తిరుమల : తిరుమల, తిరుపతి దేవస్థానం అదనపు ఈవోగా ఐఆర్ఎస్ అధికారి వెంకయ్య చౌదరిని నియమించారు. ఈ మేరకు గురువారం ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి డిప్యుటేషన్‌పై వచ్చిన వెంకయ్య చౌదరిని ఏపీ కేడర్‌లోకి తీసుకుంటూ ఆదేశాలు జారీ చేశారు. జేఈవోగానూ ఆయన విధులు నిర్వహిస్తారని ఉత్తర్వులో స్పష్టం చేశారు.
తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. నిన్న స్వామివారిని 73,023 మంది భక్తులు దర్శించుకోగా 26,942 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు స్వామివారి దర్శనానికి 17 కంపార్టుమెంట్లలో వేచియున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీకి ఆదాయం రూ. 3.98 కోట్లు వచ్చిందన్నారు.