వివిధ ఖనిజాల సమ్మేళనం శిల. అనేక ఖనిజాల సమూహం వల్ల శిల ఏర్పడుతుంది. అదే విధంగా మూలకాల సమూహం వల్ల ఖనిజం ఏర్పడుతుంది. శిలలు విచ్ఛిన్నం కావడం వల్ల నేల ఏర్పడుతుంది.
శిలల గురించి అధ్యయనం చేసే శాస్త్రం పేరు -పెట్రాలజీ
శిలలు వాటి ఉద్భవ విధానం, భౌతిక ధర్మాల ఆధారంగా 3 రకాలుగా విభజించడమైంది.
1. అగ్ని శిలలు
2. అవక్షేప శిలలు
3. రూపాంతర శిలలు
Ignis అంటే లాటిన్ భాషలో అగ్ని అని అర్థం.
అగ్ని పర్వత ప్రక్రియ భూమిపై ప్రథమంగా ఏర్పడిన శిలలు కాబట్టి వీటిని ‘ప్రథమ శిలలు” అని కూడా అంటారు.
భూ అంతర్భాగంలోని శిలాద్రవం ఉపరితలానికి చేరి ఘనీభవించడం వల్ల ఏర్పడిన శిలలను అగ్నిశిలలు అంటారు.
అగ్ని శిలలో సిలికా 80% వరకు ఉంటే ఆమ్ల శిలలు అని అంటారు. ఉదా: గ్రానైట్ శిలలు.
అగ్ని శిలలో సిలికాపాళ్లు 40% లేదా 40% కన్నా తక్కువగా ఉంటే వాటిని మౌలిక శిలలు లేదా క్షార శిలలు అంటారు.
ఉద్గమ శిలలు : శిలాద్రవం భూ ఉపరితలానికి వచ్చి చల్లారి ఘనీభవించడం వల్ల ఏర్పడే శిలలు
అంతర్గమ శిలలు : శిలాద్రవం భూ ఉపరితలానికి కొంచెం దిగువ భాగంలోని రాతి పొరల మధ్య ఘనీభవించటం వల్ల ఏర్పడే శిలలు. ఉదా : గ్రానైట్, గాబ్రో
పాతాళ శిలలు : భూమిలోపల శిలాద్రవం నెమ్మదిగా చల్లారి ఘనీవించడం వల్ల ఏర్పడుతుంది. అందువల్ల పెద్ద పెద్ద స్ఫటికాలు ఉంటాయి.
ఇవి రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛోటానాగపూర్, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌ల్లో విస్తృతంగా ఉన్నాయి.
డైక్ శిలలు: శిలాద్రవం ఉపరితలానికి వస్తూ మార్గమధ్యలో స్తంభం మాదిరిగా నిటారుగా ఘనీభవించడం వల్ల ఏర్పడతాయి. ఈ శిలల్లో స్ఫటికాలు చిన్నవిగా ఉంటాయి.
అంతర్గమ అగ్నిశిలలో అత్యంత పెద్ద శిలా స్వరూపాలను బాతోలిక్లు అంటారు. బాతోలిక్ల్లో చిన్న వాటిని బాస్, స్టాక్, నెక్ అంటారు.
ప్రపంచంలోనే అతిపెద్ద బాతోలిక్ – అమెరికాలోని ఇడోహో
అంతర్భాగంలోని శిలాద్రవం ఉపరితలానికి చేరే మార్గంలో డోమ్ ఆకారంగా ఘనీభవించిన శిలలు
శిలాద్రవం రెండు సమాంతర పొరల మధ్య చొచ్చుకుని ఘనీభవించగా ఏర్పడిన శిలలను సిల్ అంటారు.
అవి ప్రథమ శిలల నుంచి ఏర్పడినందున అంతర శిలలు అని పిలుస్తారు. పొరల రూపంలో ఉన్నందున స్తరిత శిలలు అని పిలుస్తారు.
ఇవి తక్కువ కాఠిన్యం కలిగి స్ఫటికాలు లేకుండా పొరలు పొరలుగా ఉంటాయి. వీటిలో శిలాజాలు ఉంటాయి. వీటిపై కెరటాల గుర్తులు ఉంటాయి.
భూమిపై లభించే శిలల్లో 75% అవక్షేప శిలలే.
అగ్ని శిలలు లేదా అవక్షేప శిలలు అధిక ఉష్ణోగ్రత లేదా అధిక పీడన ప్రభావాలకు లోనైనపుడు అవి తమ సహజసిద్ధ ధర్మాలను కోల్పోయి నూతన ధర్మాలను పొందడం ద్వారా ఏర్పడే శిలలే రూపాంతర శిలలు. వీటిని పరివర్తన శిలలు అని కూడా అంటారు.
ఇవి చాలా కఠినంగా ఉంటాయి. వీటిలో అతుకులు, పగుళ్లు ఎక్కువ.
