబ్లెట్లను వాడాలా.. నిపుణులు ఏం చెబుతున్నారు..?
MLA Sudheer Reddy | సాగు, తాగు నీరందకుండా చేసిన దుర్మార్గుడు రేవంత్ రెడ్డి : ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి
Parliament: ప్రోరోగ్ కాకుండా 88 రోజులుగా వర్షాకాల సమావేశాలు.. పార్లమెంట్లో కొత్త రికార్డు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

