తుంగతుర్తి, ఆగస్టు 11 : తుంగతుర్తి మండలంలోని వెంపటి గ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు మాజీ ఉప సర్పంచ్ భాషబోయిన వెంకన్న తన తల్లిదండ్రుల జ్ఞాపకార్థం మంగళవారం డ్రమ్స్ అందించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు భీవనపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ పాఠశాల అభివృద్ధికి దాతృత్వంతో సహకరించడం అభినందనీయమని అన్నారు. తాను చదువుకున్న పాఠశాలపై మమకారంతో సహకారం అందించిన వెంకన్నను గ్రామస్థులు అభినందించారు. ఈ కార్యక్రమంలో రాజయ్య, సత్తయ్య, ఉపాధ్యాయుడు మల్లెపాక రవీందర్ పాల్గొన్నారు.