ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో మనం తినే ఆహారం, చేసే వ్యాయామం ముఖ్యమైనవి. కొందరికి వ్యాయామం చేయడానికి సమయం దొరకదు. మరికొందరికి వివిధ ఆరోగ్య సమస్యల కారణంగా వర్కవుట్లు చేసే పరిస్థితి ఉండదు. అయితే, వ్యాయామం చేయడానికి వీలుపడని మహిళలు కొన్ని ఆహార పదార్థాలు తీసుకోవడం, అలవాట్లు మార్చుకోవడం చాలా అవసరం.
పరిస్థితులు డిమాండ్ చేసినా.. అతిగా తినొద్దని గుర్తుంచుకోండి. తక్కువ క్యాలరీలు ఉన్న ఆహారం మాత్రమే తీసుకోవాలి. విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్ తగినంతగా ఉండేలా చూసుకోవాలి. వేపుళ్లకు నో చెప్పాలి. ఆవిరికి ఉడికించిన పదార్థాలు భేషుగ్గా తినొచ్చు. స్కిన్లెస్ చికెన్, చేపలు, అప్పుడప్పుడు రెడ్ మీట్ తీసుకోవచ్చు. కూల్డ్రింక్స్, చక్కెర పానీయాలను దూరం పెట్టాలి.
హెర్బల్ టీ తాగడం మంచిది. ఉపాహారంలో బీన్స్, తృణధాన్యాలతో చేసినవి, నానబెట్టిన బాదం తీసుకుంటే శరీరానికి అవసరమైన పోషణ అందుతుంది. కాబట్టి, తగినంత శారీరక శ్రమ చేయలేనప్పుడు.. జిహ్వ చాపల్యాన్ని వీడి, పక్కా డైట్ ఫాలో అయిపోతే.. ఏ సమస్యా ఉత్పన్నం కాదు.