SLW vs PAKW | దంచేసిన పాక్ అమ్మాయిలు.. శ్రీలంక ముందు భారీ లక్ష్యం
SLW vs PAKW : మహిళల ఆసియా కప్ సెమీ ఫైనల్లో పాకిస్థాన్ (Pakistan) అమ్మాయిలు దంచేశారు. ఆతిథ్య శ్రీలంక (Srilanka) బౌలర్లను ఉతికేస్తూ జట్టుకు భారీ స్కోర్ అందించారు.
SLW vs PAKW : మహిళల ఆసియా కప్ సెమీ ఫైనల్లో పాకిస్థాన్ (Pakistan) అమ్మాయిలు దంచేశారు. ఆతిథ్య శ్రీలంక బౌలర్లను ఉతికేస్తూ జట్టుకు భారీ స్కోర్ అందించారు. ఓపెనర్లు గుల్ ఫెరొజా(25), మునీబా అలీ (37)లు శుభారంభమిచ్చి పునాది వేశారు. అయితే.. వీళ్లిద్దరిని వెనక్కి పంపిన లంక బౌలర్లు స్కోర్ బోర్డు వేగానికి అడ్డుకట్ట వేశారు. ఒకదశలో 100 కొట్టడమే కష్టమనుకున్న పాక్ జట్ట అనూహ్యంగా 140 రన్స్ చేసింది. ఆఖర్లో ఫాతిమా సనా(23 నాటౌట్), అలియా రియాజ్(16 నాటౌట్)లు ధనాధన్ ఆడి జట్టుకు పోరాడగలిగే స్కోర్ అందించారు.
టాస్ ఓడిన పాకిస్థాన్‌కు ఓపెనర్లు అదిరే ఆరంభమిచ్చారు. బలమైన లంక బౌలింగ్ యూనిట్‌ను ఓపెనర్లు గుల్ ఫెరొజా(25), మునీబా అలీ(37)లు ఉతికేస్తూ స్కోర్ బోర్డును ఉరికించారు. దాంతో, పవర్ ప్లేలో పాక్ 45 రన్స్ కొట్టింది. తొలి వికెట్‌కు 61 పరుగులు జోడించిన వీళ్లిద్దని ప్రబోధని వెనక్కి పంపింది. ఆ తర్వాత వచ్చిన అమీన్(10), నిడా దార్(23)లు లంక స్పిన్నర్లను దీటుగా ఎదుర్కోలేకపోయారు. దాంతో, స్కోర్ నెమ్మదించింది.
𝐒𝐭𝐞𝐚𝐝𝐲 𝐬𝐭𝐚𝐫𝐭 𝐛𝐲 𝐭𝐡𝐞 𝐨𝐩𝐞𝐧𝐞𝐫𝐬 🤝
Pakistan: 25/0 (4) #WomensAsiaCup2024 #ACC #HerStory #SLWvPAKW pic.twitter.com/Qb5MX19xWy
— AsianCricketCouncil (@ACCMedia1) July 26, 2024
అయితే.. ఆఖర్లో ఫాతిమా సనా(23 నాటౌట్), అలియా రియాజ్(16 నాటౌట్)లు దూకుడుగా ఆడారు. 14.5 ఓవర్ల వద్ద 99 పరుగులకే 4 వికెట్లు పడిన జట్టును ఆదుకంటూ బౌండరీల మోత మోగించారు. ఐదో వికెట్‌కు 41 రన్స్ జోడించి శ్రీలంక ముందు భారీ లక్ష్యాన్ని ఉంచారు.
ఇవి కూడా చదవండి
- Vinod Kumar | కేంద్ర మంత్రి పదవి పోయినా పర్వాలేదు.. తెలంగాణ హక్కుల కోసం కొట్లాడండి : మాజీ ఎంపీ వినోద్ కుమార్
- Capital Gains Tax | ఈక్విటీల నుంచి భారీగా ఎఫ్ఐఐల పెట్టుబడులు ఔట్.. కారణమిదే..!
- TTD EO | తిరుమలలోని ప్రతి హోటల్లో ధరల పట్టిక తప్పనిసరి : టీటీడీ ఈవో
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
నిబంధనలకు విరుద్ధంగా ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు
Global Telangana Association | గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ ఆధ్వర్యంలో వాషింగ్టన్ డీసీలో బతుకమ్మ, దసరా వేడుకలు
attack on bus | జమ్ముకశ్మీర్ బస్సుపై రాళ్లతో దాడి.. డ్రైవర్‌ను ఉగ్రవాదిగా పేర్కొన్న వ్యక్తులు
BRS Leaders | కష్ట కాలంలో అండగా బీఆర్ఎస్.. అధినాయకులపై ప్రత్యేక అభిమానం చాటుకుంటున్న రవీందర్
Stock Markets | భారీ నష్టాల్లో కొనసాగుతున్న స్టాక్ మార్కెట్లు.. ఇన్వెస్టర్స్ సంపద రూ.4 లక్షల కోట్లు ఆవిరి..!
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

