YCP | వైసీపీకి మరో షాక్.. త్వరలో టీడీపీలో చేరనున్న మండలి డిప్యూటీ చైర్పర్సన్ ?
YCP | ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఘోర ఓటమి పాలైన వైసీపీకి వరుస షాక్‌లు తగులుతున్నాయి.
అమరావతి : ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఘోర ఓటమి పాలైన వైసీపీ(YCP) కి వరుస షాక్‌లు తగులుతున్నాయి. రాష్ట్రంలో అధికార మార్పిడి జరిగిన రెండు నెలల్లోనే వైసీపీకి చెందిన పలువురు కూటమి పార్టీలైన టీడీపీ(TDP), జనసేన(Janasena) లో చేరుతున్నారు.
తాజాగా ఏపీ శాసన మండలిలో డిప్యూటీ చైర్‌పర్సన్‌గా ఉన్న వైసీపీ నాయకురాలు జకియా ఖానమ్(Jakia Khanam) కుటుంబ సభ్యులతో కలిసి మంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా లోకేష్(Minister Nara Lokesh) ను శుక్రవారం కలువడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇప్పటికే ఆమె టీడీపీ సీనియర్ నాయకుడు, మంత్రి ఫరూఖ్‌తో సమావేశమై టీడీపీ చేరే అంశం చర్చించినట్లు సమాచారం.
అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సూచనల మేరకు 2020 జులై 29న గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికైన జకియా 2021 నవంబర్ 21న ఏపీ శాసన మండలి డిప్యూటీ చైర్‌పర్సన్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నెల్లూరు జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే ఒకరు రెండు రోజుల క్రితం వైసీపీని వీడుతున్నట్లు ప్రకటించారు. వైసీపీకి చెందిన కొందరు పెద్దల వ్యవహారం తీరుకు మనస్తాపానికి గురయ్యారు. విశాఖపట్నంలోనూ సుమారు 20 మంది వైసీపీ కార్పొరేటర్లు సైతం పార్టీకి రాజీనామా చేసి టీడీపీ, జనసేనలో చేరారు.
Read more :
YS Jagan | నారా లోకేశ్ రెడ్‌బుక్‌పై వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Firecrackers History | దీపావళికి బాణసంచా ఎలా వచ్చింది? చైనా నుంచి భారత్‌కు టపాసుల ప్రయాణం ఇదే!
Scene | బాక్సాఫీస్ వద్ద సూర్య ‘సీన్’ సెన్సేషన్.. రెండు రోజుల్లో 11.5 లక్షలకు పైగా టికెట్లు!
Diwali Celebrations | దేశంలో ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా దీపావళి.. మనకు తెలియని పండుగ విశేషాలివే!
Janhvi Kapoor | కోలీవుడ్‌పై ఫోకస్ పెంచిన బాలీవుడ్ బ్యూటీ.. తమిళ సినిమాలపై ప్రశంసల వర్షం వెనుక అసలు కారణం ఇదేనా?
Bigg Boss 10 | బిగ్ బాస్‌లో ఈ వారం ఎలిమినేషన్ లేదా.. దీపావళి స్పెషల్‌గా నాగార్జున భారీ ట్విస్ట్
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

