బేసిక్ విద్యావిధానం అమల్లోకి వచ్చిన సంవత్సరం?
జూలై 16 తరువాయి సైన్స్ కంటెంట్
73. కింది వాటిలో సరికాని అంశం?
1. రెండు మొక్కల కాండాన్ని కలిపి ఒకే మొక్కగా పెంచడాన్ని అంటుకట్టడం అంటారు
2. అంటుకట్టడంలో నేలలో పెరుగుతున్న మొక్కను సయాన్ అని వేర్లు లేని కాండం కలిగిన దాన్ని స్టాక్ అంటారు
3. మొక్కలో కనీసం ఒక్క కణుపు అయినా కలిగిన శాఖను నేలవైపు ఉంచి కొంత భాగం బయటకు కనిపించేలా మట్టి కప్పే ప్రక్రియ అంటుతొక్కడం
4. ఒక మొక్కలో కోరకం కలిగిన మొక్క భాగాన్ని వేరుచేసి నేల నుంచి కొత్త మొక్క ఏర్పడటాన్ని ఛేదనం అంటారు
74. జతపరచండి.
ఎ. స్టోలన్లు 1. చీమలు
బి. రణపాల 2. బద్దెపురుగు
సి. కోరకీభవనం 3. లైకెన్లు, స్పైరోగైరా
డి. కొమ్మలు 4. పసుపు
ఇ. ముక్కలవడం 5. ఈస్ట్
ఎఫ్. పునరుత్పత్తి 6. ఆకు చివరి భాగాల నుంచి కొత్త మొక్క
జి. అనిషేక జననం 7. స్ట్రాబెర్రి, వాలిస్ నేరియా
1) ఎ-7, బి-6, సి-5, డి-4, ఇ-3, ఎఫ్-1, జి-2
2) ఎ-7, బి-6, సి-4, డి-5, ఇ-3, ఎఫ్-2, జి-1
3) ఎ-7, బి-6, సి-5, డి-4, ఇ-3, ఎఫ్-2, జి-1
4) ఎ-7, బి-6, సి-5, డి-3, ఇ-4, ఎఫ్-2, జి-1
75. కింది వాటిలో తప్పుగా ఉన్న వాక్యాన్ని గుర్తించండి.
1) రైజోపస్, మ్యూకార్, బ్యాక్టీరియా, ఫెర్న్(పుష్పించని మొక్కల్లో)ల్లో సిద్ధబీజాల ద్వారా ప్రత్యుత్పత్తి జరుపుతుంది
2) శుక్రకణాలను తాత్కాలికంగా నిల్వచేసేది ఎపిడిడైమిస్ (ముష్కాలు శుక్రోత్పాదిక నాళికలు – శుక్రనాళికలు – ఎపిడిడైమిస్ – ప్రసేకం)
3) గర్భాశయం (లేదా) యుటిరస్లో ఉండే కండరాలు నియంత్రిత కండరాలు
4) పిండాన్ని ఆవరించిన బాహ్యత్వచాన్ని పరాయువు/ కోరిన్ అంటారు
76. కింది వాటిలో సరైన వాక్యాలు?
ఎ. హార్మోన్లు రక్త ప్రవాహంలోకి, నాళాల్లోకి విడుదల చేయబడి శరీరంలోని భాగాలకు చేరుతాయి
బి. యుక్తవయస్సు రాగానే ఈ హార్మోన్లు శరీరంలో జరిగే మార్పులను ఉత్తేజితం చేస్తాయి
సి. స్త్రీలలో ప్రత్యుత్పత్తి దశ 10-12 సం.లకు ప్రారంభమై 45-50 సం.ల వరకు కొనసాగుతుంది
డి. రెండు ఊపిరితిత్తుల మధ్య అమరి ఉండే అంతస్రావిక గ్రంధి పీనియల్ గ్రంధి
1) ఎ, బి, సి, డి 2) బి, సి, ఇ
3) ఎ, బి, సి, డి, ఇ 4) బి, సి, డి, ఇ
77. కింది వాటిలో సరికానివాటిని గుర్తించండి.
