KTR | పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకన్నా.. మూసీ ప్రాజెక్టుపైనే ఎందుకింత మక్కువ..? సీఎం రేవంత్‌ను ప్రశ్నించిన కేటీఆర్
KTR | పుట్టిన గడ్డపై మమకారం లేని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు కన్నా.. మూసీ ప్రాజెక్టుపైనే ఎందుకింత మక్కువ అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు ప్రశ్నించారు. మూసీని అందంగా ముస్తాబు చేసేందుకు.. మొన్న రూ.50వేలకోట్లు ఖర్చు అవుతుందన్నారని.. నిన్న.. రూ.70వేలకోట్లు వెచ్చిస్తామన్నారని.. నేడు.. రూ.1.50లక్షలకోట్లు వెచ్చిస్తామంటున్నారన్నారు.
KTR | పుట్టిన గడ్డపై మమకారం లేని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు కన్నా.. మూసీ ప్రాజెక్టుపైనే ఎందుకింత మక్కువ అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు ప్రశ్నించారు. మూసీని అందంగా ముస్తాబు చేసేందుకు.. మొన్న రూ.50వేలకోట్లు ఖర్చు అవుతుందన్నారని.. నిన్న.. రూ.70వేలకోట్లు వెచ్చిస్తామన్నారని.. నేడు.. రూ.1.50లక్షలకోట్లు వెచ్చిస్తామంటున్నారన్నారు. తెలంగాణ రైతుల తలరాతను మార్చిన కాళేశ్వరం ప్రాజెక్టుకు రూ.80వేల కోట్లయితేనే గల్లీ నుంచి ఢిల్లీదాకా గగ్గోలుపెట్టింది కాంగ్రెస్ మరి.. సుందరీకరణకే రూ.1.50లక్షల కోట్లు ఖర్చు చేస్తుందా? అంటూ విమర్శించారు. ఇంతకీ మూసీ ప్రాజెక్టుతో.. మురిసే రైతులెందురు.. నిల్వ ఉంచే టీఎంసీలెన్ని.. సాగులోకి వచ్చే ఎకరాలెన్ని.. పెరిగే పంటల దిగుబడి ఎంత.. తీర్చే పారిశ్రామిక అవసరాలెంత.. కొత్తగా నిర్మించే భారీ రిజర్వాయర్లెన్ని.. అంటూ నిలదీశారు.
చివరిదశలో ఉన్న ప్రాజెక్టును పక్కనపెట్టి.. కోల్డ్ స్టోరేజీలోకి నెట్టి మూసీ చుట్టే ఎందుకింత మంత్రాంగం అంటూ ధ్వజమెత్తారు. లండన్‌లోని థేమ్స్ లాగా మారుస్తామనే వ్యూహం వెనక థీమ్ ఏంటి ? గేమ్ ప్లాన్ ఏంటీ? ముఖ్యమంత్రి గారూ అంటూ ప్రశ్నించారు. మూడింతలు పెంచిన మూసీ అంచనా వ్యయం కాంగ్రెస్ ధనదాహానికి సజీవ సాక్ష్యమని.. మూసీ ప్రాజెక్టును చేపట్టాల్సిందేనని.. సాధ్యమైనంత త్వరగా పూర్తిచేయాల్సిందేనన్న కేటీఆర్.. మాటల దశలోనే ఉన్న ప్రాజెక్టులో మూటలు పంచుకునే పని షురూ చేస్తే సహించమని స్పష్టం చేశారు. తట్టెడు మన్ను తీయకముందే.. కోట్లు తన్నుకుపోయే కుట్రకు తెరతీస్తే భరించమని.. ‘మూసీ రివర్ ఫ్రంట్’ పేరుతో బ్యాక్ డోర్లో జరుగుతున్న బాగోతాన్ని తెలంగాణ సమాజం అనుక్షణం గమనిస్తోందని.. కుంభకోణాల కాంగ్రెస్‌కు కర్రుగాల్చి వాతపెడుతుందంటూ ‘ఎక్స్’లో ట్వీట్ చేశారు.
మూసీని అందంగా
ముస్తాబు చేసేందుకు..మొన్న..
50 వేల కోట్లు అయితదన్నరునిన్న..
70 వేల కోట్లు వెచ్చిస్తామన్నరునేడు..
లక్షా 50 వేల కోట్లు
ఖర్చు చేస్తామంటున్నరుతెలంగాణ రైతుల తలరాతను మార్చిన
కాళేశ్వరం ప్రాజెక్టుకు 80 వేల కోట్లయితేనే
గల్లీ నుంచి ఢిల్లీదాకా గగ్గోలుపెట్టింది… pic.twitter.com/DpiqFewWee— KTR (@KTRBRS) July 21, 2024
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

