Tirumala | తిరుమలలో స్వామివారి దర్శనానికి 8 గంటల సమయం
Tirumala | తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. స్వామివారిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి వస్తున్న భక్తులతో 10 కంపార్టుమెంట్లు నిండిపోయాయి..
తిరుమల : తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. స్వామివారిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి వస్తున్న భక్తులతో 10 కంపార్టుమెంట్లు నిండిపోయాయి. టోకెన్లు లేని భక్తులకు 8 గంటల్లో సర్వదర్శనం కలుగుతుందని టీటీడీ అధికారులు పేర్కొన్నారు. నిన్న స్వామివారిని 73,332 మంది భక్తులు దర్శించుకోగా 25,202 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీకి రూ. 3.73 కోట్లు ఆదాయం వస్తుందని వివరించారు.
టీటీడీ నియమ నిబంధనల మేరకే వాటర్ బాటిళ్లు విక్రయించాలి
తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు టీటీడీ నిర్దేశించిన రేట్లకే వాటర్ బాటిళ్లు విక్రయించాలని జేఈవో గౌతమి ఆదేశించారు. తిరుమలలోని ఆరోగ్యశాఖ కార్యాలయంలో దుకాణదారులతో సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ తిరుమలలోని దుకాణదారులు టీటీడీ నిర్దేశించిన రేట్ల కంటే అధిక రేట్లకు వాటర్ బాటిళ్లు అమ్ముతున్నారని, ఖాళీ గాజు బాటిళ్లు తీసుకోవడం లేదని పలువురు భక్తులు ఫిర్యాదు చేశారని ఆమె తెలిపారు. తిరుమలలోని అన్ని దుకాణాలలో ఒకే రేటుతో వాటర్ బాటిళ్లు విక్రయించాలలని సూచించారు. దుకాణదారులు తమ దుకాణాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని పేర్కొన్నారు.
Read more :
YS Jagan | ఏపీలో ఖూనీ అవుతున్న ప్రజాస్వామ్యం: వైఎస్ జగన్
Road Accident | రోడ్డు ప్రమాదంలో విద్యుత్ తీగలు తెగిపడి ఒకరి మృతి.. మరో ఐదుగురి పరిస్థితి విషమం
Read Today's Latest Devotional News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

