Malaysia | మలేషియా తెలంగాణ అసోసియేషన్ (MYTA) నూతన కార్యవర్గ కమిటీని ప్రకటించింది. ఏఐసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్‌గౌడ్ (MLC Mahesh Kumar Goud) నూతన కార్యవర్గాన్ని ప్రకటించారు. ప్రెసిడెంట్‌గా సైదం తిరుపతి(Tirupati), వైస్ ప్రెసిడెంట్‌గా చిరుత చిట్టిబాబు , మహిళా ప్రెసిడెంట్‌గా కిరణ్మయి(Kiranmai) , జనరల్ సెక్రటరీగా సందీప్ గౌడ్ , జాయింట్ సెక్రటరీగా సత్యనారాయణ రావు, ట్రేజరర్‌గా సందీప్ కుమార్ లగిశెట్టిని ఎన్నుకున్నారు.
జాయింట్ ట్రేజరర్ సుందర్ రెడ్డి, యూత్ ప్రెసిడెంట్ సంతోష్ దాసరాజు, యూత్ వైస్ ప్రెసిడెంట్ శివ తేజ, ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ మారుతి, హరి ప్రసాద్, రాములు, రమేష్, మహేష్, శ్రీహరి, జీవం రెడ్డి, వినోద్, రఘుపాల్ రెడ్డి, రంజిత్ రెడ్డిను ఎన్నుకున్నారు. 
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ మైటా కార్యవర్గ ఎన్నికలకు ప్రాతినిధ్యం వహించిన అమర్నాథ్ గౌడ్, నూతన కమిటీ కార్యవర్గాన్ని అభినందించారు. భవిష్యత్‌లో మైటా చేసే కార్యక్రమాలకు తెలంగాణ ప్రభుత్వం (Telangana Government) తరఫున కావలసిన సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో తెలుగు పునాది అధ్యక్షులు దాతుక్ శ్రీకాంతారావు, టీమ్ డిప్యూటీ ప్రెసిడెంట్ ఆనంద్, మా ప్రెసిడెంట్ శ్రీరామ్, దాతుక్ సుహైనీ, దాతుక్ వేలనాథన్, గుణ శేఖరన్, అవినాష్ గౌడ్, టీపీసీసీ సేవాదళ్ స్టేట్ సెక్రటరీ అరుళ్ రావుల్, రాష్ట్ర గౌడ సంఘం మహిళా అధ్యక్షురాలు అనురాధ గౌడ్, హై కోర్ట్ సీనియర్ అడ్వకేట్ పాల్ తదితరులు పాల్గొన్నారు.