billionaires | దేశంలో పెరిగిపోతున్న బిలియనీర్ల సంఖ్య.. ఏడాదిలో వంద కోట్లు సంపాదించిన 570 మంది
billionaires : భారత దేశంలో ధనవంతుల సంఖ్య భారీగా పెరిగిపోతోంది. ముఖ్యంగా ఏడాదికి కనీసం వంద కోట్ల రూపాయలు సంపాదించే వారి సంఖ్య పెరిగిపోతున్నట్లు కేంద్రం తాజాగా వెల్లడించింది. 2025-2026 ఆర్థిక సంవత్సరంలో దేశంలో 576 మంది రూ.100 కోట్లు సంపాదించినట్లు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ సోమవారం పార్లమెంట్లో వెల్లడించింది.
billionaires : భారత దేశంలో ధనవంతుల సంఖ్య భారీగా పెరిగిపోతోంది. ముఖ్యంగా ఏడాదికి కనీసం వంద కోట్ల రూపాయలు సంపాదించే వారి సంఖ్య పెరిగిపోతున్నట్లు కేంద్రం తాజాగా వెల్లడించింది. 2025-2026 ఆర్థిక సంవత్సరంలో దేశంలో 576 మంది రూ.100 కోట్లు సంపాదించినట్లు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ సోమవారం పార్లమెంట్లో వెల్లడించింది. ఇది అంతకముందు ఏడాది.. అంటే 2024-25లో 415 మందిగా ఉండేది. అంటే ఒక్క ఏడాదిలోనే వంద కోట్ల రూపాయలు సంపాదించే వారి సంఖ్య 150 మందికిపైగా పెరిగింది.
ఈ విషయాన్ని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ తరఫున మంత్రి పంకజ్ చౌదరి పార్లమెంట్లో వెల్లడించారు. పన్ను చెల్లింపు వివరాల ఆధారంగా కేంద్రం ఈ వివరాలు ప్రకటించింది. దేశంలో బిలియనీర్ల (రూ.100 కోట్లు ఆదాయం కలిగిన వారు) సంఖ్య పెరిగిపోతున్నట్లు తెలిపింది. గతంలో ఈ సంఖ్య చాలా తక్కువగా ఉండేది. ఐదేళ్లక్రితం.. అంటే 2021-2022లో బిలియనీర్ల సంఖ్య 142 మాత్రమే. అంటే, ఐదేళ్లలో బిలియనీర్ల సంఖ్య 300 శాతం పెరిగింది. 2022-2023లో 301 మంది, 2023-2024లో 284 మంది ఏడాదికి రూ.100 కోట్లు సంపాదించారు. అయితే, ప్రభుత్వం వద్ద బిలియనీర్లు అంటే ప్రత్యేకమైన నిర్వచనం అంటూ ఏదీ లేదని కేంద్రం తెలిపింది. రూ.100 కోట్లు లేదా అంతకంటే ఎక్కువ డబ్బులు సంపాదిస్తూ, ఇన్‌కంట్యాక్స్ చెల్లించే వారి వివరాల ఆధారంగా ఈ డాటా విడుదల చేసినట్లు కేంద్రం తెలిపింది.
ఇదే సమయంలో ఆర్థిక అసమానతల్ని తొలగించేందుకు కేంద్రం చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపింది. వివిధ రకాల పన్నులు విధించడంతోపాటు సంక్షేమ కార్యక్రమాల్ని కూడా చేపడుతున్నట్లు వివరించింది. అత్యధికంగా సంపాదించేవారిపై అదనపు సర్ఛార్జ్ వసూలు చేస్తున్నామని, మధ్యస్థాయి సంపాదన ఉన్నవారికి సాధారణ పన్నులే విధిస్తున్నామని కేంద్రం ప్రకటించింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Congress | మా ముందుకొచ్చి మాట్లాడే దమ్ముందా?.. కాంగ్రెస్ నేతలకు రైతు సవాల్
Malasiya | భారతీయులకు మలేషియా షాక్.. వీసా ఫ్రీ ఎంట్రీ నిలిపివేత
Aadhar Card | ‘పుట్టిన తేదీకి ఆధార్ కార్డ్ ధ్రువపత్రం కాదు’
PF Withdraw | ఇకపై నెలనెలా పీఎఫ్ విత్‌డ్రా.. సిస్టమాటిక్ విత్‌డ్రాయల్ ప్లాన్‌కు ఈపీఎఫ్‌వో ఆమోదం
Shah Rukh Khan | షారుఖ్ఖాన్అరుదైన ఘనత.. ది 100 గ్రేటెస్ట్ మూవీ స్టార్స్ ఆఫ్ ఆల్‌టైమ్ జాబితాలో చోటు
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

