BRS Team | దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ తో బీఆర్ఎస్ బృందం భేటీ..కాజీపేట రైల్వే డివిజన్ కోసం వినతి
BRS Team | బీఆర్ఎస్ నాయకులు, మాజీ ఎంపీ బొయినపల్లి వినోద్‌కుమార్ , మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్‌బాబు దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ తో సోమవారం భేటీ అయ్యారు.
హైదరాబాద్ : బీఆర్ఎస్ నాయకులు, మాజీ ఎంపీ బొయినపల్లి వినోద్‌కుమార్( B. Vinid Kumar) , మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్‌బాబు ( Ramesh Babu ) దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్( SCR GM ) తో సోమవారం భేటీ అయ్యారు. కాజీపేట రైల్వే డివిజన్( Railway Division ) తో పాటు స్థానికులే ఉద్యోగ అవకాశాలు కల్పించాలని కోరుతూ వినతి పత్రం అందజేశారు.
ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ కాజీపేటకు కోచ్ ఫ్యాక్టరీ కావాలని 40 ఏళ్ల నుంచి డిమాండ్ ఉందని, అయితే కేంద్రం పదేళ్ల క్రితం వ్యాగన్ ఫ్యాక్టరీ కోసం ప్రకటన చేసిందని తెలిపారు. స్థానిక నాయకులు ఈ ప్రాంత రైతులతో మాట్లాడి తక్కువ ధరతో భూమి ఇవ్వడానికి ఒప్పుకున్నారని వివరించారు.
అయితే ఫ్యాక్టరీలో స్థానికులకు కాకుండా ప్రైవేట్ వారిచే పనులు చేస్తున్నట్టు జీఎం పేర్కొన్నారని, స్థానికులకు అవకాశమివ్వాలని కోరినట్లు వారు వెల్లడించారు. కాజీపేట రైల్వే డివిజన్ విషయం రైల్వే బోర్డు నిర్ణయం తీసుకుంటుందని జీఎం వివరించారని తెలిపారు.
లాతూర్‌లో స్థానికులకు ఇచ్చిన విధంగా కాజీపేటలో భూములు కోల్పోయిన వారికి ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Greater Noida | టీ, నూడుల్స్ కారణం కాదు.. ఆ కుటుంబం ఆత్మహత్య చేసుకుంది..!
Bigg Boss 10 | బిగ్‌బాస్ తెలుగు 10లో ఊహించని ట్విస్ట్.. ఈ వారం నో ఎలిమినేషన్,సీక్రెట్ రూమ్‌లోకి షాలిని!
Kolkata Stampede | ‘తొక్కిసలాట ఎలా జరిగింది’.. బాధితులను పరామర్శించిన కేంద్ర హోంమంత్రి, బెంగాల్ సీఎం.. Video
The Paradise | ఓటీటీలోకి ‘ది ప్యారడైజ్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Kolkata stampede | తొక్కిసలాట ఘటనపై రాష్ట్రపతి, ప్రధాని సంతాపం.. రూ.2 లక్షల పరిహారం ప్రకటించిన ప్రధాని
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