1. గ్రానైట్ సిస్
2. సున్నపురాయి మార్బుల్ (పాలరాయి)
3. ఇసుకరాయి క్వార్ట్
4. షేల్ పలకరాయి
5. బొగ్గు గ్రాఫైట్, వజ్రం
చలనరహితంగా ఉన్న పెద్ద పెద్ద పర్వతాలు, పీఠభూములు మొదలైన ఎత్తయిన భూభాగాలు కృశించి శిథిలం చేయబడి క్రమంగా విచ్ఛిన్నమైపోయే ప్రక్రియను వికోశీకరణం అంటారు.
వికోశీకరణంలో క్రమక్షయం, శిలా శైథిల్యం అనే రెండు ప్రక్రియలు ఇమిడి ఉన్నాయి.
భూగోళంపైన శిలలు, రకరకాల ప్రక్రియల ద్వారా శిథిలమై క్రమక్రమంగా క్షయం చెందడాన్ని క్రమక్షయం అంటారు.
నదులు, హిమానీనదాలు, పవనాలు మొదలైనవి వాటి క్రమక్షయం చేసే బాహ్య శక్తి ఏజెంట్లను క్రమక్షయం ఏజెంట్లు/క్రమక్షయం కారకాలు అంటారు.
1. నదులు భక్షణ, ఘర్షణ, రాపిడి, జలోత్పాదన చర్య
2. హిమానీ నదాలు ఉత్పతనం, గుంతలు చేయడం
3. పవనాలు ఎగురవేత, అపఘర్షణ, రాపిడి
4. అంతర్భూజలం ఘర్షణ, ద్రావణీకరణం
నదీ క్రమక్షయం వల్ల ఏర్పడే నిట్టనిలువు గోడలు కలిగిన ఇరుకైన లోయలను గార్జ్‌లు అంటారు.
ఉదా: గోదావరి నదికి ఆదిలాబాద్ జిల్లా పాపికొండల్లో బైసన్గార్జ్ కలదు
శుష్క ప్రాంతాల్లో నదులు జరిపే అధోముఖ కోత వల్ల ఏర్పడే V ఆకారపు లోయలను అగాధ దరులు అంటారు. ఇవి గార్జ్‌ల కంటే ఎక్కువ లోతు కలిగిన అగాధ లోయలు
ఉదా: 1. అమెరికాలోని కొలరాడో నదికి గల ‘గ్రాండ్ కాన్యన్’ ప్రపంచంలోనే పెద్దది. దీని లోతు 2కి.మీ. పొడవు 320 కి.మీ
2. పెన్నా నదికి కడప జిల్లాలో గండికోట వద్ద ఒక అగాధ దరి ఉంది.
నదీజలాలు తమ ప్రవాహ దిశలో అకస్మాత్తుగా పతనం చెందినట్లయితే వాటిని జలపాతాలు అంటారు.
ప్రపంచంలో అత్యంత ఎత్తయిన జలపాతం – ఏంజెల్స్ (వెనిజులా)
ప్రపంచంలో అతిపెద్ద జలపాతం నయాగరా (ఇది కెనడా, అమెరికా సరిహద్దులో ఉంది)
కుకెనాన్ వెనిజులా
విక్టోరియా జాంబియా
భారతదేశంలోకెల్లా ఎత్తయిన జలపాతం – జెర్సప్పా లేదా జోగ్ జలపాతం. కర్ణాటకలోని శరావతి నదిపై ఉంది.
శివ సముద్ర జలపాతం – కావేరి నదిపై (కర్ణాటక)
కపిల్ధారా జలపాతం – నర్మదా నదిపై (మధ్యప్రదేశ్)
యన్నా జలపాతం – మహాబలేశ్వర్ నదిపై (మహారాష్ట్ర)
డుడుమా జలపాతం – మాచ్‌ఖండ్ నదిపై ఉంది
దూద్‌సాగర్ జలపాతం – గోవా
తెలంగాణ రాష్ట్రంలో ఎత్తయిన జలపాతం – కుంతాల జలపాతం. ఆదిలాబాద్ జిల్లాలో కడెం నదిపై ఉంది.
జలపాతంలో పై నుంచి నీరు దుమికిన చోటు క్రమక్రమంగా కోతకు గురవుతుంది. అక్కడ మడుగులుగా తయారవుతుంది. దీన్నే దుముకుడు మడుగు అంటారు.
8 నదీ ప్రారంభ దశలో కొన్నిచోట్ల శిలలు అధికంగా ఉన్నప్పుడు నదీ జలాలు దూకుతూ ప్రవహిస్తాయి. వీటినే రాపిడ్స్ లేదా ఎత్తిపోతలు అంటారు.
8 భూపటలంలో భూ ఉపరితలం నుంచి కిందకు 60 కి.మీ మందం కలిగిన పొర ఉన్న పదార్థంలో దాదాపు 99% మూలకాలు ఉంటాయి.
