చండూరు, జూలై 29 : చండూరు మండల కేంద్రంలోని 1962 అంబులెన్స్‌ను జిల్లా ఈఎంఈ ప్రదీప్ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం 2017లో 1962 సంచార పశు వైద్యశాల అత్యవసర సేవలను ప్రవేశ పెట్టిందన్నారు. పశువులకు అందుతున్న చికిత్స గురించి వెహికల్ లో ఉన్నటువంటి మెడిసిన్ గురించి స్థానిక 1962 అంబులెన్స్ డాక్టర్ మహిధర్ రెడ్డిని అడిగి తెలుసుకున్నారు. అలాగే మూగ జీవాలకు మెరుగైన ట్రీట్మెంట్ అందించాలని సూచించారు. మూగజీవాలను కాపాడటమే లక్ష్యంగా1962 అంబులెన్స్ సేవలను అందజేస్తున్నాం కాబట్టి ఈ సేవలు మరింత సమర్థంగా అందించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. అలాగే రైతులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో పైలట్ కురుపాటి లింగస్వామి, హెల్పర్ చిరంజీవి పాల్గొన్నారు.