ముప్పైల్లోనే ఆగమాగం
వయసులో ఉన్నవాళ్లు పోట్లగిత్తలా పోటుమీద ఉంటారని ఇప్పటి దాకా అందరి భావన! కానీ, వయసు పైబడిన వృద్ధ భారతీయులతో పోలిస్తే.. యంగిస్థాన్‌లు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నట్టు ఓ నివేదికలో వెల్లడైంది. భారతీయ వెల్నెస్ సంస్థ యువర్‌దోస్త్ తాజా సర్వేలో ఇరవై నుంచి ముప్పయ్ ఏండ్ల మధ్యనున్న వాళ్లు ఎక్కువ ఒత్తిడికి లోనవుతున్నట్టు తేలింది.
వయసులో ఉన్నవాళ్లు పోట్లగిత్తలా పోటుమీద ఉంటారని ఇప్పటి దాకా అందరి భావన! కానీ, వయసు పైబడిన వృద్ధ భారతీయులతో పోలిస్తే.. యంగిస్థాన్‌లు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నట్టు ఓ నివేదికలో వెల్లడైంది. భారతీయ వెల్నెస్ సంస్థ యువర్‌దోస్త్ తాజా సర్వేలో ఇరవై నుంచి ముప్పయ్ ఏండ్ల మధ్యనున్న వాళ్లు ఎక్కువ ఒత్తిడికి లోనవుతున్నట్టు తేలింది. అదే సమయంలో నలభై ఏండ్లు పైబడిన వాళ్లు కాస్త కులాసాగా ఉంటున్నారనీ నివేదిక పేర్కొన్నది. 5,000 మంది భారతీయ ఉద్యోగులపై జరిపిన సర్వే ఆధారంగా కొన్ని విషయాలను తేటతెల్లం చేసింది. యువర్‌దోస్త్ నివేదిక ప్రకారం వర్క్‌ఫ్రమ్ హోమ్, పనివేళలు, భవిష్యత్తుపై బెంగ కారణంగా 21 నుంచి 30 ఏండ్ల మధ్య వయసు ఉన్నవాళ్లు ఎక్కువగా ఆందోళన చెందుతున్నారట. అదే సమయంలో 31 నుంచి 40 ఏండ్ల మధ్య ఉన్నవాళ్లూ స్ట్రెస్గానే ఉంటున్నారట. నలభై దాటిన వాళ్లు కాస్త రిలాక్స్డ్గా ఉండటానికి కారణం.. ఆ వయసుకు జీవితంపై స్పష్టమైన అవగాహన రావడమే అంటున్నారు సర్వేకారులు. అధిక ఒత్తిడికి గురవుతున్నవారిలో పురుషుల కన్నా స్త్రీలు ఎక్కువ శాతం ఉంటున్నారు. సర్వేలో పాల్గొన్న వారిలో 72 శాతం మంది మహిళలు తాము మానసిక ఆందోళన చెందుతున్నామని పేర్కొన్నారు. పని, కుటుంబ జీవితం ఈ రెండిటి మధ్య సమతుల్యత కోల్పోవడం వల్లే ఈ తరం తీవ్ర ఒత్తిడికి గురవుతున్నదని నిపుణులు చెబుతున్నారు. వారి జీవితంలో సమస్యలను గుర్తించడంలోనూ విఫలమవుతున్నారని అంటున్నారు. అదే సమయంలో లేని సమస్యను ఊహించుకొని తగిన పరిష్కారం కోసం వెతుకుతున్నారని విశ్లేషిస్తున్నారు. ఫలితంగా వ్యక్తిగత జీవితంలో సంతృప్తిని కోల్పోతున్నారని చెబుతున్నారు.
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

