Poco F6 Deadpool | పోకో నుంచి ప్రీమియం ఫోన్ ఎఫ్6 డెడ్ పూల్ లిమిటెడ్ ఎడిషన్.. ఇవీ స్పెషిఫికేషన్స్..!
Poco F6 Deadpool | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ పోకో తన పోకో ఎఫ్6 డెడ్ పూల్ ఫోన్‌ను భారత్ మార్కెట్లో శుక్రవారం ఆవిష్కరించింది. లిమిటెడ్ ఎడిషన్‌గా ఈ స్మార్ట్ ఫోన్లు మార్కెట్లోకి విడుదల చేస్తోంది.
Poco F6 Deadpool | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ పోకో తన పోకో ఎఫ్6 డెడ్ పూల్ ఫోన్‌ను భారత్ మార్కెట్లో శుక్రవారం ఆవిష్కరించింది. లిమిటెడ్ ఎడిషన్‌గా ఈ స్మార్ట్ ఫోన్లు మార్కెట్లోకి విడుదల చేస్తోంది. డెడ్ పూల్, మార్వెల్ సూపర్ హీరో స్ఫూర్తితో డిజైన్ చేసిన ఈ ఫోన్ ఐకానిక్ రెడ్, బ్లాక్ కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది. కెమెరా ఐలాండ్ మీద డెడ్ పూల్ లోగో ఉంటుంది. పోకో ఎఫ్6 డెడ్ పూల్ లిమిటెడ్ ఎడిషన్ ఆవిష్కరణ కోసం మార్వెల్ స్టూడియోస్ సహకారాన్ని తీసుకున్నది పోకో. క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 8ఎస్ జెన్ 3 ఎస్వోసీ ప్రాసెసర్, 50-మెగా పిక్సెల్ డ్యుయల్ రేర్ కెమెరాలతో వస్తోందీ ఫోన్.
పోకో ఎఫ్6 డెడ్ పూల్ లిమిటెడ్ ఎడిషన్ 12 జీబీ ర్యామ్ విత్ 256 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.33,999లకు లభిస్తుంది. సెలెక్టివ్ బ్యాంకు కార్డులపై కొనుగోలు చేస్తే రూ.4000 ఇన్ స్టంట్ బ్యాంక్ ఆఫర్ తో రూ.29,999లకే ఫోన్ సొంతం చేసుకోవచ్చు. ఆగస్టు ఏడో తేదీ నుంచి ఫ్లిప్ కార్ట్ ద్వారా సేల్స్ ప్రారంభం అవుతాయి. దీంతో గత మేలో ఆవిష్కరించిన పోకో ఎఫ్6 ఫోన్ 8జీబీ ర్యామ్ విత్ 256 జీబీ స్టోరేజీ వేరియంట్ ను రూ.29,999లకే అందుబాటులోకి తెస్తోంది. 12 జీబీ ర్యామ్ విత్ 256 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.31,999, 12 జీబీ ర్యామ్ విత్ 512 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.33,999లకు లభిస్తాయి.
పోకో ఎఫ్6 డెడ్ పూల్ లిమిటెడ్ ఎడిషన్ ఫోన్ డెడ్ పూల్ ట్రేడ్ మార్క్ రెడ్ అండ్ బ్లాక్ కలర్స్ లో అందుబాటులో ఉంటుంది. రేర్ ప్యానెల్ అంతా పలు డెడ్ పూల్, వోల్వరైన్ కలర్స్ ఉంటాయి. ఆండ్రాయిడ్ 14 బేస్డ్ హైపర్ ఓఎస్ వర్షన్ మీద పని చేస్తుందీ ఫోన్. 6.67 అంగుళాల 1.5 కే (1220×2712 పిక్సెల్స్) రిజొల్యూషన్ అమోలెడ్ డిస్ ప్లే విత్ 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్ కలిగి ఉంటుంది.
పోకో ఎఫ్6 డెడ్ పూల్ లిమిటెడ్ ఎడిషన్ ఫోన్ డ్యుయల్ రేర్ కెమెరా సెటప్ కలిగి ఉంటుంది. 50-మెగా పిక్సెల్ సెన్సర్ మెయిన్ కెమెరా, 8-మెగా పిక్సెల్ ఆల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, సెల్ఫీలూ వీడియో కాల్స్ కోసం 20- మెగా పిక్సెల్ సెన్సర్ కెమెరా కలిగి ఉంటుంది. 90వాట్ల ఫాస్ట్ చార్జింగ్ మద్దతుతో 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీతో వస్తుంది. ఫోన్ తోపాటు 120 వాట్ల అడాప్టర్ కూడా అందిస్తోంది పోకో.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

