హైదరాబాద్, జూలై 26 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర బడ్జెట్లో తెలంగాణ రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్ఆర్టీసీ) ఉద్యోగులు పెట్టుకున్న ఆశలు నీరుగారాయి. వేలాది మం ది ఆర్టీసీ కార్మికులు ఎదురుచూస్తున్న అపా యింటెడ్ తేదీ, కొత్త బస్సుల కొనుగోలు వం టి కీలక అంశాలపై ఎలాంటి ప్రస్తావన లేక పోవడంతో వారు నిరుత్సాహానికి గురవుతు న్నారు. మొత్తం బడ్జెట్లో మూడు శాతం ని ధులు కేటాయించాలన్న కార్మిక సంఘాల డి మాండ్ను ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకో లేదని కార్మిక వర్గాలు అభిప్రాయపడుతున్నా యి.
మహాలక్ష్మి స్కీం ద్వారా మహిళలకు ఉచి త బస్సు సౌకర్యానికి మాత్రమే రీయింబర్స్ మెంట్ కింద నిధులను కేటాయించింది. 2023 డిసెంబర్ నుంచి ఈ ఏడాది మార్చి 31 వరకు నాలుగు నెలల సొమ్ము 2023-24 ఆర్థిక సంవత్సర బడ్జెట్ కేటాయింపుల్లో చేరింది. 2024 ఏప్రిల్ 1 నుంచి మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణ లెక్కలు కూడా ప్రస్తు త ఆర్థిక సంవత్సరంలోకే వస్తాయి. అంటే ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి 2025 మార్చి 31 వరకు అమల్లో ఉండే మహాలక్ష్మికి రాష్ట్ర ప్రభు త్వం కేటాయించింది కేవలం రూ.3,082 కోట్లు మాత్రమే.
ఆర్టీసీ విస్తరణ, కొత్త బస్సుల కొనుగోళ్లకు ప్రత్యేకంగా ఎలాంటి నిధులు ఇ వ్వలేదు. వివిధ రకాల బకాయిలకూ ఎలాం టి కేటాయింపులు లేవు. వేతన సవరణ ఊసే లేదు. ఆర్టీసీకి ప్రభుత్వ గ్యారెంటీ లేని రుణాల ఔట్స్టాండింగ్ 2024 మార్చి 31 నాటికి రూ.1,131.55 కోట్లు ఉన్నట్టు బడ్జెట్ లెక్కల్లో పేర్కొన్నారు. వీటిని ఆర్టీసీయే చెల్లించాల్సి ఉంటుంది.