లాభాల విరిబాల
‘నాకు నచ్చిందే చేస్తాను’ అంటుంటారు చాలామంది. కానీ, పరిస్థితులకు తలొగ్గి వచ్చిన ఉద్యోగంలో కుదురుకుంటారు. అమెరికాకు చెందిన వియన్నా హింట్జ్ కూడా అలాగే అనుకుంది. కానీ, పరిస్థితులు ఆమెను ఉద్యోగినిగా మార్చేశాయి.
‘నాకు నచ్చిందే చేస్తాను’ అంటుంటారు చాలామంది. కానీ, పరిస్థితులకు తలొగ్గి వచ్చిన ఉద్యోగంలో కుదురుకుంటారు. అమెరికాకు చెందిన వియన్నా హింట్జ్ కూడా అలాగే అనుకుంది. కానీ, పరిస్థితులు ఆమెను ఉద్యోగినిగా మార్చేశాయి. మనసు చంపుకొని కొన్నాళ్లు విధులు నిర్వర్తించింది. కానీ, ఏదో వెలితి. అసంతృప్తితో రోజులు భారంగా గడవసాగాయి. ఇక లాభం లేదనుకొని ఓ మానసిక వైద్యుణ్ని కలిసింది. హింట్జ్ కథంతా విని ‘ఉద్యోగం మానేసి.. నీకు నచ్చిన వ్యాపారం చేస్తే గానీ, నీ మానసిక స్థితి బాగుపడదు’ అని హెచ్చరించాడు. మార్కెటింగ్ అండ్ అడ్వర్టయిజ్మెంట్ రంగంలో చేస్తున్న ఉద్యోగానికి తక్షణం రాజీనామా చేసింది హింట్జ్.
చిన్నప్పటి నుంచి ఆమెకు పూలంటే వల్లమాలిన ప్రేమ. విరిబాలలను చూడగానే ఆమె ముఖం వికసించేది. తనకు కావాల్సిన ఆనందం పూదోటలో ఉందని నిశ్చయానికి వచ్చింది. పూల వ్యాపారం మొదలుపెట్టింది. పూలున్న చోటే ముళ్లూ ఉంటాయి కదా! కోటి ఆశలతో కుసుమాలు తాకగానే.. ఆమెకు ముళ్లు గుచ్చుకున్నాయి. మొదటి ఆరు నెలలు వరుసగా నష్టాలే ఎదురయ్యాయి. అయినా ఆమె పట్టుదల ఆవిరి కాలేదు. కొమ్మకు పూసిన పూలన్నీ.. పూజకు అంకితం కాలేవుగా! అలాగే ఆమె వ్యాపారం కూడా మొదట్లో ఒడుదొడుకులకు గురైంది.
ఇష్టమున్న చోట కష్టాలు ఎంతకాలం ఉంటాయి? హింట్జ్ విషయంలోనూ అదే జరిగింది. మరింత ధైర్యంగా ముందడుగు వేసింది. పూల పరిమళాలు ఒకే చోట ఉంటే లాభం లేదనుకుంది. ఓల్డ్ ట్రక్ ఒకటి కొనుగోలు చేసింది. దానికి ‘మెయిన్ స్ట్రీట్’ అని పేరుపెట్టింది. బండి నిండా విరులు నింపింది. నచ్చిన దోవలకు ఆ పూలతావిని మోసుకెళ్లింది. సీజనల్ పూలు గంపలు గంపలు తీసుకెళ్లింది. రెండు నెలలు గడిచాయి.. హింట్జ్ పూల రథం ఎప్పుడొస్తుందా అని అందరూ ఎదురుచూసే పరిస్థితి వచ్చింది.
ఎగబడి ఆమె దగ్గర పూలు కొనుగోలు చేయడం మొదలైంది. వాడిన తరులు వికసించినట్టు… హింట్జ్ వ్యాపారానికి వసంతం వచ్చింది. ఇబ్బడిముబ్బడిగా అమ్మకాలు కొనసాగాయి. నెల తిరిగేసరికి గల్లాపెట్టెలో పదమూడు లక్షల రూపాయల లెక్క తేలింది. మూడు నెలల్లో ఏకంగా అరకోటి దాకా ఆర్జించింది. మొత్తానికి మనసు చంపుకొని చేసిన కార్పొరేట్ ఉద్యోగానికి చరమగీతం పాడటమే.. తన విజయానికి శంఖారావం అంటున్నదామె. ఉద్యోగార్జితం కన్నా రెండింతలు సంపాదిస్తూ యంగ్ ఆంత్రప్రెన్యూర్లకు ఆదర్శంగా నిలిచింది వియన్నా హింట్జ్. తెలిసిన వాళ్లంతా ఆమెను లాభాల విరి‘బాల’ అని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
TV Anchor: పాకిస్థాన్‌లో టీవీ యాంకర్ కాల్చివేత.. భర్త అరెస్టు
Bodybuilder Venkatesan: హైదరాబాదీ బాడీబిల్డర్ వెంకటేశన్‌కు మిస్టర్ నేచురల్ వరల్డ్ టైటిల్
Ranabaali | నెట్‌ఫ్లిక్స్‌లోకి విజయ్ దేవరకొండ, రష్మిక ‘రణబాలి’.. ఐదు భాషల్లో ఓటీటీ స్ట్రీమింగ్, రిలీజ్ డేట్ ఫిక్స్!
CM Chandrababu | రూ.500 నోట్లను రద్దు చేయాలని మరోసారి ప్రధానికి విజ్ఞప్తి చేస్తా : ఏపీ సీఎం చంద్రబాబు
Crossfit | క్రాస్‌ఫిట్ వ్యాయామం అంటే ఏమిటి.. ఎందుకంత క్రేజ్ పెరుగుతోంది..?
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