ఎ. స్త్రీ జీవి లోపల జరిగే ఫలదీకరణాన్ని అంతర ఫలదీకరణం అంటారు. ఉదా : క్షీరదాలు, గుడ్డు
బి. అండాన్ని, శుక్రకణాలను పరస్థానిక ఫలదీకరణం కోసం ఉంచి, ఏర్పడిన సంయుక్త బీజాన్ని వారం రోజులు అభివృద్ధి చెందించి తల్లిగర్భంలో ప్రవేశ పెట్టడాన్ని టెస్ట్ట్యూబ్ బేబీ అంటారు
సి. చేపలు, కప్పలు, సముద్ర నక్షత్రాల్లో బాహ్య ఫలదీకరణం జరుగుతుంది
1) ఎ, బి, సి వాక్యాలు సరికావు
2) ఎ, బి సరైనవి, సి సరికాదు
3) ఎ, బి, సి వాక్యాలు సరైనవి
4) ఎ, సి సరైనవి, బి సరికాదు
78. ‘డాలి’ క్లోనింగ్ ప్రక్రియ గురించి సరికాని వాక్యం ?
1) ఒక కణాన్ని/ భాగాన్ని మొత్తం జీవి అచ్చమైన ప్రతిరూపాన్ని తయారుచేయడం ‘క్లోనింగ్’ అంటారు
2) క్లోనింగ్ ప్రక్రియను జంతువుల్లో మొదటిసారి నెదర్లాండ్లోని రోజాలిన్ సంస్థలో ఇయాన్ విల్మట్ నిర్వహించారు
3) క్లోనింగ్ ప్రక్రియ ద్వారా డాలి అనే మొదటి క్షీరదం 1996, జూలై 5న జన్మించింది
4) డాలి అనే క్షీరదం ఊపిరితిత్తులకు సంబంధిత వ్యాధితో 2003 ఫిబ్రవరి 14న మరణించింది
79. కింది జీవి, గర్భావధికాల జతల్లో సరికానిది గుర్తించండి?
1. పిల్లి, కుక్క – 63 రోజులు
2. గుర్రం – 330 రోజులు
3. ఆవు – 280 రోజులు
4. ఏనుగు – 400 రోజులు
5. ఎలుకలు, చుంచెలుక – 20 నుంచి 22 రోజులు
80. శుక్రకణం నిర్మాణంలో తోక భాగం కదలికలకు, మధ్య భాగంలో ఉండే మైటోకాండ్రియాలు శక్తికి, తల భాగంలో ఉండే ఏక్రోసోమ్ ఎందుకు ఉపయోగపడుతుంది?
ఎ. బాహ్య ఫలదీకరణం
బి. అంతర ఫలదీకరణంలో
సి. లైంగిక ప్రత్యుత్పత్తిలో
డి. అలైంగిక ప్రత్యుత్పత్తిలో
1) ఎ, బి 2) ఎ, సి
3) బి, సి, డి 4) ఎ, బి, సి
81. బండి చక్రాలు, టైర్లతో నిర్మించిన గృహంలో శైలు ఉంటుంది. శైలు ఉండే గృహం ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి నడిపే విధంగా ఉంటుంది. శైలు ఉండే నివాసం కింది వాటిలో దేనికి సంబంధించింది?
1) కారవాన్ 2) గుడారం
3) జట్కా 4) కచ్చా ఇల్లు
82. మార్చి 22 అనేది కింది వాటిలో దేనికి సంబంధించింది?
1) జాతీయ జల దినోత్సవం
2) ప్రపంచ అటవీ దినోత్సవం
3) ప్రపంచ ధరిత్రీ దినోత్సవం
4) ప్రపంచ జల దినోత్సవం
83. మనోజ్ హిమాలయ పర్వతాలను సందర్శించాడు. అక్కడి ప్రజలు ప్రయాణం కోసం ఉపయోగించే వాటిని పరిశీలించాడు. మనోజ్ పరిశీలించినవి ఏవి?
1) స్లెడ్జ్లు 2) కుక్కలు
3) జడల బర్రె 4) 1, 3
ట్రై మెథడ్స్
84. చారిత్రక, భౌగోళిక, సాంఘిక విషయాల సంబంధ, అంతర సంబంధాల అధ్యయనమే సాంఘికశాస్త్రం అని తెలిపింది?