భూమి ఉపరితలం నుంచి 900 మీటర్ల కంటే ఎత్తయిన భూ స్వరూపాన్ని పర్వతం అని పిలుస్తారు. భూ స్వరూపాలన్నింటిలోకి పర్వతాలు మానవునికి అత్యంత ప్రధానమైనవి. పర్వతాలు ప్రపంచంలో 1/5 వ వంతు భూభాగాన్ని ఆక్రమిస్తున్నాయి. ప్రపంచ పర్వతాలు ఏర్పడ్డ విధానాన్ని అనుసరించి పర్వతాలు ప్రధానంగా 6 రకాలు అవి :
1.అగ్నిపర్వతాలు 2. కలశ పర్వతాలు
3. ముడుత పర్వతాలు 4. ఖండ పర్వతాలు
5. పీఠభూమి పర్వతాలు 6. అవశిష్ట పర్వతాలు
భూమి ఉపరితలం నుంచి 600 మీటర్ల కంటే తక్కువ ఎత్తు ఉండి అన్ని వైపులా ఏటవాలు అంచులు ఉన్న భూ స్వరూపాన్ని పీఠభూమి అంటారు.
పర్వతాల మధ్య ఉన్న పీఠభూమిని పర్వతాంతర పీఠభూమి అంటారు. ఉదా : టిబెట్
పీఠభూమి, ఆల్టిప్లానో పీఠభూమి, (పెరూ-బొలీవియాల మధ్య)
పర్వతాల పాద భాగంలో ఏర్పడిన పీఠభూములను గిరిపాద పీఠభూములు అంటారు. ఉదా : అపలేచియన్ పీఠభూమి (ఉత్తర అమెరికా), పెటగోనియా పీఠభూమి (దక్షిణ అమెరికా)
అగ్ని పర్వతం విస్ఫోటనం చెందినప్పుడు లావాలోని క్షార లావా వల్ల ఏర్పడే పీఠభూములు ఉదా: కొలంబియా పీఠభూమి (ఉత్తర అమెరికా), డెక్కన్ పీఠభూమి (భారత్), ‘సెర్రాజెరాల్’ పీఠభూమి (బ్రెజిల్ అట్లాంటిక్ మహాసముద్ర తీర ప్రాంతం)
సముద్ర మట్టం కంటే సుమారు 160 మీటర్లు ఉండే సువిశాల, సమతల పల్లపు ప్రాంతాలను మైదానాలు అంటారు. ఉదా : అమెరికా సంయుక్త రాష్ర్టాల్లో నయాగరా మైదానం
ప్రపంచంలో ఎడారులన్నీ ఖండాల పశ్చిమ భాగంలోనే ఏర్పడ్డాయి.
1. సహారా ఎడారి : ప్రపంచంలో అతిపెద్ద ఉష్ణమండల ఇసుక ఎడారి. ఆఫ్రికా ఖండంలో ఉత్తర ఆఫ్రికాలో ఉంది
2. కలహారి ఎడారి : ఇది ఆఫ్రికా ఖండంలోని దక్షిణ భాగంలో ఉంది. వజ్రాలు, బంగారు గనులకు ప్రసిద్ధి
3. లిబియా ఎడారి : ఆఫ్రికా ఖండంలో ఉత్తరాన ఉంది. ప్రపంచంలోనే అత్యధిక ఉష్ణోగ్రత నమోదైన ప్రాంతం.
1. అరేబియా ఎడారి : ప్రపంచంలో మూడో అతిపెద్ద ఎడారి. ఆసియా ఖండంలో పశ్చిమ భాగంలో ఉంది.
2. గోబి ఎడారి : ప్రపంచంలో అతిపెద్ద శీతల ఎడారి. ఆసియా ఖండంలో పెద్ద ఎడారి. చైనా, మంగోలియాల్లో విస్తరించి ఉంది.
3. థార్ ఎడారి : దక్షిణాసియాలోని భారత్ -పాక్‌ల మధ్య విస్తరించింది. భారత్‌లో పెద్ద ఎడారి.
4. ఇరానియన్ ఎడారి : మధ్య ఆసియా ప్రాంతం
1. అటకామా ఎడారి : చిలీ, పెరూల్లో విస్తరించి ఉన్న అత్యంత పొడి వాతావరణం గల శీతల ఎడారి. నైట్రేట్లకు ప్రసిద్ధి.
2. పెటగోనియా ఎడారి : అర్జెంటీనాలో విస్తరించింది. గొర్రెల పెంపకానికి ప్రసిద్ధి.
1. సోన్రాన్ ఎడారి : కాలిఫోర్నియా, మెక్సికో, అరిజోనాల్లో విస్తరించి ప్రపంచంలో అతి శుష్క ప్రాంతమైన ‘డెత్ వ్యాలీ’ (మృతలోయ) ఇక్కడ ఉంది.
2. కొలరాడో ఎడారి : మెక్సికో, అరిజోనాల్లో విస్తరించిన శీతల ఎడారి
1. ఆస్ట్రేలియా ఎడారి : ప్రపంచంలో రెండో అతిపెద్ద ఎడారి. ఆస్ట్రేలియాకు పశ్చిమంగా ఉంది
2. ఐరోపా : ఎడారులు లేని ఖండం
