BRS | బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు గండిపేటలోని గోల్కొండ రిసార్ట్‌లో మంగళవారం ఒక్కరోజు వర్క్‌షాపు ప్రారంభమైంది. వర్క్‌షాపునకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ లీడర్ హరీశ్‌రావు, సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, అసెంబ్లీ విప్ కేపీ వివేకానంద హాజరయ్యారు.
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, లెవనెత్తాల్సిన ప్రజాసమస్యలు, శాసససభ, శాసనమండలి నియమనిబంధనలు, రూల్‌బుక్, రాజ్యాంగంలోని అంశాలపై ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలకు న్యాయకోవిదులు, రాజకీయ విశ్లేషకుల ద్వారా అవగాహన కల్పిస్తున్నారు. ఈ వర్క్‌షాప్‌లో కేటీఆర్ ప్రారంభోపన్యాసం చేయనున్నారు. ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్.. అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై దిశానిర్దేశం చేస్తారు. ఇటీవల రాష్ట్రంలో జరిగిన కీలక ఘటనలు, కాంగ్రెస్ సర్కార్ పాలనలో తప్పిదాలు, సభల్లో ప్రస్తావించాల్సిన అంశాలపై సూచనలు చేయనున్నారు.