Suryakumar Yadav : భారత జట్టు టీ20 కెప్టెన్ సూర్యకుయార్ యాదవ్ (Suryakumar Yadav) తొలిసారి ప్రెస్ మీట్లో మాట్లాడాడు. శ్రీలంక(Srilanka)తో పొట్టి సిరీస్‌కు ముందు సూర్య మీడియాతో పలు ఆసక్తికర విసయాలు వెల్లడించాడు. కెప్టెన్సీ మార్పు గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కేవలం ఇంజిన్ మారిందని, టీమిండియా రైలు మాత్రం దూసుకెళ్తూనే ఉంటుందని సూర్య తెలిపాడు.
‘నేను రోహిత్ శర్మ నుంచి చాలా నేర్చుకున్నా. అతడు గొప్ప నాయకుడు. ఇక కెప్టెన్సీ మార్పు అంటారా? కేవలం ఇంజిన్ మారిందంతే. భారత రైలు ఎక్కడా ఆగకుండా దూసుకెళ్తుంది అని సూర్య అన్నాడు. అంతేకాదు హెడ్‌కోచ్ గౌతం గంభీర్(Gautam Gambhir) గురించి కూడా సూర్య ఫన్నీ సంగతులు చెప్పాడు.

నాకు, గంభీర్‌కు మధ్య ఉన్న అనుబంధం చాలా స్పెషల్. ఐపీఎల్లో కోల్‌కతా నైట్ రైడర్స్(KKR)కు ఆడినప్పుడు సూర్య శక్తి సామర్థ్యాలను చక్కగా వాడుకోలేకపోయినందుకు బాధ పడుతున్నట్టు గౌతీ ఓసారి చెప్పాడు. అయితే.. ఇప్పుడు ఆయనకు టైమ్ వచ్చింది. నా సామర్థ్యాన్ని ఎన్ని రకాలుగా ఉపయోగించుకుంటాడో గంభీర్ ఇష్టం అని నవ్వుతూ అన్నాడు.
టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో అద్భుత క్యాచ్ పట్టిన సూర్య.. హార్దిక్ పాండ్యా స్థానంలో పొట్టి ఫార్మాట్ పగ్గాలు అందుకున్నాడు. కెప్టెన్‌గా సూర్యకు, హెడ్‌కోచ్‌గా గౌతం గంభీర్‌కు ఇదే తొలి సిరీస్. దాంతో ఇద్దరూ ట్రోఫీతో లంక నుంచి భారత్‌కు రావాలని ఆశిస్తున్నారు.
శ్రీలంక పర్యటనలో భారత జట్టు మూడు టీ20ల, మూడు వన్డేలు ఆడనుంది. పల్లెకెలె స్టేడియంలో జూలై 27న ఇరుజట్ల మధ్య తొలి టీ20 జరుగనుంది. ఆగస్టు 2వ తేదీన వన్డే సిరీస్ ఆరంభం కానుంది. ఆలోపు విరాట్ కోహ్లీ, కెప్టెన్ రోహిత్ శర్మలు జట్టుతో కలువనున్నారు.
Hey you fielding drill – How so fun 😄😎
Quite a vibe in the group in this fun session at Kandy 🤙#TeamIndia | #SLvIND pic.twitter.com/nIaBOnM8Wy
— BCCI (@BCCI) July 26, 2024