Harish Rao | కాళేశ్వరంపై ఉత్తమ్‌ది పాతపాటే.. మాజీ మంత్రి హరీశ్‌రావు ఫైర్
Harish Rao | కాళేశ్వరంపై మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి పాతపాటే పాడారని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు మండిపడ్డారు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ సమావేశం అనంతరం మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.
Harish Rao | కాళేశ్వరంపై మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి పాతపాటే పాడారని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు మండిపడ్డారు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ సమావేశం అనంతరం మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై ఉత్తమ్ అవాకులు చెవాకులు పేలి.. తన అవగాహన రాహిత్యాన్ని మరోసారి బయటపెట్టుకున్నారని విమర్శించారు. మేడిగడ్డ పునాదిని బలపరిచేందుకు అన్ని చర్యలు తీసుకున్నం అంటూనే మేడిగడ్డ వద్ద మట్టి పరీక్షలు సాధ్యపడలేదనడం ఉత్తమ్ తెలివితక్కువ తనానికినిదర్శనమంటూ ధ్వజమెత్తారు. నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ (NDSA) గతేడాది అక్టోబర్ చివరలో హడావుడిగా నివేదిక ఇచ్చిందని.. వండివార్చిన రాజకీయ నివేదికపై ఆనాడే విమర్శలు వెల్లువెత్తాయని గుర్తు చేశారు.
ఎలాంటి పరిశీలనలు జరుపకుండా, ఎలాంటి భూభౌతిక పరీక్షలు చేయకుండా, తెలంగాణ ఇంజినీర్లతో ఏం చర్చించకుండానే ఇలా నిర్ధారణకు రావడం ఓ సంస్థ చేయాల్సిన పనికాదన్నారు. కేంద్రంలోని పాలకపక్షానికి లబ్ధి చేకూర్చేలా నివేదిక ఇచ్చిందంటూ విమర్శించారు. మేడిగడ్డ బ్యారేజ్ రక్షణకు ఎన్డీఏఎస్ సలహా కోరామని, సలహాలు కోరినా ఎన్డీఎస్ఏ స్పందించలేదని స్పష్టం చేశారు. అన్ని జాగ్రత్తలు తీసుకున్నా నదిగర్భంలో జరిగే మార్పుల కారణంగా ఈ ఘటన జరిగి ఉంటుందని ఎన్డీఎస్ఏ నివేదికలో పేర్కొనడం గర్హనీయమన్నారు. గత ప్రభుత్వంపై, తెలంగాణ ఇంజినీర్లపై బురద జల్లే ప్రయత్నమే తప్ప.. బ్యారేజీ పునరుద్ధరణకు నిర్మాణాత్మక సూచనలు చేయడంలో ఎన్డీఎస్ఏ దారుణంగా విఫలమైందన్నారు.
వరదలు రాకముందే రక్షణ చర్యలు తీసుకోవాల్సిందని.. ఎన్డీఎస్ఏ నివేదిక కోసం ప్రభుత్వ సహయాన్ని వృథా చేసిందని విమర్శించారు. తుమ్మిడిహట్టి వద్ద కొత్తగా ప్రాజెక్టు కడుతామని ఉత్తమ్ చెబుతున్నారన్నారు. సంతోషమే.. అయినా మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించి ఏ ఎత్తున ప్రాజెక్టు కడతారో చెప్పాలని డిమాండ్ చేశారు. గతంలో తుమ్మిడిహట్టిపై మహారాష్ట్ర సీఎం లేఖ రాశారని.. 2013లో కాంగ్రెస్ సీఎం చవాన్ రాసిన లేఖను ఉత్తమ్ చదవాని సూచించారు. తుమ్ముడిహట్టి వద్ద బ్యారేజీ నిర్మాణానికి సాంకేతిక సమస్యలు ఉన్నాయన్నారు. తమ ప్రభుత్వం గతంలోనే 148 మీటర్ల ఎత్తు దగ్గర బ్యారేజి నిర్మించేందుకు అప్పటి మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించామని.. మహారాష్ట్ర సర్కారు చారిత్రాత్మక ఒప్పందంపై సంతకం చేసిందన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఒప్పందం ప్రకారం 148 మీటర్ల వరకు కడుతుందా? 152 మీటర్ల వరకు కడతారా? అన్నది ఉత్తమ్ స్పష్టం చేయాలన్నారు. 152 మీటర్ల వద్ద బ్యారేజీ కట్టాలంటే మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించాల్సిందేనని.. ఆ తర్వాతే బ్యారేజీ పనులను ప్రారంభించాలని కోరుతున్నానన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు హడావుడిగా ప్రారంభించామనడం వాళ్ల వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడమే తప్ప మరోటి కాదన్నారు. ప్రాజెక్టుపై ఉత్తమ్ అవగాహన లేకుండా మాట్లాడారని.. రూ.లక్షకోట్ల ప్రజాధనం వెచ్చి నిర్మించారంటూ ఉత్తమ్ పాతపాటే పడారన్నారు. ఐదేళ్లలో కాళేశ్వరంలో పంప్ అయిన నీళ్లు 65 టీఎంసీలు మాత్రమేనని చెప్పడం విచిత్రంగా ఉందన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

