Asus | అసుస్ ఆల్ ఇన్ వన్ డెస్క్ టాప్.. రూ.60,990లకే లభ్యం..!
Asus | ప్రముఖ టెక్నాలజీ సంస్థ అసుస్ (Asus).. భారత్ మార్కెట్లో ఆల్-ఇన్- వన్ డెస్క్ టాప్ కంప్యూటర్ ఆవిష్కరించింది.
Asus | ప్రముఖ టెక్నాలజీ సంస్థ అసుస్ (Asus).. భారత్ మార్కెట్లో ఆల్-ఇన్- వన్ డెస్క్ టాప్ కంప్యూటర్ ఆవిష్కరించింది. అసుస్ ఏఐఓ ఎం3702 పేరుతో వస్తున్న ఆల్-ఇన్-వన్ డెస్క్ టాప్ కంప్యూటర్ సీమ్ లెస్ యూజర్ ఎక్స్ పీరియన్స్, పవర్ ఫుల్ పెర్ఫార్మెన్స్ అందిస్తుంది. 27-అంగుళాల ఫుల్ హెచ్డీ ఐపీఎస్ యాంటీ గ్లేర్ డిస్ ప్లే కలిగి ఉంటుంది. 75 హెర్టజ్ రీఫ్రెష్ రేటుతో స్టన్నింగ్ విజువల్స్ డెలివరీ చేస్తుంది. 250 నిట్స్ పీక్ బ్రైట్ నెస్ కలిగి ఉంటుంది. వందశాతం ఎస్ఆర్జీబీ కలర్ ఆక్యురసీతో వస్తుంది. వర్క్ అండ్ ఎంటర్టైన్ మెంట్‌కూ పర్ఫెక్ట్గా ఉపయోగించుకోవచ్చు.
అసుస్ ఏఐఓ ఎం3702 డెస్క్ టాప్ కంప్యూటర్.. ఏఎండీ ర్యేజెన్ 5 752ఓయూ మొబైల్ ప్రాసెసర్ కలిగి ఉంటుంది. 4-కోర్ 8-థ్రెడ్ ప్రాసెసర్ ఉంటుంది. ఎఎండీ రేడియాన్ గ్రాఫిక్స్ తో వస్తున్న ఈ కంప్యూటర్ క్యూజువల్ గేమింగ్ కోసం వీడియో ప్లే బ్యాక్ నుంచి ప్రతిదీ స్మూత్ విజువల్ అందిస్తుంది. 16 జీబీ ర్యామ్ తో వస్తున్న అసుస్ ఏఓఐ ఎం3702 డెస్క్ టాప్ కంప్యూటర్ మల్టీ టాస్కింగ్ కోసం పని చేస్తుంది. అదనంగా 512 జీబీ స్టోరేజీ కెపాసిటీ ఉంటుంది.
ఫాస్ట్, రిలయబుల్ వైర్ లెస్ కనెక్షన్లకు వై-ఫై 6ఈ, బ్లూటూత్ 5.3 కనెక్టివిటీ కలిగి ఉంటుంది. కెసింగ్టన్ లాక్, 3.5 ఎంఎం కాంబో ఆడియో జాక్, యూఎస్బీ 2.0 టైప్ ఏ పోర్ట్, 2 ఇన్ 1 కార్డ్ రీడర్ (ఎస్డీ/ఎంఎంసీ) ఉంటాయి. డీసీ ఇన్ పర్ట్, ఆర్జే 45 గిగాబైట్ ఈథర్ నెట్, హెచ్డీఎంఐ ఇన్ అండ్ ఔట్ పోర్ట్స్, మరో యూఎస్బీ 2.0 టైప్ -ఏ పోర్ట్, యూఎస్బీ 3.2 జెన్ 1 టైప్ సీ పోర్ట్, మూడు యూఎస్బీ 3.2 1 టైప్ – ఏ పోర్ట్స్, సెకండ్ 2- ఇన్ 1 కార్డ్ రీడర్ తదితర ఫీచర్లు ఉంటాయి.
యూజర్ ప్రైవసీని దృష్టిలో పెట్టుకుని రూపొందించిన అసుస్ ఏఐఓ ఎం3702 డెస్క్ టాప్ కంప్యూటర్ లో 1080పీ ఫుల్ హెచ్డీ వెబ్ కామ్ ఉంటుంది. ఆడియో క్వాలిటీ కోసం మైక్రో ఫోన్, స్టీరియో స్పీకర్లు కూడా ఇస్తారు. ఈపీఈఏటీ సిల్వర్ రేటింగ్ తో ఎకో ఫ్రెండ్లీగా వస్తున్న అసుస్ ఏఐఓ ఎం3702 డెస్క్ టాప్ కంప్యూటర్ ధర రూ.60,990 పలుకుతుంది. అసుస్ ఈ-షాప్, అసుస్ ఎక్స్ క్లూజివ్ స్టోర్స్, అమెజాన్, ఫ్లిప్ కార్ట్ వంటి ఈ కామర్స్ ప్లాట్ ఫామ్స్ లో లభిస్తుంది. ఈ డెస్క్ టాప్ కంప్యూటర్ ఇంట్లోనూ, ఆఫీసులోనూ వాడుకునేందుకు అద్భుతమైన చాయిస్ గా ఉంటుంది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fire Accident | నోయిడాలో భారీ అగ్నిప్రమాదం.. ఒకరు మృతి.. పలు దుకాణాలు అగ్నికి ఆహుతి..!
Men Check Into Hotel With Girls | ఇద్దరు బాలికలతో కలిసి హోటల్లో బస చేసిన ఇద్దరు వ్యక్తులు.. తర్వాత ఏం జరిగిందంటే?
MLA Sudheer Reddy | బటన్ ఒత్తితే నీళ్లొస్తయని చెప్పినం.. హైదరాబాద్‌కు ఏడాదికి 10 టీఎంసీల నీళ్లు సరిపోతయి : ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి
Kriti Sanon | మన బట్టలు, మన ఇష్టం.. కామెంట్ చేసే హక్కు వాళ్లకు ఎవరిచ్చారు?: కృతి సనన్ ఫైర్!
IND vs NZ | తిలక్ వర్మ హాఫ్ సెంచరీ.. ఉత్కంఠ పోరులో గెలిచిన టీమిండియా
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

