Vivo Y18i | వివో నుంచి మరో బడ్జెట్ ఫోన్ వివో వై18ఐ ఫోన్ ఆవిష్కరణ.. ధరెంతో తెలుసా..?!
Vivo Y18i | ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ వివో (Vivo) తన బడ్జెట్ ఫ్రెండ్లీ ఫోన్ వివో వై18 ఐ (Vivo Y18i) ను భారత్ మార్కెట్లో ఆవిష్కరించింది.
Vivo Y18i | ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ వివో (Vivo) తన బడ్జెట్ ఫ్రెండ్లీ ఫోన్ వివో వై18 ఐ (Vivo Y18i) ను భారత్ మార్కెట్లో ఆవిష్కరించింది. రెండు కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉన్న వివో వై18ఐ ఫోన్ 6.56 అంగుళాల హెచ్డీ+ డిస్ ప్లే కలిగి ఉంటుంది. యూనిసోక్ టీ612 ప్రాసెసర్, 4జీబీ ర్యామ్ విత్ 64 జీబీ స్టోరేజీ వేరియంట్ గా వస్తోంది. 13-మెగా పిక్సెల్ మెయిన్ సెన్సర్ కెమెరాతోపాటు డ్యుయల్ రేర్ కెమెరా సెటప్ కలిగి ఉంటుంది. 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీతో వస్తోంది. వివో వై18ఐ ఫోన్ 4జీబీ ర్యామ్ విత్ 64 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.7,999లకు లభిస్తుంది. జెమ్ గ్రీన్, స్పేస్ బ్లాక్ కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది. ఆఫ్ లైన్ రిటైల్ స్టోర్లలో లభిస్తుంది.
వివో వై18ఐ ఫోన్ ఆండ్రాయిడ్ 14 బేస్డ్ ఫన్ టచ్ ఓఎస్ 14 వర్షన్ మీద పని చేస్తుంది. 90 హెర్ట్జ్ రీఫ్రెష్ రేటుతోపాటు 6.56 అంగుళాల హెచ్డీ+ (1612×720 పిక్సెల్స్) ఎల్సీడీ డిస్ ప్లే కలిగి ఉంటుంది. ఆన్ బోర్డు స్టోరేజీతో 8 జీబీ ర్యామ్ పెంచుకోవచ్చు. రేర్ ఫ్లాష్ యూనిట్ తో వివో వై18 ఐ ఫోన్ డ్యుయల్ రేర్ కెమెరా సెటప్ కలిగి ఉంటది. 13-మెగా పిక్సెల్ ప్రైమరీ సెన్సర్ కెమెరా, 0.08 మెగా పిక్సెల్ సెకండరీ సెన్సర్ కెమెరా, సెల్ఫీలూ వీడియో కాల్స్ కోసం 5-మెగా పిక్సెల్ సెన్సర్ కెమెరా ఉంటుంది. మైక్రో ఎస్డీ కార్డ్ సాయంతో ఆన్ బోర్డు స్టోరేజీ కెపాసిటీ 64 జీబీ వరకూ పెంచుకోవచ్చు.
వివో వై18ఐ ఫోన్ వై-ఫై, బ్లూటూత్ 5.1, జీపీఎస్, బైదూ, గ్లోనాస్, గెలీలియో, క్యూజడ్ఎస్ఎస్, ఓటీజీ, ఎఫ్ఎం రేడియో, యూఎస్బీ 2.0 పోర్ట్ కనెక్టివిటీ కలిగి ఉంటుంది. యాక్సెలరో మీటర్, అంబియెంట్ లైట్ సెన్సర్, ఈ-కంపాస్, ప్రాగ్జిమిటీ సెన్సర్ కలిగి ఉంటది. డస్ట్ అండ్ స్ప్లాష్ రెసిస్టెన్స్ కోసం ఐపీ54 రేట్ అందుకుంది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
JIO IPO | దుమ్మురేపిన జియో ఐపీవో.. ముగిసిన మెగా పబ్లిక్ ఇష్యూ.. 22.19 రెట్లు ఓవర్ సబ్‌స్ర్కైబ్
Flying Car India | ఇంజినీరు కాకున్నా ఎగిరే కారు తయారు చేశాడు.. ఉత్తరాఖండ్వాసి అద్భుతం!
YTPS | వైటీపీఎస్పైనే సర్కార్ ఆశలు.. రాష్ట్రంలో విద్యుత్తు కొరత నేపథ్యంలో ‘యాదాద్రి’పైనే ఫోకస్
CAG Report | 6 నెలల్లోనే 72.59% రుణాలు.. ‘కాగ్’ నివేదికతో రేవంత్ సర్కార్ వైఫల్యాలు బట్టబయలు
IAS Transfers | భారీగా ఐఏఎస్‌ల బదిలీలు.. దీపావళికి ముహూర్తం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