1) వెస్లీ 2) ఫారెస్టర్
3) హెమ్మింగ్స్ 4) మైకెల్
85. బేసిక్ విద్యా విధానం అమల్లోకి వచ్చిన సంవత్సరం?
1) 1937 2) 1973
3) 1977 4) 1956
86. పాఠశాల అనేది సూక్ష్మరూపంలో ఉండే భారతదేశం అని తెలిపింది?
1) కొఠారి
2) ఈశ్వరీభాయ్ పటేల్
3) జాన్ డ్యూయి 4) ఇంగ్లిష్
87. ఎకనామిక్స్ అనేది ఏ భాషా పదం?
1) గ్రీక్ 2) లాటిన్
3) అరబిక్ 4) ఇంగ్లిష్
88. కొఠారి కమిషన్ ప్రకారం ఉన్నతస్థాయి పాఠశాలల్లో దేన్ని ప్రవేశపెట్టాలని సూచించింది?
1) సాంఘిక శాస్త్రం 2) సామాన్య శాస్త్రం
3) గణితం 4) సామాజిక శాస్త్రం
89. సాంఘిక శాస్ర్తాన్ని 1, 2 తరగతులకు ఉపాధ్యాయ కరదీపిక ఆధారంగా బోధన చేయాలని తెలిపింది?
1) కొఠారి 2) యస్పాల్
3) ఈశ్వరీభాయ్ పటేల్ కమిటీ
4) జాతీయ విద్యా విధానం
90. హిస్టోరియా అంటే?
1) గృహ నిర్వహణ అధికారం
2) భూమిని వర్ణించే శాస్త్రం
3) అన్వేషణ ద్వారా అభ్యసనం
4) రాజ్య నగరం
91. విద్యార్థి జ్ఞానం కుటుంబం నుంచి మొదలై విశ్వ జనీనమైన అంశాల వైపు సాగాలని తెలిపింది?
1) కొఠారి
2) ఈశ్వరీభాయ్ పటేల్ కమిటీ
3) గాంధీ 4) జాన్ డ్యూయి
92. బ్రహ్మగుప్తుడు రాసిన బ్రహ్మస్ఫుట
సిద్ధాంతానికి ప్రధాన భూమిక?
1) బీజగణితం 2) వేదాంత శాస్త్రం
3) ఖగోళ శాస్త్రం
4) భౌతిక రసాయన శాస్త్రం
93. మొదటి భాస్కరుడు ఏ ప్రాంతానికి చెందిన వ్యక్తి?
1) విజ్జలవిడ 2) పాటలీపుత్రం
3) భిల్లమం 4) కేరళ
94. బెఫెరా మ్యాథమెటికా గ్రంథ రచయిత?
1) ఆయిలర్ 2) వాలస్
3) ఫెర్మా 4) యాక్లిడ్
95. ఎలిమెంట్స్ గ్రంథంలోని భాగాలు?
1) 12 2) 13
3) 14 4) 15
96. విజ్ఞాన శాస్త్రం ఒక పరిశోధనా విధానం అని తెలిపింది?
1) గ్రీన్ 2) ఐన్స్టీన్
3) శర్మ 4) రిచర్డ్సన్
97. కింది వాటిలో ద్రవ్యాత్మక నిర్మాణానికి చెందింది?
1) పరిశీలన 2) అన్వేషణ
3) ప్రయోగ నిర్వహణ
4) నియమం
98. Manthane అనేది ఏ భాషా పదం?
1) ప్రాచీన గ్రీకు పదం
2) నవీన గ్రీకు పదం
3) ప్రాచీన లాటిన్ పదం
4) నవీన లాటిన్ పదం
99. ఆర్యభట్ట జన్మకాలాన్ని గుర్తించండి.
1) 476, మార్చి 12
2) 467, మార్చి 12
3) 476, మార్చి 21
4) 467, మార్చి 21
100. భూమి నీడల వల్ల చంద్రగ్రహణం, చంద్రకళలు ఏర్పడతాయని తెలిపింది?
1) ఆర్యభట్ట 2) బ్రహ్మగుప్తుడు
3) భాస్కరాచార్యుడు 4) యూక్లిడ్
101. యావత్ – తావత్ అనే అవ్యక్త రాశులు ఎవరికి చెందినవి?
