హైదరాబాద్, మార్చి 9 (నమస్తే తెలంగాణ): రామగుండం ఎన్టీపీసీ రెండో దశ ప్రాజెక్టును వేగవంతం చేయాలని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి కోరారు. ఈ మేరకు సీఎం రేవంత్‌రెడ్డికి ఆయన సోమవారం లేఖ రాశారు. మొదటి ఫేజ్‌ను గతంలో పూర్తి చేయగా, రెండో ఫేజ్‌లో భాగంగా 2,400 మెగావాట్ల సామర్థ్యంతో మిగిలిన మూడు పవర్ ప్రాజెక్టులను పూర్తి చేయడానికి ఎన్టీపీసీ చర్యలు చేపట్టినట్టు వివరించా రు. మొదటి ఫేజ్‌లో మాదిరిగానే రెండో ఫేజ్‌లో ఉత్పత్తి చేసే విద్యుత్తులో 85 శాతాన్ని తెలంగాణ రాష్ర్టానికి సరఫరా చేయనున్నట్టు తెలిపారు. ఈ క్రమంలో అత్యంత ఆధునికమైన ‘అల్ట్రా సూపర్ క్రిటికల్’ సాంకేతికతతో తక్కువ ఖర్చుకే విద్యుత్తు ఉత్పత్తి చేస్తున్న ఎన్టీపీసీ అనుభవాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం స్పందించాలని కోరారు.