Virosh | టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ, ప్రముఖ హీరోయిన్ రష్మిక మందన్న ఇటీవల వివాహ బంధంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ఈ స్టార్ జంట పెళ్లికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఇక గత రాత్రి వారి రిసెప్షన్ వేడుక అత్యంత ఘనంగా జరిగింది. ఈ వేడుకకు టాలీవుడ్, బాలీవుడ్‌కు చెందిన పలువురు సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు హాజరై నూతన దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు. ఇక పెళ్లి సంబరాలు ముగిసిన వెంటనే విజయ్ దేవరకొండ భార్య రష్మిక మందన్నతో కలిసి తన అమ్మమ్మ ఊరికి వెళ్లాడు.
విజయ్–రష్మిక మొదటగా మేనమామ, నిర్మాత యష్ రంగినేని ఇంటికి వెళ్లినట్లు సమాచారం. అనంతరం విజయ్ తన తాతయ్య రంగినేని గోపాల్ రావు మరియు అమ్మమ్మ రంగినేని ప్రమీల సమాధుల వద్దకు వెళ్లి నమస్కరించి ఆశీస్సులు తీసుకున్నారు. పెళ్లి తర్వాత కుటుంబ పెద్దలను స్మరించుకున్న విజయ్ భావోద్వేగానికి గురైనట్టు తెలుస్తుంది. రష్మిక కూడా విజయ్ కుటుంబ సభ్యులతో కలిసి ప్రార్థనలు చేసినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత ఈ జంట తమ బంధువుల ఇళ్లకు వెళ్లి పెద్దల ఆశీస్సులు తీసుకున్నారు. పెళ్లి అనంతరం తొలిసారి రష్మికను తన అమ్మమ్మ ఊరికి విజయ్ తీసుకెళ్లగా, ఆ జంటని చూసి అక్కడి గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేశారు.
ఇక ఈ స్టార్ జంటను దగ్గరగా చూడటానికి స్థానికులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. మరోవైపు విజయ్–రష్మికలతో ఫొటోలు దిగేందుకు గ్రామస్థులు ఆసక్తి చూపించారు. పెళ్లి తర్వాత మొదటిసారి కుటుంబ సంప్రదాయాలను పాటిస్తూ పెద్దల ఆశీస్సులు తీసుకోవడం అభిమానులను కూడా ఎంతో ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం ఈ జంట గ్రామానికి వెళ్లిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. గీతా గోవిందం, డియర్ కామ్రేడ్ చిత్రాలలో కలిసి నటించిన విజయ్ దేవరకొండ-రష్మిక జంట ప్రస్తుతం రణబాలి అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ మూవీతో పెద్ద హిట్ కొట్టడం ఖాయంగా కనిపిస్తుంది.