TTD | టీటీడీ అన్నప్రసాదాలకు నాణ్యమైన బియ్యం సరఫరా చేయాలి : ఈవో శ్యామలరావు
TTD | తిరుమలకు వచ్చే భక్తులకు అందించే అన్నప్రసాదాల రుచిని పెంచేందుకు నాణ్యమైన బియ్యం సరఫరా చేయాలని టీటీడీ ఈవో జె. శ్యామల రావు రైస్ మిల్లర్లను కోరారు.
తిరుమల : తిరుమలకు వచ్చే భక్తులకు అందించే అన్నప్రసాదాల (Annaprasadam) రుచిని పెంచేందుకు నాణ్యమైన బియ్యం సరఫరా చేయాలని టీటీడీ ( TTD) ఈవో జె. శ్యామల రావు రైస్ మిల్లర్లను కోరారు. టీటీడీకి బియ్యం సరఫరా చేస్తున్న రైస్మిల్లర్ల (Rice Millers) తో బుధవారం సమావేశం నిర్వహించారు.
ఈవో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh), తెలంగాణ (Telangana) రాష్ట్రాలకు చెందిన రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ప్రతినిధులు బియ్యం సేకరణ సమయంలో నాణ్యత ప్రమాణాలను పెంపొందించడంలో దోహదపడే అంశాలను ఇవ్వాలని కోరారు. తద్వారా టెండర్లకు ఆహ్వానించే సమయంలో వాటిని చేర్చవచ్చని అన్నారు. అన్నం రుచిని పెంపొందించేందుకు రైస్ మిల్లర్స్ పలు సూచనలు చేశారు.
ఇందులో ముఖ్యంగా మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాదంలో దశాబ్దంన్నర కాలం నాటి వంట పరికరాల స్థానంలో అత్యాధునిక యంత్రాలను ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ మేరకు ఈవో స్పందిస్తూ ఇప్పటికే టీటీడీ ఈ విషయమై ఆలోచన చేసిందని, త్వరలో వంటశాలలను ఆధునీకరించనున్నట్లు ఈవో తెలిపారు.
టీటీడీకి రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లు విరాళం
కలకత్తాకు చెందిన మోటోవోల్ట్ సీఈవో తుషార్ చౌదరి బుధవారం రూ.2.45 లక్షలు విలువైన రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లను టీటీడీకి విరాళంగా అందించారు. ఈ మేరకు శ్రీవారి ఆలయం ఎదుట జేఈవో వీరబ్రహ్మంకు మోటోవోల్ట్ సంస్థ ప్రతినిధులు స్కూటర్ తాళాలు అందించారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