1) అర్యభట్ట 2) భాస్కరాచార్యుడు
3) బ్రహ్మగుప్తుడు 4) యూక్లిడ్
102. అడవుల సంఖ్య తగ్గుతూ ఉండే వర్షపాతం తగ్గవచ్చు అనేది?
1) ప్రశ్న పరిశీలన
2) ప్రాగుక్తిక పరికల్పన
3) ప్రకటనాత్మక పరికల్పన
4) శూన్య పరికల్పన
103. కింది వాటిలో యదార్థ లక్షణాలకు చెందినది?
1) ప్రత్యక్షంగా చూడగలిగినదిగా ఉండాలి
2) మారనివిగా ఉండాలి
3) వివాదాసహితంగా ఉండాలి
4) ఎన్నిసార్లు అయినా ప్రదర్శించగిలిగేలా ఉండాలి
104. రెండు చరరాశులు లేదా సంఘటనల మధ్య సంబంధం ఉంది అని తెలిపే పరికల్పనే?
1) శూన్య పరికల్పన
2) ప్రకటనాత్మక పరికల్పన
3) ప్రాగుక్తిక పరికల్పన
4) ప్రశ్నా పరికల్పన
105. విస్తారంగా పరిక్షించిన సిద్ధాంతాలే?
1) భావనలు 2) యధార్థాలు
3) సూత్రాలు 4) నియమాలు
106. ఒక భౌతిక వస్తువు లేదా సంఘటనను వివరించే ప్రవచనం?
1) యధార్థం 2) నియమం
3) సూత్రం 4) సాధారణీకరణం
107. సంబంధం ఉన్న సత్యాల నుంచి ఏర్పడేవి?
1) యధార్థాలు 2) సాధారణీకరణాలు
3) భావనలు 4) నియమాలు
తెలుగు
108. 5వ తరగతి తెలుగు వాచకం పేరు?
1) నవ వసంతం – 5
2) జాబిలి – 5
3) సింగిడి – 2
4) తెలుగుతోట – 5
109. నీటి అందాలు పాఠం ఇతివృత్తం?
1) పర్యావరణం 2) ప్రకృతి పరిశీలన
3) సంస్కృతి 4) దర్శనీయ స్థలాలు
110. ‘వానదేవుడా! ఏమేమి చూడాలి’ పాఠంలో ప్రక్రియలు?
1) కథ, గేయం 2) గేయం, కథ
3) గేయం, గేయం 4) గేయం, గేయకథ
111. ఛ, జ – వరుసగా?
1) దంత్యం, కంఠ్యం
2) దంత్యం, మూర్థన్యం
3) తాలవ్యం, దంత్యం
4) దంత్యం, తాలవ్యం

ప్రాక్టీస్ బిట్స్ రూపొందించిన వారు
సైన్స్ – ఢిల్లీబాబు,
ట్రై మెథడ్స్- రవికుమార్,
తెలుగు- వేణుగోపాల్
ఏకేఆర్ స్టడీ సర్కిల్, వికారాబాద్
Read Today's Latest Nipuna-education News in Telugu and Telugu News
- Tags
- DSC
- SGT
- Study material
RELATED ARTICLES
తాజా వార్తలు
Janakiram Marella | ‘కామ్రేడ్ కళ్యాణ్’తో సంచలనం.. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకుడు జానకిరామ్ మారెళ్ల
Rahul Gandhi | లక్నోలో పోస్టర్ల కలకం.. రాహుల్, అఖిలేష్, ఎలాన్ మస్క్ ఫొటోలతో రావణ పోస్టర్
Sensory Overload | సెన్సరీ ఓవర్లోడ్ అంటే ఏమిటి.. లక్షణాలు ఎలా ఉంటాయి.. తగ్గేందుకు ఏం చేయాలి..?
Vijay Deverakonda | ట్యాంక్బండ్పై విజయ్ దేవరకొండ, రష్మిక సందడి.. నేడు సద్దుల బతుకమ్మ వేడుకలకు ‘విరోష్’ జంట!
Varanasi | మహేష్ బాబు – రాజమౌళి ‘వారణాసి’ మూవీ విడుదల వాయిదా? త్వరలోనే కొత్త తేదీ ప్రకటన!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

