Oppo Reno 12 5G | ఒప్పో ప్రీమియం ఫోన్లు రెనో 12 5జీ సిరీస్ ఫోన్లు ఆవిష్కరణ.. ఇవీ డీటెయిల్స్..!
Oppo Reno 12 5G | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ ఒప్పో (Oppo) తన ప్రీమియం ఫోన్.. ఒప్పో రెనో 12 5జీ (Oppo Reno 12 5G) ఫోన్ సేల్స్ గురువారం ప్రారంభం అయ్యాయి.
Oppo Reno 12 5G | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ ఒప్పో (Oppo) తన ప్రీమియం ఫోన్.. ఒప్పో రెనో 12 5జీ (Oppo Reno 12 5G) ఫోన్ సేల్స్ గురువారం ప్రారంభం అయ్యాయి. 8జీబీ ర్యామ్ విత్ 256 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.32,999 పలుకుతుంది. సన్ సెట్ పీచ్, మ్యాట్టె బ్రౌన్, ఆస్ట్రో సిల్వర్ రంగుల్లో లభిస్తుంది. యూజర్ ఎక్స్పీరియన్స్ విస్తరణకు పలు ఏఐ ఫీచర్లతో వస్తోంది ఒప్పో రెనో 12 5జీ (Oppo Reno 5G). ఏఐ ఎరేజ్ 2.0, ఏఐ ఎరేజర్ 2.0, ఎఐ క్లియర్ ఫేస్, ఏఐ బెస్ట్ ఫేస్, ఏఐ టూల్ బాక్స్ వంటి ఫీచర్లు ఉంటాయి. సీమ్ లెస్ ఇమేజ్ ఎడిటింగ్, ఇంప్రూవింగ్ డైలీ ప్రొడక్టివిటీకి ఏఐ ఫీచర్లు ఉపకరిస్తాయి. ‘మై ఒప్పో’ యాప్ ద్వారా ఒప్పో రెనో 12 5జీ ఫోన్లను కొనుగోలు చేసిన వారికి ఇంటర్నేషనల్ హాలీడే ఆఫర్ గెలుచుకునే అవకాశం ఉంది. ఈ ఆఫర్లలో ఒప్పో రెనో 12 డివైజెస్, ఫ్యామిలీ డైనింగ్ ఓచర్లు, ఒప్పో ఎంకో బడ్స్2 ఉంటాయి. ఈ ఆఫర్లు శుక్రవారం వరకూ అందుబాటులో ఉంటాయి.
ఒప్పో ఈ-స్టోర్, ఫ్లిప్ కార్ట్, ప్రధాన రిటైల్ స్టోర్ల ద్వారా కొనుగోలు చేసిన వారికి రూ.3000 వరకూ ఇన్స్టంట్ క్యాష్ బ్యాక్ ఆఫర్ లభిస్తుంది. ఎస్బీఐ, హెచ్డీఎఫ్సీ బ్యాంకు, ఐసీఐసీఐ బ్యాంకు, వన్ కార్డ్, కోటక్ మహీంద్రా బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, డీబీఎస్ బ్యాంకుల కార్డులపై కొనుగోలు చేసిన వారికి ఈ ఆఫర్లు వర్తిస్తాయి. అదనంగా 9 నెలల పాటు నోకాస్ట్ ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంటుంది. బజాజ్ ఫిన్ సర్వ్, టీవీఎస్ క్రెడిట్, హెచ్డీబీ ఫైనాన్సియల్ సర్వీసెస్, ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్, హోం క్రెడిట్ వంటి ఫైనాన్స్ సంస్థల ద్వారా కొనుగోలు చేసే వారు జీరో డౌన్ పేమెంట్, లో డౌన్ పేమెంట్ స్కీ్మ్స్ పొందొచ్చు. నూతన కస్టమర్లు మూడు నెలలపాటు యూ-ట్యూబ్ ప్రీమియం, గూగుల్ వన్ ప్రీ సేవలు ఉచితంగా పొందొచ్చు.
యూజర్ ఫ్రెండ్లీ ఫీచర్లతో అడ్వాన్స్డ్ ఏఐ కేపబిలిటీస్ కలిగి ఉంటుంది ఒప్పో రెనో 12 5జీ ఫోన్. క్వాడ్ మైక్రో కర్వ్డ్ ఇన్ ఫినైట్ వ్యూ స్క్రీన్, ఒప్పో రెనో 12 ప్రో 5జీ ఫోన్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ 2, ఒప్పో రెనో 12 ఫోన్ కార్నింగ్ గ్లా్స్ 7ఐ ప్రొటెక్షన్ కలిగి ఉంటాయి. రెండు ఫోన్లూ 6.7 అంగుళాల ఫుల్ హెచ్డీ+ డిస్ ప్లే విత్ 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేటు, 1200 నిట్స్ పీక్ బ్రైట్ నెస్ కలిగి ఉంటాయి.
డ్రాప్స్, ఇన్ పాక్ట్స్ నుంచి రెసిస్టెన్స్, ఆల్ రౌండ్ ఆర్మూర్,స్టర్డీ, కొర్రోషన్ రెసిస్టెన్స్ వంటి ఆప్షన్లు కూడా ఉంటాయి. యూఎస్బీ సీ పోర్ట్ కనెక్టివిటీతో వస్తున్నాయి. ఒప్పో రెనో 12 సిరీస్ ఫోన్లు మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ఎనర్జీ ప్రాసెసర్ తో వస్తున్నాయి. ఒక్టాకోర్ సీపీయూతో స్మూత్ పెర్ ఫార్మెన్స్, ఎక్స్ టెండెడ్ బ్యాటరీ లైఫ్ కలిగి ఉంటుంది. మీడియాటెక్ ఏపీయూ 655 ఏఐ క్యాపబిలిటీస్ ను పెంపొందిస్తుంది. రెండు ఫోన్లూ పలు ఏఐ ఫీచర్లతో వస్తున్నాయి. 80వాట్ల ఫాస్ట్ చార్జింగ్ మద్దతుతో 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీతో అందుబాటులో ఉంటాయి. ఈ బ్యాటరీ లైఫ్ నాలుగేండ్ల పాటు ఉంటుందని ఒప్పో హామీ ఇస్తోంది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
BRS Denmark | తప్పుడు కథనాన్ని ప్రచురించిన వెలుగు పత్రిక యాజమాన్యం క్షమాపణ చెప్పాలి : బీఆర్ఎస్ డెన్మార్క్
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
priest predicted son, shot dead | కొడుకు పుడతాడని జోస్యం చెప్పిన పూజారి.. కుమార్తె జన్మించడంతో ఆయనపై కాల్పులు జరిపి హత్య
Fauzi | దర్శకుడికి గాయం.. ప్రభాస్ ‘ఫౌజీ’ షూటింగ్కు చిన్న బ్రేక్
Tragedy | పండుగ పూట విషాదం.. రోడ్డు ప్రమాదంలో అన్న, చెల్లి దుర్మరణం
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

